వెంకటేశ్వరస్వామి దేవాలయం అత్యంత సుందరంగా నిర్మించారు. ఈ దేవాలయాన్ని నిర్మించినది తొండమాన్ చక్రవర్తి అని చెప్తారు. తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సహోదరుడు. ఇక్కడ రాయబడిన శాసనాల ప్రకారం 1500చరిత్ర ప్రకారం పల్లవ రాణి క్రీ.శ.614లో ఆనంద నిలయంపునరుద్దరణ చేసారు. స్వామి ఉత్సవాలు, ఆభరణాలు యువరాణి సమర్పిస్తుంది. చరిత్రలో ఆమె ఒక పెద్ద భక్తురాలుగా నిలిచివుంది.ఆ యువరాణిని పరుందేవి అని కూడా పిలుస్తారు.19వ శతాభ్దంచివరిలో స్వామిదేవాలయం, హతిరామ మటం వదిలి వేరే ఏవిధమైన నిర్మాణం లేదు.అర్చకులు కూడా కొండ క్రింద వుండే గదుల్లో ఉండేవారు. మనకు సామాన్యంగా తిరుపతికి వెళ్లినతర్వాత మూడవప్రశ్న ఏమంటే ఈ పుణ్య క్షేత్రాన్ని నిర్మించినది ఎవరు అని.ఈ అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించినది తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం ప్రదేశానికి రాజైన తొండమాన్.ఇతనికి ఒక రోజు విష్ణుమూర్తి కలలో కనపడి ఈవిధంగా చెప్పెన. గత జన్మలో నీవు రంగదాసు అనే పేరుతోపిలవబడి,నా భక్తుడై వున్నావు అని చెప్పెను.
ఈ విధంగా వెంకటేశ్వరస్వామి శేషాచలంకొండ మీద వెలసియున్నాడని, కలియుగాంతంవరకూ అక్కడే వుంటాను అని అందువలన నీవు అక్కడ దేవాలయాన్ని నిర్మించాలని చెప్పెను. దీనికి సంతోషించిన తొండమాన్ రాజు విశ్వకర్మను పిలిచి దేవాలయం యొక్క ప్రణాళిక సిద్ధంచేసెను. అద్భుతంగా దేవాలయాన్ని నిర్మాణం చేసెను. తొండమాన్ ను ఆకాశరాజు సహోదరుడు. ఇతని అనంతరం చోళులు, పల్లవులు, విజయనగరరాజులు మొదలైనవారు దేవాలయం అభివృద్ధికి కృషిచేసిరి. ఈ దేవాలయంలో ఆస్వామి అలంకారానికి ఖర్చు బంగారు ఆభరణాలు సుమారు 12 కె.జి బరువు కలిగి వున్నది. ఈ స్వామికి అలంకారం చేయాలంటే ఒక్కరితో అయ్యేపనికాదు. దేవాలయంలో వుండే స్వామి కిరీటం నీలిరంగులో వుండిన వజ్రాలతోకూడిన ప్రపంచంలో ఎక్కడా చూడనటువంటి దాని ధర ఎన్నో లక్ష కోట్ల విలువ చేస్తుందని పూజారులు అభిప్రాయపడతారు. శ్రీ కృష్ణదేవారాయలు తిరుమలను పరిపాలించిన 21 సంవత్సరాలూ స్వర్ణ యుగం అని చెప్పవచ్చు.ఆ సమయంలో శ్రీకృష్ణదేవరాయలు వెలకట్టలేనంత వజ్రాలు, మొదలైనవాటి నుంచి ధగధగా మెరిసిపోయే వజ్రాల కిరీటాన్ని స్వామికి అర్పించెను.
12వశతాబ్దంనుంచి శ్రీ వెంకటేశ్వర స్వామికి స్వర్ణయుగం ప్రారంభమాయెను. ఆ సమయంలో అనేక కిరీటాలు స్వామికి సమర్పించారు.అవి మూలవిరాట్ కి 6కిరీటాలు, ఉత్సవమూర్తికి 7కిరీటాలు, 20ముత్యాలహారాలు, స్వర్ణపీపీఠాలు, స్వర్ణపాదాలు, లెక్కలేనన్ని బంగారు ఆభరణాలు స్వామికి సమర్పించారు. శ్రీవేంకటేశ్వరస్వామి తిరుమలలో వెలయుటకు కారణం ఏమిటి అనే రహస్యం అంతగా ఎవరికీతెలియదు.పూర్వం నారదముని భూ లోకంలో మానవులకు భగవంతునిమీద నమ్మకం, భక్తి, విశ్వాసాలు లేకుండా పాపభీతి లేకుండా జీవిస్తున్నారని చెప్పెను.అందుకు శ్రీమహావిష్ణువు కలియుగంలో శ్రీవేంకటేశ్వరస్వామిగా వెలుస్తానని చెప్పెను. మరొక కథ ప్రకారం శ్రీ కృష్ణుని నిజమైన తల్లిదండ్రులైన దేవకి, వసుదేవులు. అయితే శ్రీకృష్ణుడు కారణజన్ముడు కావటం చేత యశోద దగ్గర పెరుగుతాడు. శ్రీకృష్ణుడు పెరిగి పెద్దవాడైన తరవాత రుక్మిణిని వివాహం చేసుకుంటాడు. అయితే ఆ వివాహాన్ని యశోద చూసితరించాలని బాధపడుతుంటే శ్రీకృష్ణుడు కలి యుగంలోవేంకటేశ్వరుడై వెలసి తన వివాహ సంబరంలో(యశోద మాతను)వకుళాదేవిగా వివాహాన్ని చూసి ఆనందించమని చెప్తాడు.