Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home food

Patnam Pakoda : ప‌కోడీల‌ను ఇలా ఒక్క‌సారి వెరైటీగా చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

D by D
October 2, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Patnam Pakoda : మ‌నం సాంయ‌త్రం స‌మ‌యంలో స్నాక్స్ గా తీసుకునే వాటిలో ప‌కోడాలు కూడా ఒక‌టి. ప‌కోడాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. మ‌నం మ‌న రుచికి త‌గిన‌ట్టు వివిధ రుచుల్లో వీటిని త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. అయితే త‌రుచూ ఒకేర‌కం ప‌కోడాలు కాకుండా కింద చెప్పిన విధంగా ఎంతో రుచిగా ఉండే ప‌ట్నం ప‌కోడాల‌ను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ ప‌కోడాలు త‌మిళ‌నాడులో చాలా ప్ర‌సిద్ది చెందిన‌వి. టీ టైం స్నాక్స్ గా ఇవి చాలా ఫేమ‌స్ అని చెప్ప‌వ‌చ్చు. వీటిని మ‌నం కూడా చాలా సుల‌భంగా తయారు చేసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. త‌మిళ‌నాడు ఫేమ‌స్ అయిన ఈ ప‌ట్నం ప‌కోడాల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ప‌ట్నం ప‌కోడా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

స‌న్న‌గా పొడువుగా త‌రిగిన ఉల్లిపాయ‌లు – 5, ఉప్పు – త‌గినంత‌, త‌రిగిన క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ప‌చ్చిమిర్చి పేస్ట్ – ఒక టీ స్పూన్, అల్లం పేస్ట్ – ఒక టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, శ‌న‌గ‌పిండి – 2 క‌ప్పులు, బియ్యంపిండి – అర క‌ప్పు, కారం – ఒక టీ స్పూన్, వంట‌సోడా – పావు టీ స్పూన్, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

Patnam Pakoda recipe in telugu make in this method
Patnam Pakoda

ప‌ట్నం ప‌కోడా త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో ఉల్లిపాయ ముక్క‌ల‌ను తీసుకోవాలి. త‌రువాత ఇందులో ఉప్పు, ప‌చ్చిమిర్చి పేస్ట్, అల్లం పేస్ట్, క‌రివేపాకు, కొత్తిమీర వేసి క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత మ‌రో గిన్నెలో శ‌న‌గ‌పిండిని తీసుకోవాలి. ఇందులో బియ్యంపిండి, కారం, వంట‌సోడా వేసి క‌ల‌పాలి. త‌రువాత నెయ్య వేసి క‌ల‌పాలి. ఇప్పుడు ముందుగా క‌లుపుకున్న ఉల్లిపాయ ముక్క‌ల‌ల్లో కొద్ది కొద్దిగా పిండిని వేస్తూ బాగా క‌లుపుకోవాలి. ఇందులో నీటిని పోయ‌కూడ‌దు. అవ‌స‌ర‌మైతే ఒక‌టి లేదా రెండు టేబుల్ స్పూన‌ల్ నీటిని మాత్ర‌మే పోసి పిండిని క‌లుపుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని మ‌రీ గట్టిగా వ‌త్త‌కుండా నెమ్మ‌దిగా వ‌త్తుతూ ఉండ‌లాగా చేసుకోవాలి.

ఈ ఉండ‌కు మ‌ధ్య‌లో గ్యాప్ ఉండేలా నెమ్మ‌దిగా వ‌త్తుకోవాలి. లేదంటే ప‌కోడా లోప‌ల స‌రిగ్గా వేగ‌దు. ఇలా త‌యారు చేసుకున్న ఉండ‌ల‌ను నూనెలో వేసి కాల్చుకోవాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై ఎర్రగా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ప‌ట్నం ప‌కోడాలు త‌యార‌వుతాయి. వీటిని టీతో స్నాక్స్ గా తీసుకోవ‌డంతో పాటు ఈ ప‌కోడాల‌తో కూర‌ను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ ప‌కోడాల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Patnam Pakoda
Previous Post

Caramel Popcorn : థియేట‌ర్‌లో తినే కారామెల్ పాప్‌కార్న్‌ను ఇంట్లోనే ఇలా ఈజీగా చేయండి..!

Next Post

Aloe Vera For Hair Growth : క‌ల‌బంద గుజ్జుతో ఇలా చేస్తే.. మీ జుట్టు రాల‌దు.. వ‌ద్ద‌న్నా స‌రే పెరుగుతూనే ఉంటుంది..!

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.