Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home పోష‌కాహారం న‌ట్స్ & సీడ్స్

Seeds : ఈ 5 ర‌కాల గింజ‌ల‌ను రాత్రి పూట నాన‌బెట్టి.. ఉద‌యం ప‌ర‌గ‌డుపునే తినండి.. రోగాలు మీ ద‌గ్గ‌రికి కూడా రావు..

D by D
November 26, 2022
in న‌ట్స్ & సీడ్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Seeds : ప్ర‌స్తుత కాలంలో మారిన మ‌న ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న విధానం కార‌ణంగా ఒళ్లంతా నొప్పులు, అరికాళ్ల‌ల్లో మంట‌లు, కొద్ది దూరం న‌డిచిన ఆయాసం రావ‌డం, చిన్న చిన్న పనులు చేసి అలిసిపోవ‌డం, రోజంతా నీర‌సంగా ఉండ‌డం వంటి అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నాం. ఇలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు తలెత్త‌డానికి గ‌ల కార‌ణాల్లో పోష‌కాహార లోపం కూడా ఒక‌టి. ఈ పోష‌కాహార లోపం కార‌ణంగా ర‌క్త‌హీన‌త‌, కీళ్ల నొప్పులు వంటి స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. దీంతో మ‌న శ‌రీరంలో అన్ని అవ‌య‌వాల‌కు ర‌క్త‌ప‌స్ర‌ర‌ణ సాఫీగా సాగ‌క చిన్న చిన్న ప‌నుల‌కే అలిసిపోవ‌డం, శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందులకు గురి కావ‌డం జ‌రుగుతుంది. కొంద‌రిలో అయితే డ‌యాబెటిస్, గుండె సంబంధిత స‌మ‌స్య‌లు బారిన కూడా ప‌డుతున్నారు.

ఇటువంటి అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉండాలంటే మ‌నం కొన్ని ఆహార ప‌దార్థాల‌ను మ‌న రోజు వారి ఆహారంలో భాగంగా తీసుకోవాలి. మ‌నం ప్ర‌తిరోజూ ఆహారంలో భాగంగా అవిసె గింజ‌ల‌ను తీసుకోవాలి. ఈ అవిసె గింజ‌ల్లో ఫైబ‌ర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి మ‌న చ‌ర్మం, జుట్టుతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా వీటిలో ఉండే ఫైబ‌ర్ పెద్ద ప్రేగు పాడ‌వ‌కుండా కాపాడ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. షుగ‌ర్ ను నియంత్రించ‌డంలో కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది. అయితే వీటిని నేరుగా తిన‌డానికి బ‌దులుగా నీటిలో నాన‌బెట్టి తీసుకుంటే ఎక్కువ ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు.

take these 5 types of seeds daily on empty stomach
Seeds

రోజూ రాత్రి ప‌డుకునే ముందు ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ అవిసె గింజ‌ల‌ను వేసి రాత్రంతా నాన‌బెట్టాలి. ఉద‌యాన్నే ఈ గింజ‌ల‌ను తిని నీటిని తాగాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఈ గింజ‌ల్లో ఉండే ఫైబ‌ర్ మ‌న‌కు ఎక్కువ‌గా ఆక‌లి వేయ‌కుండా చేస్తాయి. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి అవిసె గింజ‌లు ఎంత‌గానో తోడ్పడుతాయి. ఈ అవిసె గింజ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల చ‌ర్మం, జుట్టు కూడా అందంగా, ఆరోగ్యంగా త‌యార‌వుతాయి. ఈ అవిసె గింజ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి త‌గినంత శ‌క్తి లభించి నీర‌సం, అల‌స‌ట వంటి అనారోగ్య స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. అలాగే గ‌స‌గ‌సాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. వీటిని కూడా ఒక రాత్రంతా నాన‌బెట్టి ఉద‌యాన్నే తీసుకోవాలి. ఇలా గ‌స‌గ‌సాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.

