Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home food

Aloo Gobi Masala Gravy : క్యాట‌రింగ్ స్టైల్‌లో ఆలు గోబీ మసాలా గ్రేవీ.. ఇలా చేయండి.. బాగుంటుంది..!

D by D
November 3, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Aloo Gobi Masala Gravy : ఆలూ గోబి మ‌సాలా క‌ర్రీ.. బంగాళాదుంప‌లు, క్యాలీప్ల‌వ‌ర్ క‌లిపి చేసే ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ క‌ర్రీని రుచి చూసే ఉంటారు. ఎక్కువ‌గా క్యాట‌రింగ్ వాళ్లు ఈ క‌ర్రీని త‌యారు చేస్తూ ఉంటారు. దేనితో తిన్నా కూడా ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఈ క‌ర్రీని మ‌నం కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. క్యాట‌రింగ్ స్టైల్ లో ఆలూ గోబి మ‌సాలా క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలూ గోబి మ‌సాలా క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

జీడిప‌ప్పు – ఒక టేబుల్ స్పూన్, పుచ్చ‌గింజ‌లు – అర టేబుల్ స్పూన్, ఎండు కొబ్బ‌రి ముక్క‌లు -అర టీ స్పూన్, గ‌స‌గ‌సాలు -ఒక టీ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, క్యాలీప్ల‌వ‌ర్ ముక్క‌లు -ఒక క‌ప్పు, బంగాళాదుంప ముక్క‌లు – ఒక క‌ప్పు, బిర్యానీ ఆకు – 1, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, లవంగాలు – 2, యాల‌కులు – 2, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు – ముప్పావు క‌ప్పు, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీస్పూన్, ఉప్పు – త‌గినంత‌, కారం – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, ట‌మాట – 1, నీళ్లు – ముప్పావు క‌ప్పు, క‌సూరిమెంతి – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీస్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Aloo Gobi Masala Gravy recipe in telugu
Aloo Gobi Masala Gravy

ఆలూ గోబి మ‌సాలా క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా జార్ లో జీడిప‌ప్పు, పుచ్చ‌గింజ‌లు, ఎండుకొబ్బ‌రి ముక్క‌లు, గ‌స‌గ‌సాలు వేసి త‌గిన‌న్ని నీళ్లు పోసి మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక క్యాలీప్ల‌వ‌ర్ ముక్క‌లు, బంగాళాదుంప ముక్క‌లు వేసి వేయించాలి. వీటిని స‌గానికి పైగా వేయించిన త‌రువాత ప్లేట్ లోకి తీసుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత అదే క‌ళాయిలో మ‌సాలా దినుసులు వేసి వేయించాలి. త‌రువాత త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. త‌రువాత ఉప్పు, కారం, ప‌సుపు, జీల‌క‌ర్ర పొడి, ధ‌నియాల పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత ట‌మాటాను పేస్ట్ లాగా చేసి వేసుకోవాలి.

దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న‌ పేస్ట్ వేసి క‌ల‌పాలి. త‌రువాత వేయించిన క్యాలీప్ల‌వ‌ర్ ముక్క‌లు, బంగాళాదుంప ముక్క‌లు వేసి క‌ల‌పాలి. త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి ముక్క‌లు మెత్త‌గా అయ్యి నూనె పైకి వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత గ‌రం మ‌సాలా, క‌సూరిమెంతి, కొత్తిమీర వేసి మ‌రో నిమిషం పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ గోబి మ‌సాలా క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా త‌యారు చేసిన క‌ర్రీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Aloo Gobi Masala Gravy
Previous Post

Cashew Nuts : జీడిప‌ప్పుకు చెందిన నిజాలు ఇవి.. తెలుసుకోక‌పోతే న‌ష్ట‌పోతారు..!

Next Post

Spring Rolls : బేక‌రీల‌లో ల‌భించే స్ప్రింగ్ రోల్స్‌.. త‌యారీ ఇలా..!

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025

POPULAR POSTS

food

Paneer Mushroom Dum Biryani : ప‌నీర్‌, మ‌ష్రూమ్ ద‌మ్ బిర్యానీ.. ఇలా చేసి చూడండి.. ఎంతో బాగుంటుంది..!

by D
March 12, 2023

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
September 26, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Shiva Darshan : నందికొమ్ముల నుంచి శివ‌లింగాన్ని ద‌ర్శిస్తారు.. ఎందుకంటే..?

by Admin
November 26, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

by Admin
September 23, 2025

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.