Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

House : రోజూ మ‌నం చేసే ఈ త‌ప్పుల వ‌ల్ల ల‌క్ష్మీదేవి ఇంట్లో ఉండ‌దు.. ద‌రిద్ర దేవ‌త తిష్ట వేసుకుని కూర్చుంటుంది..!

D by D
May 27, 2022
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

House : మ‌నంద‌రం డ‌బ్బు సంపాదించ‌డానికి ఎంత‌గానో క‌ష్ట‌ప‌డుతూ ఉంటాం. డ‌బ్బు సంసాదించ‌డానికి మ‌నం చేయ‌ని ప‌ని అంటూ ఉండ‌దు. కానీ కొంద‌రు ఎంత సంపాదించినా ఇంట్లో డ‌బ్బు నిల‌వ‌దు. ఎప్ప‌టి డ‌బ్బు అప్పుడే ఖ‌ర్చైపోతుంటుంది. దీనికి కార‌ణం మ‌న‌పై ల‌క్ష్మీ దేవి అనుగ్ర‌హం లేక‌పోవ‌డ‌మే అని చెప్ప‌వ‌చ్చు. మ‌నం చేసే చిన్న చిన్న పొర‌పాట్ల వ‌ల్ల ల‌క్ష్మి దేవి అనుగ్ర‌హాన్ని పొంద‌లేక‌పోతున్నాం. దీనివ‌ల్ల‌ మ‌నశ్శాంతి కొర‌వ‌డి ఇంట్లో గొడ‌వ‌లు ప‌డ‌డం, వ్యాపారంలో న‌ష్టం రావ‌డం వంటివి జ‌రుగుతాయ‌ని పండితులు చెబుతున్నారు. వీటిన్నింటికీ కార‌ణం మ‌నం ఇంట్లో చేసే పొర‌పాట్లేన‌ని వారు చెబుతున్నారు. మ‌నం చేస్తున్న పొర‌పాట్లు ఏమిటి.. వాటిని ఎలా స‌రిచేసుకోవాలి.. ల‌క్ష్మీ దేవి అనుగ్ర‌హాన్ని ఎలా పొందాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంట్లో ఉండే ప‌విత్ర‌మైన వస్తువుల మీద అప‌విత్ర‌మైన వ‌స్తువుల‌ను ఉంచ‌డం వ‌ల్ల జేష్టా దేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంద‌ట‌. రోలు, రోక‌లి, పొయ్యి, ప‌డుకునే మంచం ఇవి అన్ని కూడా మంగ‌ళ‌క‌ర‌మైన వ‌స్తువులే అని పెద్ద‌లు చెబుతున్నారు. వీటి మీద కూర్చోవ‌డం కానీ, కాలితో త‌న్న‌డం కానీ చేయ‌వ‌ద్దు. పొయ్యి కూడా ఎంతో మంగ‌ళ‌ర‌మైన వ‌స్తువు అని వారు చెబుతున్నారు. పూర్వ‌కాలంలో పొయ్యిని వెలిగించే ముందు ఆవు పేడ‌తో అలికి , ముగ్గు వేసిన త‌రువాతే పొయ్యిని వెలింగించేవారు. కానీ ప్ర‌స్తుత కాలంలో గ్యాస్ స్ట‌వ్ ల‌ను వాడుతున్నారు. గ్యాస్ స్ట‌వ్ ను వెలిగించే ముందు కూడా శుభ్రంగా తుడిచి ప‌సుపు రాసి, బొట్టు పెట్టిన త‌రువాతే దానిని వెలిగించాలి. స్నానం చేసిన త‌రువాతే స్ట‌వ్ ను వెలిగించాలి.

do not do these mistakes in House or else Goddess Laxmi Devi will not stay
House

అప్పుడ‌ప్పుడు పాలు పొంగుతూ ఉంటాయి. కొంద‌రు దానిని శుభ్రం చేయ‌కుండ అలాగే ఉంచుతారు. అలా అస్స‌లు ఉంచ‌కూడ‌ద‌ని దీని వ‌ల్ల ఇంట్లో ద‌రిద్ర దేవ‌త తిష్ట వేసుకుని కూర్చుంటుంద‌ని పెద్ద‌లు చెబుతున్నారు. గ్యాస్ స్ట‌వ్ ను శుభ్రంగా ఉంచుకోక‌పోతే వ‌చ్చిన డ‌బ్బు వ‌చ్చిన‌ట్టే ఖ‌ర్చై పోతుంద‌ట‌. వంట గ‌దిని కూడా ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా శుభ్రంగా ఉంచుకోవ‌డం వ‌ల్ల మ‌నం ల‌క్ష్మీ దేవి అనుగ్ర‌హాన్ని పొంద‌వ‌చ్చు.

అలాగే ప‌డుకునే మంచంపై కుంకుమ‌, ప‌సుపు, వెండి, బంగారం వంటి వాటిని ఉంచ‌రాదు. మంచంపై దుప్ప‌టిని కూడా ఎప్ప‌టిక‌ప్పుడు మార్చుకుంటూ ఉండాలి. చీపురును కూడా ల‌క్ష్మీ దేవి ప్ర‌తిరూపం అని పెద్ద‌లు చెబుతుంటారు. చీపురును కూడా త‌న్న‌కూడ‌ద‌ని, ఒక‌వేళ కాలు త‌గిలినా కూడా చీపురును క‌ళ్ల‌కు అద్దుకోవాల‌ని, చీపురును ఎప్పుడూ ఈశాన్య మూల‌న కానీ, భోజ‌న గ‌దిలో కానీ, పూజ గ‌దిలో కానీ పెట్టకూడ‌దని పండితులు చెబుతున్నారు. అస‌లు పూజ గ‌దిని చీపురుతో శుభ్రం చేయ‌కూడ‌ద‌ని, ప్ర‌త్యేక వ‌స్త్రాన్ని ఉంచి దాంతో మాత్ర‌మే శుభ్రం చేయాల‌ని అంటున్నారు. మ‌న ఇంట్లో ఉండే చీపురుకు దుష్ట శ‌క్తిని ఆపే శ‌క్తి ఉంటుంది. క‌నుక చీపురును ఎప్పుడూ ఊడ్చే వైపు కింద‌కు ఉండేలా ప‌ట్టుకునే వైపు పైకి ఉండేలా పెట్టాలి. ఈ నియ‌మాల‌ను పాటించ‌డం వ‌ల్ల మ‌నం ల‌క్ష్మీ దేవి అనుగ్ర‌హాన్ని పొంద‌వ‌చ్చ‌ని పండితులు చెబుతున్నారు.

Tags: Goddess Laxmi DeviHouse
Previous Post

Guava Leaves : ఈ ఒక్క ఆకుతో మీ దంతాల‌లో ఉన్న పురుగులు మొత్తం బయటకు వస్తాయి..!

Next Post

Hair Growth : వీటిని కలిపి వాడితే.. జుట్టు రాలదు.. వద్దన్నా కూడా నల్లగా, ఒత్తుగా, పొడవుగా జుట్టు పెరుగుతుంది..!

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.