Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

జీవితంలో మీరు ఏ రంగంలో అయినా విజ‌యం సాధించాలంటే క‌చ్చితంగా పాటించాల్సిన సూత్రాలు..

Admin by Admin
May 20, 2025
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

విజయం సాధించాలనీ.. పది మందిలో నీకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును కోరుకుంటున్నారా? అయితే విజయ తీరాలను ఎలా చేరుకోవాలో తెలుసుకుందా రండి. పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతుంటే.. కచ్చితంగా మెుబైల్‌ ఫోన్‌ వాడకాన్ని తగ్గించుకోండి. మెుబైల్‌ ఫోన్‌ మంచిగానూ, చెడుగానూ ఉపయోగపడుతుంది. ఫోన్‌ చేతిలో ఉంటే విజ్ఞాన భాండాగారం అరచేతిలో ఉన్నట్లే.. అదే విధంగా ఏకాగ్రతను దెబ్బతీసే యాప్స్‌ కూడా ఉంటాయి. ఏదో నోటిఫికేషన్‌ వచ్చిందనో, లేదా ఏం మెసేజ్‌ రాలేదా అన్న అనుమానంతో మొబైల్‌ను చాలా మంది చెక్‌ చేస్తూ ఉంటారు. దీనివల్ల చదవాలన్న ఏకాగ్రత పూర్తిగా దెబ్బతింటుంది. కాబట్టి చదువుకునేటప్పుడు ఫోన్‌ను ముట్టుకోకండి. ఒకవేళ మీరు ఆన్‌లైన్‌ క్లాసులు, లేదా ఫోన్‌లోని పీడీఎఫ్‌ల ద్వారా చదువుతుంటుంటే, యాప్స్‌ నోటిఫికేన్స్‌ను బ్లాక్‌ చేయండి. దీనివల్ల మీ ప్రిపరేషన్‌ సాఫీగా సాగుతుంది.

ఉద‌యాన్నే నిద్ర లేవ‌డం అల‌వాటు చేసుకోండి. త్వరగా లేచి ఏమి చేయాలి… ఏలాగూ క్లాస్‌ 9 గంటలకు కదా అని మంచంపై ముసుగేసి పడుకుంటున్నారు. అయితే ఈ అలవాటు కచ్చితంగా మార్చుకోవాల్సిందే. ఉదయాన్నే లేవటం ద్వారా చాలా పనులు త్వరగా పూర్తి చేసుకొని, సమయానికి క్లాసులకు వెళ్లొచ్చు, ఎటువంటి కంగారు లేకుండా. అంతేగాకుండా ఉదయాన్నే లేచి, వ్యాయామం, యోగా వంటివి చేస్తే ఏకాగ్రతపై పట్టు వస్తుంది. ఉదయం లేవటం వల్ల శరీరం కూడా చురుకుగా పని చేస్తుంది. క్రమం తప్పకుండా ఉదయాన్నే లేచి మీ డైలీ రొటీన్‌ కంప్లీట్‌ చేసి, చూడండి.. మీరే తేడాను గమనిస్తారు. అవసరానికి చిన్నచిన్న అబద్ధాలు ఆడటం, వాటిని కప్పిపుచ్చటానికి మరిన్ని అబద్ధాలు ఆడాల్సి వస్తుంది కదా.. నేటి నుంచే ఈ అబద్ధాలకు ఫుల్‌ స్టాప్‌ పెట్టేయండి. వీటి వల్ల జీవితంపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

if you want to succeed in your life follow these rules

నిజం ఎప్పుడు తెలిసిపోతుందా అని గాభారా పడటం, ఒకవేళ తెలిస్తే ఏమవుతుందా అని ఒత్తిడికి గురికావాల్సి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధాలు చెప్పకండి. ఒకవేళ చెప్పాల్సి వస్తే.. అక్కడ నుంచి నెమ్మదిగా నిష్క్రమించండి. ఆలోచన లేకుండా ఎవ్వరికీ మాట ఇచ్చేయకండి. పరిస్థితులను అర్థం చేసుకోండి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అవతలి వారితో మాట్లాడేటప్పుడు ఆలోచించి ఆచితూచి మాట్లాడండి. మీకు ఎంత తెలిసినవారైనా సరే, మీ వ్యక్తిగత విషయాలను అతిగా షేర్‌ చేసుకోకండి. దీనివల్ల మీరు ఇబ్బందుల‌లో పడే అవకాశం ఉంది. మీ బలహీనతలను అవతలి వాళ్లు అవకాశాలుగా మలుచుకునే అవకాశం ఉంటుంది, కాబట్టి ఒక విషయం చెప్పేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించండి. పుస్తకాలు నిజమైన మిత్రులని తెలుసుకోండి. ఎక్కువ‌గా పుస్తకాలను చదివేందుకు ప్రాధాన్యం ఇవ్వండి.

ఎంత టెక్నాలజీ పెరిగినా, కంప్యూటర్లు, ట్యాబ్‌లు, మొబైల్‌ ఫోన్లలో కావాల్సిన సమాచారం దొరుకుతున్నా.. పుస్తకాలు ఓ మంచి వైబ్రేషన్‌ను క్రియేట్‌ చేస్తాయి. గ్యాడ్జెట్స్‌ నుంచి వచ్చే వెలుతురు వల్ల కంటికి అంత మంచిది కాదు. కాబట్టి గంటల తరబడి మొబైల్‌ వంటి ఇతర గ్యాడ్జెట్స్‌లో చదవలేము. పుస్తకాలతో అయితే ఎటువంటి ప్రమాదం ఉండదు, కాబట్టి పుస్తకాలకే ప్రాధాన్యత ఇవ్వండి. చాలా మంది నేను ఇది అవుతా, అది అవుతా.. అప్పుడు ఇలా తిరుగుతా అంటూ ఊహల లోకంలో విహరిస్తూ ఉంటారు. కలలు కనటం మంచిదే గానీ.. కలల లోకంలో విహరించటమే తప్పు. నిజ జీవితంలో జీవించటం మెుదలుపెట్టండి. కలలను ఎలా సాకారం చేసుకోవాలో, ఏం చేస్తే గోల్స్‌ను రీచ్‌ అవ్వగలరో ఆ దారులను వెతుక్కోండి. ఊహా లోకాన్ని విడిచి పెట్టండి.

Tags: rulessuccess
Previous Post

ఇవి మీకు గుర్తున్నాయా.. మీలో ఎంత మంది ఎంజాయ్ చేశారు..?

Next Post

ఎవ‌రైనా మిమ్మ‌ల్ని ల‌వ్ చేస్తుంటే వారిలో ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయ‌ట‌..!

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025

POPULAR POSTS

No Content Available
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.