Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home food

Dondakaya Curry : దొండ‌కాయ క‌ర్రీని ఇలా చేయండి.. అన్నంలో తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

D by D
January 3, 2024
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Dondakaya Curry : దొండకాయ మ‌సాలా క‌ర్రీ.. దొండ‌కాయ‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి. త‌రుచూ కూర‌, వేపుడు వంటి వాటినే కాకుండా దొండ‌కాయ‌ల‌తో ఇలా మ‌సాలా క‌ర్రీని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ క‌ర్రీని దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. దొండ‌కాయ‌లను తిన‌ని వారు కూడా ఈ క‌ర్రీని ఇష్టంగా తింటారు. దొండ‌కాయ మ‌సాలా క‌ర్రీని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. వెరైటీ రుచుల‌ను కోరుకునే వారు ఇలా దొండ‌కాయ‌ల‌తో మ‌సాలాకూర‌ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. దొండ‌కాయ‌ల‌తో రుచిగా మ‌సాలా క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

దొండకాయ మ‌సాలా క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

దొండ‌కాయ‌లు – పావుకిలో, నూనె – 5 టేబుల్ స్పూన్స్, నాన‌బెట్టిన చింత‌పండు – 2 రెమ్మ‌లు, బిర్యానీ ఆకు – 1, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ప‌చ్చిమిర్చి – 3, పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ – 1, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, త‌రిగిన ట‌మాట – 1, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – ఒక‌టిన్న‌ర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, నీళ్లు – ఒక‌టింపావు క‌ప్పు, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Dondakaya Curry recipe make in this method
Dondakaya Curry

మ‌సాలా పేస్ట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ప‌ల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, ఎండుకొబ్బ‌రి ముక్క‌లు – ఒక టేబుల్ స్పూన్, గ‌స‌గ‌సాలు – ఒక టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, ల‌వంగాలు – 3, యాల‌కులు – 4, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ధ‌నియాలు – ఒక టీ స్పూన్, జీడిప‌ప్పు – 5.

దొండకాయ మ‌సాలా క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో ప‌ల్లీలు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత మిగిలిన ప‌దార్థాలు వేసి వేయించాలి. దినుసుల‌న్నీ వేగిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్లార‌నివ్వాలి. త‌రువాత వీటిని జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే నాన‌బెట్టిన చింత‌పండు వేసి మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత దొండ‌కాయ అంచుల‌ను తీసేసి గుత్తి వంకాయ‌లుగా క‌ట్ చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక దొండకాయ‌లను వేసి వేయించాలి. వీటిపై మూత పెట్టి మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ దొండ‌కాయ‌ల‌ను వేయించాలి. దొండ‌కాయ‌లు వేగి కొద్దిగా రంగు మారిన త‌రువాత వీటిని ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత ఇదే నూనెలో బిర్యానీ ఆకు, జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్క‌లు, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌గా అయ్యే వర‌కు వేయించాలి.

త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న పేస్ట్ వేసి క‌ల‌పాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత ప‌సుపు, కారం, ఉప్పు వేసి క‌ల‌పాలి. ఇందులో కొద్దిగా నీళ్లు పోసి మ‌సాలాలు మాడిపోకుండా వేయించుకోవాలి. త‌రువాత త‌గినన్ని నీళ్లు పోసి క‌ల‌పాలి. నీళ్లు ఉడుకుప‌ట్టిన త‌రువాత వేయించిన దొండ‌కాయ‌లు వేసి క‌ల‌పాలి. వీటిపై మూత పెట్టి మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ 8 నిమిషాల పాటు ఉడికించాలి. దొండ‌కాయ‌లు ఉడికి నూనె పైకి తేలిన త‌రువాత కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే దొండ‌కాయ మసాలా క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటీ, జీరా రైస్, బ‌గారా అన్నం వంటి వాటితో తింటే చాలారుచిగా ఉంటుంది.

Tags: Dondakaya Curry
Previous Post

Kakarakaya Fry : కాక‌ర‌కాయ‌ల ఫ్రై.. ఇలా చేస్తే చేదు లేకుండా రుచిగా ఉంటుంది..!

Next Post

Cooking Oil Reuse : ఒక్క‌సారి వాడిన వంట నూనెను మళ్లీ ఎన్నిసార్లు ఉప‌యోగించ‌వ‌చ్చు..?

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.