Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home inspiration

ఈ పెయింటింగ్ లో కుడివైపున్న మ‌హిళను గమనించారా ? ఆమె చీర‌ ఎత్తి మ‌రీ చేతిని చూప‌డం వెనుక అద్భుత‌మైన సందేశం ఉంది ఏమిటంటే ?

Admin by Admin
April 18, 2025
in inspiration, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి అతలాకుతలం చేసింది. కొన్ని లక్షల మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. అంతేకాదు ఎంతోమంది తమ ప్రాణాలను సైతం కోల్పోయారు. అయితే ఇలాంటి మహమ్మారులు మానవాళికి కొత్త కాదు. మన పూర్వీకులు సైతం ఎదుర్కొన్న అంటురోగాలలో కొన్ని ఇప్పటికీ మనతోనే ఉన్నాయన్నది వాస్తవం. 19వ శతాబ్దంలో కూడా భారతదేశంలో స్మాల్ పాక్స్ లేదా మసూచి అని పిలిచే ఈ అంటూ వ్యాధి అప్పుడు కూడా దేశాన్ని అతలాకుతలం చేసింది. కానీ ఈ అంటూ వ్యాధిని సైన్స్ పూర్తిగా తుడిచిపెట్టగలిగింది. మసూచిని మొట్టమొదటిసారిగా 1520లో గుర్తించారు. వరియోల మైనర్ అనే వైరస్ ద్వారా వ్యాప్తించే ఈ వ్యాధి ప్రాణాంతకమైనది. ఇది ఒక భయంకరమైన చర్మవ్యాధి. శరీరంపై నీటితో నిండిన పొక్కులు ఏర్పడతాయి. పదిమందిలో ముగ్గురు ఈ అంటురోగం బారిన పడి చనిపోయారు.

ఆ కాలంలో ఈ వ్యాధి తుమ్ము, దగ్గులతోపాటు బయటికి వచ్చే తుంపర్ల ద్వారా.. లేదా శరీరంపై ఏర్పడే పుండ్ల ద్వారా ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందింది. ప్లేగు వ్యాధి లాగానే మసూచి కూడా కొన్ని కోట్ల మంది ప్రాణాలను హరించింది. 20వ శతాబ్దంలోనే మసూచి బారిన పడి 30 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆ సమయంలో గీసిన ఓ పెయింటింగ్ గురించి ప్రస్తుతం మనం తెలుసుకోబోతున్నాం. ఈ పెయింటింగ్ లో ఉన్న అందమైన ముగ్గురు రాజవంశ స్త్రీలలో కుడివైపున ఉన్న స్త్రీ తన చీరను కొంచెం పైకెత్తి చూపిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇలా ఈ పెయింటింగ్ గీయడానికి గల కారణం ఏమిటంటే.. మసూచి మహమ్మారి వేగంగా వ్యాపిస్తున్న సమయంలో మైసూర్ ప్రాంతంలో కూడా ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందింది. ఆ సమయంలో మైసూరులో బ్రిటిష్ ఇండియా తరఫున పరిపాలన వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న మార్క్ విల్కేస్ మైసూర్ రాజ్య ప్రజలను మసూచి నివారణకు టీకాలు వేయించుకోవాల్సిందిగా కోరారు.

have you observed this painting

కానీ ఆ సమయంలో బ్రిటిష్ టీకాలు ప్రాణానికి ముప్పు అనే వదంతులు దేశమంతా చెక్కర్లు కొట్టాయి. దీంతో చాలామంది ఆ టీకాలు వేయించుకోవడానికి తిరస్కరించారు. ఇదే సందర్భంలో మైసూర్ రాజ్య యువరాజుకు ఈ ఫోటోలో కుడివైపున ఉన్న దేవజమనితో నిశ్చితార్థం జరిగింది. ఆ సందర్భంగా ప్రజలలో అవగాహన కల్పించేందుకు ఆ యువరాణి పెళ్ళికి ముందే బ్రిటిష్ టీకాలను వేయించుకుంది. యువరాజుకు కాబోయే భార్యనే టీకా వేయించుకుంది.. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి టీకాలు వేయించుకోవాలని ఈ పెయింటింగ్ ద్వారా కోరారు. అందుకే ఈ పెయింటింగ్ లో టీకా వేయించుకున్న స్త్రీ ఆమెనే అని తెలిపేందుకు సింబాలిక్ గా చూపించారు.

Tags: painting
Previous Post

బిర్యానీకి ఆ పేరు ఎలా వ‌చ్చింది.! HYD బిర్యానీని ప‌రిచయం చేసింది ఎవరు ?

Next Post

అక్కినేని ఫ్యామిలీ పేర్ల‌కు ముందుగా నాగ అని ఎందుకు ఉంటుంది ? దానికి కారణం ఏంటి !

Related Posts

vastu

మీ ఇంట్లో తాబేలు విగ్ర‌హాన్ని ఇలా పెట్టండి.. ల‌క్ క‌ల‌సి వ‌స్తుంది..!

July 23, 2025
వినోదం

కెరీర్ పిక్స్ లో ఉండగా మరణించిన ప్రముఖ సినీ సెలెబ్రిటీలు వీళ్లే?

July 23, 2025
ఆధ్యాత్మికం

ఒకే గోత్రం ఉన్న‌వారు పెళ్లి చేసుకోకూడ‌దా..? వివాహం అయితే పిల్ల‌లు పుట్టరా..?

July 23, 2025
వైద్య విజ్ఞానం

దంతాలు, చిగుళ్లు, నోరు ఆరోగ్యంగా లేక‌పోతే గుండె జ‌బ్బులు వ‌స్తాయా..?

July 23, 2025
ఆధ్యాత్మికం

ప‌సికందుల క‌ణ‌త‌ల‌కు న‌ల్లని చుక్క ఎందుకు పెడ‌తారో తెలుసా..?

July 23, 2025
హెల్త్ టిప్స్

అంద‌మైన వ‌క్ష సంప‌ద కావాలంటే.. అమ్మాయిలు ఈ చిట్కాల‌ను పాటించాలి..!

July 23, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.