Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home inspiration

పేద‌రికాన్ని ఎగ‌తాళి చేయ‌కూడ‌దు.. ప్ర‌తిభ ఎక్క‌డ ఉన్నా ప్రోత్స‌హించాల‌ని చెప్పే క‌థ‌..!

Admin by Admin
July 4, 2025
in inspiration, వార్త‌లు
Share on FacebookShare on Twitter

చిరిగిన పంచె, చిరిగిన చొక్కా ధరించిన ఒక వ్యక్తి తన 15-16 సంవత్సరాల కుమార్తెతో ఒక పెద్ద హోటల్‌కు వచ్చాడు. ఇద్దరూ కుర్చీపై కూర్చోవడం చూసి, ఒక వెయిటర్ రెండు గ్లాసుల చల్లటి నీటిని వారి ముందు పెట్టి అడిగాడు మీ కోసం ఏమి తీసుకురావాలి అని? ఆ వ్యక్తి ఇలా అన్నాడు.. జిల్లాలో పదవ తరగతిలో మొదటి స్థానంలో వస్తే, నగరంలోని అతిపెద్ద హోటల్ లో దోశ తినిపిస్తాను అని మా అమ్మాయికి వాగ్దానం చేశాను. మా అమ్మాయి అయితే తన వాగ్దానాన్ని నెరవేర్చింది. కనుక దయచేసి తన కోసం ఒక దోశ తీసుకురండి అని అతను అడగడం జరిగింది. మీ అమ్మాయికైతే ఒక దోశ చెప్పారు.. మరి మీకేమి కావాలి అని అతన్ని వెయిటర్ అడిగాడు ? అతను కొంచం బాధాతత్వ హృదయంతో ఇలా అన్నాడు, నా దగ్గర ఒక దోశకి సరిపడే డబ్బే మాత్రమే ఉంది. కాబట్టి ఇంక నాకేమి వద్దు! విషయం విన్న తర్వాత వెయిటర్ బాధపడి యజమాని వద్దకు వెళ్లి జరిగింది చెప్పాడు.. నేను వీళ్ళ ఇద్దరికీ కడుపు నిండా పూర్తి భోజనం చేయించాలి అని అనుకుంటున్నాను . ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు, కాబట్టి మీరు వారి బిల్లు మొత్తాన్ని నా జీతం నుండి తీసుకోండి అని వెయిటర్ అనగా.. అప్పుడు అది విన్న యజమాని వెయిటర్ ని అభినందిస్తూ ఇలా అనడం జరిగింది .. ఈ రోజు మనం మన హోటల్ తరపున తను ఫస్ట్ వచ్చినందుకు వీళ్ళకి పార్టీ ఇద్దాం.. అన్నాడు, ఇది విని వెయిటర్ చాలా ఆనందపడ్డాడు.

హోటల్ వాళ్ళు ఒక టేబుల్‌ను చక్కగా అలంకరించారు. ఎవరైతే హోటల్లో ఉన్నారో వారందరితో పేద అమ్మాయి విజయాన్ని చాలా అద్భుతంగా జరుపుకున్నారు. ఆ యజమాని వాళ్లకి మూడు దోశలు పెట్టడంతో పాటు పొరుగువారికి కూడా స్వీట్స్ పంచమని పెద్ద సంచిలో ప్యాక్ చేసి ఇచ్చాడు. తమను చాలా గౌరవించి సత్కరించిన హటల్ యజమానికి, వెయిటర్ కి కన్నీళ్లతో కృతజ్ఞతను తెలిపి అక్కడ నుంచి నిష్క్రమించారు ఆ తండ్రి , కూతురు. సమయం గడిచిపోయింది (కొన్ని సంవత్సరాల పిమ్మట).. ఒక రోజు ఆ అమ్మాయే I.A.S. పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఆ నగరానికే కలెక్టర్‌గా వచ్చింది. ఆమె ముందు తన సర్వెంట్ ని అదే హోటల్‌కు పంపించి కలెక్టర్ గారు అల్పాహారం తీసుకోవడానికి వస్తానని చెప్పమన్నారు అనగా హోటల్ యజమాని వెంటనే ఒక టేబుల్‌ను బాగా అలంకరించాడు. ఈ వార్త వినగానే హోటల్ మొత్తం కస్టమర్లతో నిండిపోయింది కలెక్టర్ గారిని చూడటానికి.

