Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home పోష‌కాహారం న‌ట్స్ & సీడ్స్

Sprouts : మొల‌కెత్తిన గింజ‌ల‌ను ఏ స‌మ‌యంలో తింటే మంచిదో తెలుసా..?

D by D
October 20, 2022
in న‌ట్స్ & సీడ్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Sprouts : అన్నీ పోష‌కాలు త‌గిన మోతాదులో ఉండే ఆహారాల్లో మొల‌కెత్తిన గింజ‌లు ఒకటి. విట‌మిన్లు, ఖ‌నిజ ల‌వ‌ణాలు వీటిలో పుష్క‌లంగా ల‌భిస్తాయి. ముఖ్యంగా పెస‌ర్లు, శ‌న‌గ‌లు, ప‌ల్లీల‌ను మొల‌కెత్తించి తీసుకోవాలి. మొలకెత్తిన గింజ‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. వైద్యులు కూడా వీటిని ఆహరంగా తీసుకోవాల‌ని సూచిస్తూ ఉంటారు. మొల‌కెత్తిన గింజ‌లు శ‌రీరాన్ని శుద్ధి చేస్తాయి. వీటిని రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరం చైత‌న్య‌వంత‌మై నిత్య య‌వ్వ‌నంగా క‌నిపించ‌వ‌చ్చున‌ని నిపుణులు చెబుతున్నారు. గింజ‌ల‌ను మొల‌కెత్తించిన‌ప్పుడు వాటిలో పోష‌క విలువ‌లు పెరుగుతాయి. ఎటువంటి ఆహార ప‌దార్థాల‌ను తీసుకోవాలో తెలియ‌క చాలా మంది క్యాల‌రీలు అధికంగా ఉన్న వాటిని తీసుకుంటున్నారు.

మ‌రికొంద‌రు డైటింగ్ పేరుతో క‌డుపు మాడ్చుకుంటున్నారు. దీంతో శ‌రీర బ‌రువు, ఆరోగ్యం విష‌యంలో హెచ్చుతగ్గులు వ‌స్తూ ఉంటాయి. పోష‌కాల నిధి అయిన‌టువంటి మొల‌కెత్తిన గింజ‌ల్లో జీర్ణ‌క్రియ‌ను మెరుగుప‌రిచే ఎంజైమ్ లు అధికంగా ఉంటాయి. ఈ ఎంజైమ్ లు ప్రోటీన్ల‌ను, శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే ఆమైనో ఆమ్లాల‌ను, పిండి ప‌దార్థాల‌ను గ్లూకోజ్ గా మారుస్తాయి. అలాగే మొల‌కెత్తిన గింజ‌ల్లో విట‌మిన్ ఎ, విట‌మిన్ బి కాంప్లెక్స్, విట‌మిన్ సి వంటివి అధికంగా ఉంటాయి. ఇందులో ఉండే విట‌మిన్ కె ర‌క్త గ‌డ్డ‌క‌ట్ట‌డానికి, కాలేయ ప‌నితీరు స‌క్ర‌మంగా ప‌ని చేయ‌డానికి తోడ్ప‌డుతుంది. మొల‌కెత్తిన గింజ‌లు త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వుతాయి. మ‌నం పెస‌ర్లు, శ‌న‌గ‌లు, ప‌ల్లీలు, బ‌ఠాణీలు, గోధుమ‌లు, జొన్న‌లు, సోయా బీన్స్, చిక్కుడు వంటి వాటిని మొల‌కెత్తించి తీసుకోవ‌చ్చు.

what is the right time to eat Sprouts know the benefits
Sprouts

ఈ గింజ‌లు మొల‌కెత్త‌డానికి తేమ‌, కొద్దిగా వెచ్చ‌ద‌నం అవ‌స‌రం. ఆరోగ్యానికి హానిని క‌లిగించే కొవ్వు, కెల‌స్ట్రాల్ వంటివి వీటిలో ఉండ‌వు. శ‌రీరాన్ని సంర‌క్షించే యాంటీ ఆక్సిడెంట్లు స‌మృద్ధిగా ల‌భిస్తాయి. మొల‌క‌ల‌కు క్షార గుణం ఎక్కువ‌గా ఉంటుంది. గ‌ర్భిణీలు మొల‌క‌లు తింటే పుట్ట‌బోయే బిడ్డ‌లు ఆరోగ్యంగా ఉంటారు. మొల‌క‌లు జీవంతో కూడుకున్న ఎంజైమ్ లు ఉన్న స‌హ‌జ‌మైన ఆహారం. మొల‌క‌ల్లో పీచు ప‌దార్థాలు ఎక్కువ‌గా ఉంటాయి. ఇవి మ‌ల‌బ‌ద్ద‌కాన్ని నివారిస్తాయి. ఈ గింజ‌లు మొల‌కెత్తేట‌ప్పుడు విట‌మిన్ ఎ 2 రెట్లు, విట‌మిన్ బి మ‌రియు సి లు 5 నుండి 10 రెట్లు అధికంగా ల‌భ్య‌మ‌వుతాయి. పిండి ప‌దార్థాలు స‌ర‌ళీకృత చ‌క్కెర‌లుగా, మాంస‌కృత్తులు సుల‌భంగా జీర్ణ‌మ‌య్యే అమైనో ఆమ్లాలుగా, కొవ్వులు ఆవ‌శ్య‌క కొవ్వు ఆమ్లాలుగా త‌యార‌వుతాయి.

