Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home పోష‌కాహారం

Diabetes Food : డ‌యాబెటిస్ ఉన్న వారు తీసుకోవాల్సిన ఆహారం.. వీటితో షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్ అవుతాయి..

D by D
August 31, 2022
in పోష‌కాహారం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Diabetes Food : ప్ర‌స్తుత కాలంలో షుగ‌ర్ వ్యాధి బారిన ప‌డే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువ‌వుతోంది. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ వ్యాధి బారిన ప‌డుతున్నారు. శ‌రీరంలోని అన్ని అవ‌యాల‌పై ఈ వ్యాధి ప్ర‌భావం ఉంటుంది. ఒక్క‌సారి ఈ వ్యాధి బారిన ప‌డితే జీవితాంతం మందుల‌ను వాడాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు క‌చ్చిత‌మైన ఆహార నియ‌మాల‌ను క‌లిగి ఉండాలి. ఏది ప‌డితే అది తిన‌డం వ‌ల్ల చ‌క్కెర స్థాయిలు అదుపు త‌ప్పి షుగ‌ర్ వ్యాధి ఎక్కువవుతుంది. దీంతో అనారోగ్య స‌మ‌స్య‌లు మ‌రింత ఎక్కువ‌య్యే అవకాశం ఉంటుంది. క‌నుక ఈ వ్యాధి గ్ర‌స్తులు ఎక్కువ‌గా షుగ‌ర్ వ్యాధిని నియంత్రించే ఆహార ప‌దార్థాల‌ను తీసుకోవాల్సి ఉంటుంది.

ప్ర‌తి రోజూ ఆహార నియ‌మాల‌ను పాటిస్తూ త‌గినంత నీటిని తాగడంతోపాటు వ్యాయామాలు కూడా చేయడం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌ణ‌లో ఉంటుంది. అలాగే కొన్ని ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను భోజ‌నంలో చేర్చుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను, ఇన్సులిన్ నిరోధ‌క‌త‌ను నివారించ‌వ‌చ్చు. ఎటువంటి ఆహార ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల చ‌క్కెర స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు ఆహారంలో భాగంగా చిల‌గ‌డ దుంప‌ల‌ను తీసుకోవ‌డం వల్ల చ‌క్క‌టి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. వీటినే కంద‌గ‌డ్డ‌లు అని కూడా అంటారు.

Diabetes Food diabetics must take these foods for good health
Diabetes Food

చిల‌గ‌డ దుంప‌ల్లో ఫైబ‌ర్, పొటాషియం, బీటా కెరోటిన్, విట‌మిన్ ఎ, విట‌మిన్ సి వంటి పోష‌కాలు అధికంగా ఉంటాయి. ఈ పోష‌కాల‌న్నీ కూడా ర‌క్తంలో చక్కెర స్థాయిల‌ను నియంత్రించడంలో అద్భుతంగా ప‌ని చేస్తాయి. డయాబెటిస్ ను నియంత్రించే ఆహారాల్లో బీన్స్ కూడా ఒక‌టి. బీన్స్ ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎంతో మేలు క‌లుగుతుంది. బీన్స్ లో ప్రోటీన్స్ తోపాటు కాల్షియం, మెగ్నిషియం వంటి మిన‌రల్స్ కూడా అధికంగా ఉంటాయి. వీటిలో ఉండే ఇత‌ర పోష‌కాలు భోజ‌నం తిన్న త‌రువాత జీర్ణ వ్య‌వ‌స్థ‌ను మెరుగుప‌రిచి ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచుతాయి. కాబ‌ట్టి ఈ బీన్స్ ను సూప్, స‌లాడ్ ల‌లో లేదా కూర‌గా చేసుకుని తిన‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.

అదేవిధంగా షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు పాల‌కూర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా చ‌క్క‌టి ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వచ్చు. పాల‌కూర‌లో క్యాలరీలు, కార్బొహైడ్రేట్లు త‌క్కువ‌గా ఇత‌ర పోష‌కాలు ఎక్కువ‌గా ఉంటాయి. క‌నుక పాల‌కూర‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయి. డ‌యాబెటిస్ తో బాధ‌ప‌డుతున్న వారు విట‌మిన్స్, ఫైబ‌ర్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ‌గా ఉన్న బెర్రీ పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. బెర్రీ పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల క‌డుపు నిండిన భావ‌న క‌ల‌గ‌డంతోపాటు షుగ‌ర్ వ్యాధి కూడా నియంత్రించ‌బ‌డుతుంది. అంతేకాకుండా గుండె సంబంధిత స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో, క్యాన్స‌ర్ వ్యాధిని నియంత్రించ‌డంలో కూడా ఇవి మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. క‌నుక బెర్రీల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌ణ‌లో ఉండ‌డంతోపాటు ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది.

