Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home international

అమెరికన్ యుద్ధ విమానాల కన్నా రష్యన్ యుద్ధ విమానాలు ఎందుకు భారీగా ఉంటాయి?

Admin by Admin
May 28, 2025
in international, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ యుద్ధవిమానాలు. వీటిలో అతిపెద్దది రష్యాకు చెందిన సుఖోయ్-57. సాధారణంగా రష్యా మిగతా యుద్ధవిమానాల పరిమాణం కూడా సగటు కంటే కాస్త పెద్దగానే ఉంటుంది. అందుకు పలు కారణాలు.. రష్యా కొత్త విమానాలను రూపొందించటం కంటే ఉన్న నమూనాలనే నవీకరించి వాడటంపై దృష్టి పెడుతుంది. ఉదాహరణకు వారి బాంబర్లైన Tu-95 నమూనా 1956లో రూపొందించినదైతే Tu-160 1981లో రూపొందించినది. సాంకేతికత మెరుగుపరుచుకుంటున్నా, భౌతిక కొలతల్లో భారీ మార్పులు లేవు. అమెరికా ఎప్పటికప్పుడు స్పెషలైజ్డ్ యుద్ధవిమానాలు, అదీ అధిక సంఖ్యలో, తయారు చెయ్యటంపై దృష్టి పెడుతుంది. అందుకే ఇరురాజ్యాల వైమానిక బడ్జెట్లలో భారీ వ్యత్యాసం.

చిన్నవి, విశిష్టమైనవి అయిన యుద్ధవిమానాల తయారీకి భారీగా నిధులు అవసరం. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు, ఉగ్రవాద సంస్థలకు ఆయుధాలు అమ్ముతున్నప్పటికీ రష్యా రక్షణ బడ్జెట్ అమెరికాకు ధీటుగా లేదన్నది విదితం. రష్యా భూభాగానికి, అమెరికా భూభాగానికి చాలా వైవిధ్యముంది. అధికశాతం రష్యా భూభాగంలో జనాభా నివసించేందుకు అనుకూల పరిస్థితులు లేవు. అలాంటి చోట్ల యుద్ధవిమానాల కొరకు విమానాశ్రయాలు నిర్మించి, నిర్వహించటం చాలా ఖర్చుతో కూడిన శిరోభారం. అంచేత వారి యుద్ధ విమానాలు ఒకేసారి ఎక్కువ దూరం ప్రయాణించగలిగేలా ఉండాలి. అందుకు ఇంధనం ఎక్కువ అవసరం. ఎక్కువ ఇంధనం మోసుకెళ్ళే విమానం పెద్దదిగానే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా – రష్యా సైనిక స్థావరాల చిరునామాల నుండి ఈ విషయం విస్పష్టం.

russia vs usa fighter jets why they are heavy

పై కారణంచేత రష్యా యుద్ధవిమానాలకు స్టెల్త్ (రహస్య) గగనవిహారం అతిముఖ్యం. దాని కొరకు విమానం చుట్టూ RADAR ఉపకరణాలు అమరుస్తారు. పైగా రష్యా వాడుతున్న RADAR సుమారు దశాబ్దం క్రితంది. విమానం పరిమాణం పెరగటానికి ఇదీ ఒక కారణమే. అయితే విమానం చుట్టుకొలత పెరిగేకొద్దీ శత్రునిఘా ఇంకా తేలిగ్గా విమానాలను కనిపెట్టగలదు. మరొక ముఖ్యాంశం – అమెరికా చుట్టూ సముద్రం అయితే రష్యా చుట్టూ శత్రుదేశాలు ఎక్కువ. అంచేత రష్యా భూభాగంలోంచి శత్రుభూభాగానికి ఒకేసారి పలురకాల క్షిపణులు మోసుకెళ్ళగల సర్వతోముఖంగా యుద్ధవిమానాలు ఉండాలి. అమెరికా తమ యుద్ధ విమానాలను మిత్రదేశాల్లో, శత్రుదేశాలకు దగ్గరగా మోహరిస్తారు కావున వారి యుద్ధ విమానాలు ఎక్కువగా విశిష్ట పనులకు రూపొందించబడి ఉంటాయి. అంటే ఫలానా క్షిపణులకు ఫలానా విమానాలు. అందుకే అవి చిన్నగా ఉంటే పని జరిగిపోతుంది. అందుకే వారు పరిమాణంలో చిన్నవైనా అధిక సంఖ్యలో విమానాలు తయారు చేసేది.

సూక్ష్మాంశమైనా పరిగణించవలసినదేమిటంటే అమెరికా యుద్ధ విమానాలు తయారు చేసే సంస్థలు ఎక్కువ – Boeing, General Dynamics, Lockheed Martin, McDonnell Douglas, Northrop Grumman. పోటీ వల్ల ఎవరికివారు అత్యుత్తమ విమానాలు తయారు చెయ్యాలన్న పరుగు సహజం. పైగా, విప్లవాత్మక యుద్ధవిమానాలు తయారు చేసేప్పుడు వీటిలో పలు సంస్థలు కలిసి పనిచేస్తాయి కూడా. అందుచేత మెరుగైన సాంకేతికత, డిజైన్లు రూపొందటం జరుగుతూంటుంది. రష్యా విషయంలో యుద్ధవిమానాలు తయారు చేసే సంస్థలన్నిటినీ 2006లో విలీనం చేసి ఒకే సంస్థ (UAC)గా అవతరింపజేశారు. సాధారణంగా ఇలా ఏకాధికారం ఉంటే నవీకరణ వెనకడుగు వేస్తుంది.

Tags: fighter jetsRussiausa
Previous Post

నిద్రించేట‌ప్పుడు ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ త‌ప్పుల‌ను చేయ‌కండి..!

Next Post

వై ఎస్ రాజశేఖర రెడ్డి కారణంగానే సత్యం రామలింగరాజు జైలుకు వెళ్లారని అంటారు. అది నిజమేనా?

Related Posts

mythology

శ్రీ‌కృష్ణుడు ఎన్ని శాపాల‌ను ఎదుర్కొన్నాడో తెలుసా..?

July 24, 2025
వినోదం

విక్టరీ వెంకటేష్ ముగ్గురు కూతుళ్ల గురించి ఆసక్తికరమైన విషయాలు..!

July 24, 2025
ఆధ్యాత్మికం

శివ‌పార్వ‌తుల వివాహం జ‌రిగిన చోటు ఇప్పుడు ఎక్క‌డ ఉందో తెలుసా..?

July 24, 2025
హెల్త్ టిప్స్

మ‌ద్యం సేవించ‌డం మానేయ‌లేక‌పోతున్నారా..? ఇలా చేస్తే ఈజీగా మానేయ‌వ‌చ్చు..!

July 24, 2025
lifestyle

పెళ్ళిలో వధూవరులు తెల్లని వస్త్రాలే ఎందుకు ధరిస్తారో తెలుసా..? అసలు కారణం ఇదే..!

July 23, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

ఈ కాఫీని తాగితే ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉంటాయ‌ట‌..!

July 23, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
మొక్క‌లు

Gadida Gadapaku : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో.. చేల‌లో ల‌భించే మొక్క ఇది.. అస‌లు విడిచిపెట్ట‌వ‌ద్దు..!

by D
June 10, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.