ఖ‌నిజ‌ల‌వ‌ణాలైన క్యాల్షియం, ఐర‌న్, జింక్, ఫాస్ప‌ర‌స్ వంటివి శ‌రీరానికి సుల‌భంగా అందుబాటులో ఉండేలా తయార‌వుతాయి. దీని వ‌ల్ల దంతాలు, ఎముక‌లు బ‌లంగా త‌యార‌వుతాయి. ర‌క్త‌హీన‌త కూడా త‌గ్గుతుంది. మొల‌కెత్తిన గింజ‌ల‌ను అలాగే తిన‌వ‌చ్చు లేదా ఇత‌ర ఆహారాల్లో క‌లుపుకుని తిన‌వ‌చ్చు. మొల‌కెత్తిన గింజ‌ల్లో స‌న్న‌గా త‌రిగిన ఉల్లిపాయ‌లు, ప‌చ్చిమిర్చి, ట‌మాట‌, క్యారెట్ తురుము, చిటికెడు ఉప్పు, ప‌సుపు, కొద్దిగా కొత్తిమీర క‌లిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఇలా తిన‌డం వ‌ల్ల వాటిలోని పోష‌కాలు పూర్తి స్థాయిలో శ‌రీరానికి అందుతాయి. మొలకెత్తిన గింజ‌ల్లో కీర‌, క్యారెట్, బీట్ రూట్ వంటి కూర‌గాయ‌ల తురుముల‌ను క‌లుపుకుని తినవ‌చ్చు. గింజ‌ల‌ను ఎలా మొల‌కెత్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం. నాణ్య‌మైన గింజ‌ల‌ను తీసుకుని శుభ్ర‌ప‌ర‌చాలి.

త‌రువాత వాటిని 6 నుండి 8 గంట‌ల పాటు నీటిలో నాన‌బెట్టాలి. పెస‌ర్లు త్వ‌ర‌గా నానుతాయి. సోయా, చిక్కుళ్లు వంటి నాన‌డానికి ఎక్కువ స‌మ‌యం ప‌డుతుంది. గింజ‌ల‌ను నాన‌బెట్టిన త‌రువాత పొట్టు రాకుండా ఒక‌టి , రెండుసార్లు శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత వాటిని త‌డిపిన శుభ్ర‌మైన వ‌స్త్రంలో ఉంచి మూట క‌ట్టాలి. త‌డి ఆరిపోకుండా అప్పుడ‌ప్పుడు నీటిని చ‌ల్లుతూ ఉండాలి. గింజ‌లు మొల‌కెత్త‌డానికి వాత‌వ‌ర‌ణ ప్ర‌భావం చాలా ఉంటుంది. వేస‌వి కాలంలో గింజ‌లు త్వర‌గా మొల‌కెత్తుతాయి. మిగిలిన కాలాల్లో గింజ‌లు మొల‌కెత్త‌డానికి ఒక‌టి లేదా రెండు రోజుల స‌మ‌యం ప‌డుతుంది.

అదే స‌మ‌యంలో గ‌ట్టి గింజ‌లు మొల‌కెత్త‌డానికి మ‌రింత స‌మ‌యం ప‌డుతుంది. ప్ర‌స్తుతం మొల‌క‌లు త‌యారు చేసుకోవ‌డానికి ప్ర‌త్యేక బాక్సులు కూడా మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. మొల‌క‌లు త‌యారు చేసుకోవ‌డానికి తాజా విత్త‌నాలను ఎంచుకోవ‌డం మంచిది. ఈ మొల‌కెత్తిన గింజ‌ల‌ను సాయంత్రం ఆరు, ఏడు గంట‌ల స‌మ‌యంలో తిన‌కూడ‌దు. మ‌ధ్యాహ్న భోజ‌నంలో మాంసాహారం తీసుకుంటే సాయంత్రం స‌మ‌యంలో మొల‌కెత్తిన గింజ‌ల‌ను తీసుకోవాలి. దీని వ‌ల్ల మాంసాహారంలోని అధిక కొవ్వు చేసే ప‌దార్థాల నుండి త‌ప్పించుకోవ‌చ్చు. ఎటువంటి కానీ స‌మ‌యంలో ఆకలేస్తే చిరుతిళ్ల‌ను తిన‌కుండా మొల‌కెత్తిన గింజ‌లను తీసుకోవాలి. వీటిని రోజూ తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం మ‌న‌కు అందుతుందని నిపుణులు చెబుతున్నారు.

Tags: sprouts
Previous Post

Wheat Flour Gulab Jamun : గోధుమ పిండితో గులాబ్ జామున్‌ల‌ను ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Next Post

Pulipirlu : పులిపిర్ల‌ను త‌గ్గించే స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాలు ఇవి.. త‌ప్ప‌క ప‌నిచేస్తాయి..!

Related Posts

ఆధ్యాత్మికం

ఒకే గోత్రం ఉన్న‌వారు పెళ్లి చేసుకోకూడ‌దా..? వివాహం అయితే పిల్ల‌లు పుట్టరా..?

July 23, 2025
వైద్య విజ్ఞానం

దంతాలు, చిగుళ్లు, నోరు ఆరోగ్యంగా లేక‌పోతే గుండె జ‌బ్బులు వ‌స్తాయా..?

July 23, 2025
ఆధ్యాత్మికం

ప‌సికందుల క‌ణ‌త‌ల‌కు న‌ల్లని చుక్క ఎందుకు పెడ‌తారో తెలుసా..?

July 23, 2025
హెల్త్ టిప్స్

అంద‌మైన వ‌క్ష సంప‌ద కావాలంటే.. అమ్మాయిలు ఈ చిట్కాల‌ను పాటించాలి..!

July 23, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

రోజూ గంట‌ల త‌ర‌బ‌డి కూర్చుని ప‌నిచేస్తున్నారా..? అయితే ఇది చ‌దవండి..!

July 23, 2025
ఆధ్యాత్మికం

ఈ రాశులు ఉన్న‌వారు రెండు స్వ‌భావాల‌ను క‌లిగి ఉంటార‌ట‌..!

July 23, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.