అదే విధంగా షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు ఆహారంలో భాగంగా దాల్చిన చెక్క‌ను తీసుకోవ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఇన్సులిన్ నిరోధ‌క‌త‌ను అడ్డుకోవ‌డంతోపాటు డ‌యాబెటిస్ ను నియంత్రించే గుణం కూడా దాల్చిన చెక్క‌లో ఉంటుంది. అలాగే షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు తీసుకోవాల్సిన ఆహారాల్లో చిరు ధాన్యాలు కూడా ఒక‌టి. చిరు ధాన్యాల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో ర‌కాల పోష‌కాలు ఉంటాయి. చిరు ధాన్యాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధితోపాటు అధిక ర‌క్త‌పోటు కూడా నియంత్ర‌ణ‌లో ఉంటుంది.

అదే విధంగా షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు త‌మ ఆహారంలో భాగంగా డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా చ‌క్క‌టి ఫ‌లితం ఉంటుంది. ఇన్సులిన్ నిరోధ‌క‌త‌ను త‌గ్గించ‌డంతోపాటు అధిక ర‌క్త‌పోటును కూడా ఇవి నియంత్ర‌ణ‌లో ఉంచుతాయి. మంచి ఫ‌లితాల‌ను పొందాలంటే ఈ గింజ‌ల‌ను రాత్రంతా నీటిలో నాన‌బెట్టి ఉద‌యాన్నే తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌ణ‌లో ఉంటుంది. డ‌యాబెటిస్ ను నియంత్రించ‌డంలో మ‌న‌కు ఆలివ్ నూనె కూడా ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. దీనిలో ఉండే పోష‌కాలు ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. అంతేకాకుండా బ‌రువు త‌గ్గ‌డంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో కూడా ఆలివ్ నూనె మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది.

డ‌యాబెటిస్ ను త‌గ్గించే వాటిల్లో పెరుగు కూడా ఒక‌టి. పెరుగును ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల ఎముక‌లు, దంతాలు దృఢంగా ఉంటాయి. డ‌యాబెటిస్ ను త‌గ్గించ‌డంలో పెరుగు యాక్టివ్ గా ప‌ని చేస్తుంద‌ని చెప్ప‌డంలో ఏ మాత్రం అతిశ‌యోక్తి లేదు. ఈ విధ‌మైన ఆహార ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధిని మ‌నం చాలా సులువుగా త‌గ్గించుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

Tags: Diabetes Fooddiabetics
Previous Post

Bay Leaf : వేగంగా పొట్ట త‌గ్గాలంటే.. రోజూ దీన్ని తాగితే చాలు.. వెంట‌నే ఫ‌లితం క‌నిపిస్తుంది..

Next Post

Cold : దీన్ని ఒక టీస్పూన్ తీసుకుంటే చాలు.. ఎంత‌టి ద‌గ్గు, జ‌లుబు అయినా స‌రే క్ష‌ణాల్లో త‌గ్గుతాయి..!

Related Posts

వినోదం

సీనియర్ ఎన్టీఆర్ నుండి పవన్ కళ్యాణ్ వరకు రెండు పెళ్లిళ్లు చేసుకున్న నటులు ..!!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోడ్లపై పునుగులు, బోండాలు, మంచూరియా, తింటున్నారా..అయితే నష్టాలు తప్పవు..!

July 22, 2025
ఆధ్యాత్మికం

స్త్రీలు సాష్టాంగ న‌మ‌స్కారం ఎందుకు చేయ‌కూడ‌దు..? దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

July 22, 2025
హెల్త్ టిప్స్

పాప్‌కార్న్‌ను అధికంగా తింటున్నారా..? అయితే ముందు ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

July 22, 2025
inspiration

మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ వాడే ఫోన్ ఏంటో తెలుసా..? ఆపిల్ iPhone వాడకపోవటానికి కారణం ఇదే..!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోజూ భోజ‌నంలో పెరుగును త‌ప్ప‌నిస‌రిగా తినాల్సిందే.. ఎందుకంటే..?

July 22, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.