మ‌ల‌బ‌ద్ద‌కం, మూత్ర‌పిండాల్లో రాళ్లు వంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో గ‌స‌గ‌సాలు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. గుండె సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు వేయించిన గ‌స‌గ‌సాల‌కు పంచ‌దార క‌లిపి ఉద‌యం, సాయంత్రం అర టీ స్పూన్ మోతాదులో తీసుకుంటూ ఉండాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. వీటిని ప్ర‌తిరోజూ ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. క‌డుపులో పుండ్లు, అల్స‌ర్లు వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. అలాగే బాదం ప‌ప్పును తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌నం ఎటువంటి అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉంటాం. ఈ బాదం గింజ‌ల‌ను కూడా మ‌నం రాత్రంతా నాన‌బెట్టి తీసుకోవాలి. 4 లేదా 5 బాదం గింజ‌ల‌ను రాత్రంతా నాన‌బెట్టి ఉద‌యాన్నే వాటి పొట్టు తీసి తినాలి. బాదంప‌ప్పులో ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి.

మ‌న శ‌రీరంలో తలెత్తే వాత‌, క‌ఫ‌, పిత్త‌ దోషాల‌ను తొల‌గించ‌డంలో బాదంప‌ప్పు మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. బాదంలోని ఔష‌ధ గుణాల గురించి ఎంత చెప్పిన త‌క్కవే. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అందంగా, ఆరోగ్యంగా, రోజంతా ఉత్సాహంగా ఉండ‌వ‌చ్చు. అదేవిధంగా రాత్రంతా నాన‌బెట్టిన గుప్పెడు శ‌న‌గ‌ల‌ను ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. శ‌న‌గ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి త‌గినన్ని పోష‌కాలు ల‌భిస్తాయి. జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి. శాఖాహారులు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన ప్రోటీన్లన్నీ ల‌భిస్తాయి.

వీటిని తీసుకోవ‌డం ఎముక‌లు ధృడంగా మార‌తాయి. ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గు ముఖం ప‌డ‌తాయి. నిద్ర‌లేమి స‌మ‌స్య కూడా త‌గ్గుతుంది. అదే విధంగా నాన‌బెట్టిన మెంతుల‌ను, కాలోంజి విత్త‌నాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌నం ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌చ్చు. షుగ‌ర్ వ్యాధితో బాద‌ప‌డే వారు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. బ‌రువు త‌గ్గ‌డంలో, జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో మెంతులు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డతాయి. ఈ విధంగా ఈ గింజ‌ల‌న్నింటిని మ‌న ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు త‌గ్గు ముఖం ప‌డ‌డంతో పాటు భ‌విష్య‌త్తులో కూడా రాకుండా ఉంటాయి.

Tags: seeds
Previous Post

Soft Chapati : చపాతీలు ఇలా చేశారంటే.. మెత్త‌గా, మృదువుగా వ‌స్తాయి.. ఎంతో రుచిగా ఉంటాయి..

Next Post

Dosa Avakaya Nilva Pachadi : దోస ఆవ‌కాయ నిల్వ ప‌చ్చ‌డి.. ఇలా చేస్తే అన్నంతో భ‌లే రుచిగా ఉంటుంది..

Related Posts

mythology

ఈ ప‌నులు చేస్తున్నారా..? అయితే ఆయుష్షు త‌గ్గుతుంద‌ట‌.. గ‌రుడ పురాణంలో చెప్పారు..!

July 22, 2025
వినోదం

1980లో టాలీవుడ్ హీరోలు ఎంత రెమ్యూనరేషన్ తీసుకునే వారో తెలుసా?

July 22, 2025
ఆధ్యాత్మికం

చిన్నారుల‌కు చెవులు కుట్టించే ఆచారం వెనుక దాగి ఉన్న సైన్స్ ఇదే.. ఎలాంటి లాభాలు ఉంటాయంటే..?

July 22, 2025
హెల్త్ టిప్స్

వెల్లుల్లి జ్యూస్ తాగ‌డం వ‌ల్ల ఇన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..?

July 22, 2025
Off Beat

ఏప్రిల్ 1వ తేదీన ఫూల్స్ డే అని ఎందుకు అంటారో తెలుసా..? వెనకున్న ఆసక్తికర విషయం ఇదే..!

July 21, 2025
vastu

బెడ్‌రూమ్‌లో ఈ వాస్తు చిట్కాల‌ను పాటిస్తే.. దంప‌తుల మ‌ధ్య అస‌లు గొడ‌వ‌లే ఉండ‌వు..

July 21, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.