Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home food

Village Style Tomato Green Chilli Chutney : విలేజ్ స్టైల్‌లో ట‌మాటా ప‌చ్చి మిర్చి ప‌చ్చ‌డి.. ఇలా చేసి అన్నంలో తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

D by D
November 12, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Village Style Tomato Green Chilli Chutney : మ‌నం ట‌మాటాల‌తో ర‌క‌ర‌కాల పచ్చ‌ళ్లను త‌యారు చేస్తూ ఉంటాము. ట‌మాటాల‌తో చేసే పచ్చ‌ళ్లు చాలా రుచిగా ఉంటాయి. అందులో భాగంగా కింద చెప్పిన విధంగా త‌యారు చేసే ప‌చ్చ‌డి కూడా చాలారుచిగా ఉంటుంది. ట‌మాటాలు, ప‌చ్చిమిర్చి క‌లిపి చేసే ఈ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎక్కువ‌గా గ్రామాల్లో త‌యారు చేస్తారు. అన్నంతో, అల్పాహారాల‌తో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఈ ప‌చ్చ‌డిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. లొట్ట‌లేసుకుంటూ తినాల‌నిపించేంత రుచిగా ఉండే ట‌మాట ప‌చ్చిమిర్చి ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ట‌మాట ప‌చ్చిమిర్చి ప‌చ్చ‌డి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – ఒక టేబుల్ స్పూన్, ప‌చ్చిమిర్చి – 10 నుండి 15, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, కొత్తిమీర – గుప్పెడు, త‌రిగిన ట‌మాటాలు – 3 లేదా 4( పెద్ద‌వి), చింత‌పండు – ఒక రెమ్మ‌, ప‌సుపు – పావు టీ స్పూన్, త‌రిగిన ఉల్లిపాయ – 1, వెల్లుల్లి రెబ్బ‌లు – 10, ఉప్పు – త‌గినంత‌.

Village Style Tomato Green Chilli Chutney recipe in telugu
Village Style Tomato Green Chilli Chutney

ట‌మాట ప‌చ్చిమిర్చి ప‌చ్చ‌డి త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ప‌చ్చిమిర్చి, జీల‌క‌ర్ర‌, క‌రివేపాకు, కొత్తిమీర వేసి వేయించాలి. ప‌చ్చిమిర్చి కొద్దిగా వేగిన త‌రువాత ట‌మాట ముక్క‌లు, ప‌సుపు, చింత‌పండు వేసి క‌ల‌పాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవ‌న్నీ చ‌ల్లారిన త‌రువాత జార్ ను తీసుకుని అందులో ముందుగా ప‌చ్చిమిర్చి, చింత‌పండును వేసుకోవాలి. త‌రువాత వెల్లుల్లి రెబ్బ‌లు, ఉప్పు వేసి బ‌ర‌క‌గా మిక్సీ పట్టుకోవాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు, ఉల్లిపాయ ముక్క‌లు వేసి మ‌ర‌లా బ‌ర‌క‌గా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ట‌మాట ప‌చ్చిమిర్చి ప‌చ్చ‌డి త‌యార‌వుతుంది. ఈ ప‌చ్చ‌డిని తాళింపు కూడా వేసుకోవ‌చ్చు. వేడి వేడి అన్నం, నెయ్యితో తింటే ఈ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో పాటు అల్పాహారాల‌తో కూడా ఈ ప‌చ్చ‌డిని తిన‌వ‌చ్చు.

Tags: Village Style Tomato Green Chilli Chutney
Previous Post

Custard Apple For Lungs : చ‌లికాలంలో సీతాఫ‌లాల‌ను త‌ప్ప‌క తినాలి.. ఎందుకో తెలిస్తే వెంట‌నే తెచ్చి తింటారు..!

Next Post

Vada Curry : త‌మిళ‌నాడు స్టైల్‌లో ఎంతో రుచిక‌ర‌మైన వ‌డ క‌ర్రీ.. త‌యారీ ఇలా..!

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.