Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home food

Filter Coffee : హోట‌ల్స్ లో ల‌భించే ఫిల్ట‌ర్ కాఫీని ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు..!

D by D
May 21, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Filter Coffee : మ‌న‌లో చాలా మంది కాఫీని ఎంతో ఇష్టంగా తాగుతూ ఉంటారు. కొంద‌రు ఉద‌యం లేవ‌గానే కాఫీని తాగుతూ ఉంటారు. కొంద‌రికైతే కాఫీ తాగ‌నిదే రోజు గ‌డ‌వ‌ద‌ని చెప్ప‌వ‌చ్చు. త‌గిన మోతాదులో కాఫీని తాగ‌డం వ‌ల్ల మ‌నం వివిధ ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతూ ఉంటారు. అదే విధంగా కాఫీలో కూడా చాలా ర‌కాలు ఉంటాయి. వాటిలో ఫిల్ట‌ర్ కాఫీ కూడా ఒక‌టి. ఈ కాఫీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని రుచి చూసే ఉంటారు. ప‌క్కా సౌత్ ఇండియ‌న్ స్టైల్ లో ఈ ఫిల్ట‌ర్ కాఫీని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫిల్ట‌ర్ కాఫీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నీళ్లు – అర క‌ప్పు, కాఫీ పొడి – 2 లేదా 3 టీ స్పూన్స్, పాలు – ఒక క‌ప్పు, పంచ‌దార – 3 టీ స్పూన్స్.

Filter Coffee recipe in telugu very easy to make at home
Filter Coffee

ఫిల్ట‌ర్ కాఫీ త‌యారీ విధానం..

ముందుగా గిన్నెలో నీటిని పోసి మ‌రిగించాలి. నీళ్లు మ‌రిగిన త‌రువాత కాఫీ ఫిల్ట‌ర్ ను తీసుకుని అందులో కాఫీ పొడిని వేసుకోవాలి. కాఫీ స్ట్రాంగ్ గా కావాల‌నుకున్న వారు 3 టీ స్పూన్ల కాఫీ పొడిని వేసుకోవాలి. త‌రువాత దానిపై ఫిల్ట‌ర్ ను ఉంచాలి. ఇప్పుడు మ‌రిగించిన నీటి నుండి 60 శాతం నీటిని అందులో పోసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి పిల్టర్ ను 10 నుండి 15 నిమిషాల పాటు ప‌క్క‌కు ఉంచాలి. కాఫీ ఫిల్ట‌ర్ అవుతుండ‌గానే మ‌రో ప‌క్క‌న స్ట‌వ్ మీద గిన్నెలో పాలు పోసి వేడి చేయాలి. పాలు ఒక పొంగు వ‌చ్చిన త‌రువాత పంచ‌దార వేసి క‌ల‌పాలి. ఈ పాల‌ను మ‌రో రెండు నుండి మూడు నిమిషాల పాటు మ‌రిగించి స్వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక క‌ప్పులో లేదా గ్లాస్ లో కొద్దిగా కాఫీ డికాష‌న్ ను తీసుకోవాలి. త‌రువాత ఇందులో పాల‌ను పోసుకోవాలి. ఈ కాఫీని అంతా క‌లిసేలా క‌లుపుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఫిల్ట‌ర్ కాఫీ త‌యార‌వుతుంది. ఈ విధంగా త‌యారు చేసిన కాఫీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తాగుతారు.

Tags: Filter Coffee
Previous Post

Irani Chai : రోజు టీ పెట్టేటప్పుడు ఈ ఒక్క స్పూన్ పౌడర్ వేయండి.. టీ అద్భుతంగా త‌యార‌వుతుంది..!

Next Post

Weight Loss Foods : వీటిని రోజూ తీసుకుంటే చాలు.. బ‌రువు త‌గ్గ‌డం ఎంత తేలికంటే..?

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.