we should not insult poor people real moral story

అదే అమ్మాయి కలెక్టర్ అయి తన తల్లిదండ్రులతో కలసి నవ్వుతూ హోటల్ వద్దకు వచ్చింది. అందరూ ఆమెను చూసి గౌరవార్థంగా నిలబడ్డారు. హోటల్ యజమాని ఆమెకు ఒక పూల గుత్తిని సమర్పించగా .. వెయిటర్ టిఫిన్ ఆర్డర్ కోసం అభ్యర్థించారు. కలెక్టర్ గా ఆ హోటల్ కి వచ్చిన ఆమె ఇలా చెప్పింది- మీరిద్దరూ నన్ను గుర్తించలేకపోవచ్చు. ఒకప్పుడు నేను , మాతండ్రితో కలసి మీ హోటల్ కి వచ్చినప్పుడు నేను చదువులో మెుదటి ర్యాంకు తెచ్చుకున్న విషయం మీకు తెలిసి.. మా వద్ద తగినంత ధనం లేకున్నా కూడా మీరు సంతోషంతో మాకు అన్ని వడ్డించడమే కాక మా వద్ద నుండి ఒక్క పైసా కూడ అడగక పోవడమే కాక మమల్ని మీరు ఘనంగా సత్కరించడం జరిగింది . ఆనాడు మీరిద్దరూ మానవత్వానికి నిజమైన ఉదాహరణగా నిలిచారు, నేను పాస్ అయినందుకు ఒక అద్భుతమైన పార్టీని ఇచ్చి, మాకే కాకుండా మా పొరుగువారికి కూడా ఇవ్వమని స్వీట్లు ప్యాక్ చేసి ఇచ్చారు.

ఈ రోజు నేను మీ ఇద్దరి ఆశీస్సుల వల్ల కలెక్టర్ అయ్యాను. మీ ఇద్దరినీ నేను ఎప్పుడూ నా జన్మంతా గుర్తుంచుకుంటాను. ఈ రోజు ఈ పార్టీ నా తర‌పున, ఇక్కడ ఉన్న కస్టమర్లందరికీ, మొత్తం హోటల్ సిబ్బందికి బిల్ నేను కడతాను. అలా అని అందరి ముందు హోటల్ యజమనితో పాటు వెయిటర్ని కూడా సత్కరించడం జరిగింది. నీతి: పేదరికాన్ని ఎగతాళి చేయకుండా, వాళ్ళలో ఉన్న ప్రతిభను గుర్తించి గౌరవించండి.. వాళ్ళను ప్రోత్సహించండి.

Tags: people
Previous Post

ఈ ఆహారాల‌ను తింటే థైరాయిడ్ ఉన్న‌వారికి ఎంతో మేలు జ‌రుగుతుంది..!

Next Post

ఎలాన్ మస్క్‌ను నేటి తరంలో అత్యుత్తమ శాస్త్రవేత్త అనవచ్చా? కేవలం వ్యాపారవేత్త అనుకోవాలా?

Related Posts

హెల్త్ టిప్స్

పాప్‌కార్న్‌ను అధికంగా తింటున్నారా..? అయితే ముందు ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

July 22, 2025
inspiration

మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ వాడే ఫోన్ ఏంటో తెలుసా..? ఆపిల్ iPhone వాడకపోవటానికి కారణం ఇదే..!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోజూ భోజ‌నంలో పెరుగును త‌ప్ప‌నిస‌రిగా తినాల్సిందే.. ఎందుకంటే..?

July 22, 2025
mythology

ఈ ప‌నులు చేస్తున్నారా..? అయితే ఆయుష్షు త‌గ్గుతుంద‌ట‌.. గ‌రుడ పురాణంలో చెప్పారు..!

July 22, 2025
వినోదం

1980లో టాలీవుడ్ హీరోలు ఎంత రెమ్యూనరేషన్ తీసుకునే వారో తెలుసా?

July 22, 2025
ఆధ్యాత్మికం

చిన్నారుల‌కు చెవులు కుట్టించే ఆచారం వెనుక దాగి ఉన్న సైన్స్ ఇదే.. ఎలాంటి లాభాలు ఉంటాయంటే..?

July 22, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.