Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home Off Beat

బ‌య‌ట‌కు చూసేందుకు అంత‌గా బాగోని రెస్టారెంట్లు, ఫుడ్ బాగున్న‌వి ఎక్క‌డైనా ఉన్నాయా..?

Admin by Admin
June 28, 2025
in Off Beat, వార్త‌లు
Share on FacebookShare on Twitter

బయటినుండి చూడటానికి బాగుండని రెస్టారెంటుకు వెళ్ళి రుచికరమైన ఆహారం తిన్న సందర్భం మీకు ఎదురైందా? అయ్యుంటే ఎక్కడ? ఏమి తిన్నారు? బావుండని అన్న‌ప్పుడు మీ ఉద్దేశం ఆడంబరపూర్వక, ఆధునిక రూపురేఖలు లేకుండా ఉన్నది అని అనుకుంటున్నా. చాలా ఊళ్ళల్లో ఎన్నో సార్లు బయటకు రూపురేఖలు గొప్పగా లేని రెస్టారెంట్స్ లో ఎంతో రుచికరమైన ఆహారం తిన్నాను. ఎందుకో ఈ రెండు ఇక్కడ చెప్పాల్సినవి అనిపించాయి. ఆనంద భవన్, గుంటూరు.. ఈ ఫలహారశాలకు అటు-ఇటుగా మన గణతంత్ర భారత దేశానికి ఉన్నంత దీర్ఘ చరిత్ర ఉంది. చూడగానే ఆకర్షణీయమైన రెస్టారెంట్ లాగా కనిపియకపోవచ్చు. కానీ అది పాత కట్టడం అవ్వటంతో నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం. ఈ హోటల్ లో ఒకప్పుడు రెండు పూటలా శాఖాహార భోజనం, టిఫిన్లు, కాఫీ-టీలు ఉండేవి. ఇప్పుడు కేవలం మధ్యాహ్న భోజనం మాత్రమే.

చిన్నప్పుడు రుచులు తెలియని రోజులలో గుంటూరు వెళ్ళినప్పుడల్లా అక్కడే టిఫిన్లు, భోజనాలు. టిఫిన్స్ ఇష్టపడి తినే వాడిని కానీ, భోజనం తినాలి అని తినే వాడిని. తర్వాత చాలా సంవత్సరాలు అక్కడ తినటం వీలుపడలేదు. నాకు రుచులు, వాటి సూక్ష్మ వివరణలు తెలిసాక అనుకోకుండా అక్కడికి నా స్నేహితుడితో వెళ్ళాను. బయట చూసి కొంచెం ఆలోచించా వెళ్దామా ఒద్దా అని. అయితే ఒక విషయం మాత్రం నిక్కచ్చిగా తెలుసు – ఎంతో శుభ్రంగా వొండుతారని. ఆ నమ్మకంతో బాహ్య రూపాన్ని పట్టించుకోక లోపలికి వెళ్ళాము. ఇంత మంచి శాఖాహార భోజనం నేను ఇప్పటివరకు తినలేదు, తింటానని అనుకోవట్లేదు. రుచులు తెలిసిన ఎవరికైనా వంటకాలలో నాణ్యత ఇట్టే తెలిసిపోతుంది. ఈ కాలం యువతకి మంచి భోజనం అంటే 20 రకాల వంటకాలతో వేడి అన్నం, కావాల్సినంత నెయ్యి. ఈ హోటల్ లో అన్ని రకాలు ఉండవు. అరటి ఆకులో సాదా భోజనం. మా పెదనాన్న ఎప్పుడో ఎవరితోనో అంటుంటే విన్నాను. వేపుడు కూర కూడా పెట్టకుండా అంత వసూలు చేయగలిగింది ఇయన ఒక్కడే అయ్యా! వేపుడు కూడా ఉండదు అంటే ఊహించుకోండి ఎంత సాధారణ భోజనమో. క్రికెట్ నేపధ్యంలో టెక్స్ట్-బుక్ షాట్ అంటారు చూడండి – ఇక్కడి వంటకాలు కూడా అంతే, ఇలాగే ఉండాలి అనిపించేలా ఉంటాయి. వెల్లుల్లి, మసాలలే కావాలి అనుకునే వారికి ఇది సరైన భోజనశాల కాదు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఒకతను తన పక్కన ఉన్న స్నేహితుడితో ఇలా అన్నారు: ఏదైనా బాగుంది అని తెలియాలి అన్నా ఒక క్లాస్ ఉండాలి రా!

