Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home food

Raju Gari Pulao : ఇంట్లోనే కాస్త శ్ర‌మిస్తే.. రాజుగారి కోడి పులావ్‌ను అద్భుతంగా చేసుకోవ‌చ్చు..!

D by D
May 13, 2022
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Raju Gari Pulao : ప్ర‌స్తుత త‌రుణంలో ప్ర‌జ‌ల రుచులు, ఆహారపు అల‌వాట్లు బాగా మారాయి. కొత్త కొత్త రుచుల‌ను కోరుకుంటున్నారు. అలాంటి రుచుల్లోంచి పుట్టిందే.. రాజు గారి పులావ్‌. దీన్ని రెస్టారెంట్ల‌లోనే మ‌నం తిన‌వ‌చ్చు. కానీ కాస్త శ్ర‌మిస్తే ఇంట్లోనూ దీన్ని అద్భుతంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలోనే ఎంతో రుచిగా రాజుగారి కోడి పులావ్‌ను ఎలా త‌యారు చేయాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.

Raju Gari Pulao very tasty you can cook this at home
Raju Gari Pulao

రాజు గారి కోడి పులావ్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చికెన్ – ఒక కిలో, నాన‌బెట్టిన బాస్మ‌తి బియ్యం – రెండు గ్లాసులు, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, జీడి ప‌ప్పు – అర క‌ప్పు, అనాస పువ్వు – 2, ల‌వంగాలు -8, యాల‌కులు- 4, బిర్యానీ ఆకులు – 2, జాప‌త్రి – 1, నూనె – 6 టేబుల్ స్పూన్స్, త‌రిగిన ఉల్లిపాయ‌లు – అర కిలో, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్స్, ప‌చ్చి మిర్చి పేస్ట్- ఒక టీ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – 2 టీ స్పూన్స్, ఉప్పు – త‌గినంత‌, కారం – 2 టేబుల్ స్పూన్స్, గ‌రం మ‌సాలా – ఒక టేబుల్ స్పూన్, పుదీనా – అర క‌ప్పు, కొత్తిమీర – ఒక క‌ప్పు, పెరుగు – 200 గ్రా., నీళ్లు – 5 గ్లాసులు.

రాజు గారి కోడి పులావ్ ను త‌యారు చేసే విధానం..

ఒక గిన్నెలో ముందుగా నెయ్యిని వేసి వేడ‌య్యాక జీడిప‌ప్పు, అనాస పువ్వు, ల‌వంగాలు, యాల‌కులు, బిర్యానీ ఆకు వేసి వేయించాలి. త‌రువాత నూనె వేసి కాగిన త‌రువాత త‌రిగిన ఉల్లిపాయ‌లు వేసి ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ప‌చ్చి మిర్చి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ప‌సుపును వేసి క‌లిపి శుభ్రంగా క‌డిగిన చికెన్ ను వేసి క‌లిపి మూత పెట్టి మ‌ధ్య‌స్థ మంట‌పై 3 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత జీల‌క‌ర్ర పొడి, ధ‌నియాల పొడి, ఉప్పు, కారం, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. త‌రువాత త‌రిగిన పుదీనా, కొత్తిమీర‌ను వేసి కల‌పాలి. త‌రువాత పెరుగును వేసి క‌లిపి మూత పెట్టి చిన్న మంట‌పై 10 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత మూత తీసి మరోసారి క‌ల‌పాలి.

చికెన్ 80 శాతం ఉడికిన త‌రువాత నీళ్ల‌ను పోసి క‌లిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు పెద్ద మంట‌పై, 10 నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించాలి. త‌రువాత మూత తీసి 3 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత నాన‌బెట్టిన బాస్మ‌తి బియ్యాన్ని వేసి క‌లిపి 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఇప్పుడు మూత తీసి మ‌రో సారి క‌లిపి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి మూత పెట్టి 15 నిమిషాల పాటు చిన్న మంట‌పై ఉడికించి స్ట‌వ్‌ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే రాజుగారి కోడి పులావ్ త‌యార‌వుతుంది. దీనిని నేరుగా ఉల్లిపాయ‌, నిమ్మ ర‌సంతో క‌లిపి తిన‌వ‌చ్చు. రైతాతో క‌లిపి తిన్నా కూడా రుచిగా ఉంటుంది.

Tags: Raju Gari Pulao
Previous Post

Aratikaya Vepudu : అర‌టికాయ వేపుడు.. ఇలా చేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది..!

Next Post

Chepala Pulusu : ఒక‌ప్పుడు మ‌న పెద్ద‌లు చేసుకున్న మాదిరిగా.. చేప‌ల పులుసును ఇలా చేయండి..!

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025

POPULAR POSTS

చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
food

Paneer Mushroom Dum Biryani : ప‌నీర్‌, మ‌ష్రూమ్ ద‌మ్ బిర్యానీ.. ఇలా చేసి చూడండి.. ఎంతో బాగుంటుంది..!

by D
March 12, 2023

...

Read more
హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
September 26, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Shiva Darshan : నందికొమ్ముల నుంచి శివ‌లింగాన్ని ద‌ర్శిస్తారు.. ఎందుకంటే..?

by Admin
November 26, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

by Admin
September 23, 2025

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.