what are some good hotels you have seen even their out side is bad

అప్పలరాజు మిలిటరీ హోటల్, ఏలూరు: చాలా సంవత్సరాల క్రితం స్నేహితులతో కలిసి విజయవాడ నుంచి ఏలూరు కేవలం దీని పని చూడటానికే వెళ్ళా. అప్పటికే ఈ హోటల్ గురించి ఎంతో గొప్పగా విన్నాను. తీరా అక్కడికి వెళ్ళాక బయట అంత బురదగా, అశుభ్రంగా ఉంది. నేను రాను అని మొత్తుకున్నా, అయినా కూడా గోల చేసి తీసుకెళ్లారు. అయిష్టంగా, తప్పక నన్ను నేను ఇదుచుకుంటు లోపలికి వెళ్ళాను. భోజనానికీ కూర్చోగానే ఎందుకో మంచి అనుభూతి కలిగింది. ఇది మాంసాహార భోజనశాల. ఎన్నో రకాల మాంసం వంటకాలు దొరుకుతాయి – నాటు కోడి, చికెన్, మటన్, రొయ్యలు, పీతలు, చేప, కంజు పిట్ట మొదలైనవి – వీటితో రకరకాల వంటకాలు. భోజనం బాగుంటుంది. ఇక్కడ తినకపోతే జీవితంలో ఒకటి కోల్పోతారు లాంటి వాక్యాలు దీనికి వాడను కానీ పీక‌ల వర‌కు తినటం అంటే ఎంటో మొదటిసారి అక్కడే అనుభవించా. తర్వాత అక్కడే మరెన్నో సార్లు అనుభవించా అనుకోండి! పని లేకుంటే తప్పకుండా ఇదే పనిగా పెట్టుకొని వెళ్ళదగ్గ రెస్టారెంటే!

Tags: hotels
Previous Post

అమెరికా, ఇజ్రాయెల్ కలిసి యుద్ధం చేసినా ఇరాన్ ఎందుకు లొంగిపోలేదు?

Next Post

ఉత్తర కొరియా లేదా ఇరాన్.. అమెరికాపై అణుబాంబు ఎందుకు వేయలేవు? వారిని ఆపేది ఏమిటి?

Related Posts

ఆధ్యాత్మికం

చిన్నారుల‌కు చెవులు కుట్టించే ఆచారం వెనుక దాగి ఉన్న సైన్స్ ఇదే.. ఎలాంటి లాభాలు ఉంటాయంటే..?

July 22, 2025
హెల్త్ టిప్స్

వెల్లుల్లి జ్యూస్ తాగ‌డం వ‌ల్ల ఇన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..?

July 22, 2025
Off Beat

ఏప్రిల్ 1వ తేదీన ఫూల్స్ డే అని ఎందుకు అంటారో తెలుసా..? వెనకున్న ఆసక్తికర విషయం ఇదే..!

July 21, 2025
vastu

బెడ్‌రూమ్‌లో ఈ వాస్తు చిట్కాల‌ను పాటిస్తే.. దంప‌తుల మ‌ధ్య అస‌లు గొడ‌వ‌లే ఉండ‌వు..

July 21, 2025
information

రైలు కడ్డీలు ఎందుకు అడ్డంగానే ఉంటాయి ? దానికి కారణం ఏంటి ? ?

July 21, 2025
ఆధ్యాత్మికం

న‌ర దిష్టి, న‌ర‌ఘోష త‌గ‌ల‌కుండా ఉండాలంటే.. ఈ చిన్న ప‌ని చేయండి చాలు..!

July 21, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.