రైలు నడుపుతున్న డ్రైవర్ పొరపాటున నిద్రలోకి జారుకుంటే ఏమవుతుందో తెలుసా ?

ట్రెయిన్ న‌డిపే. వారిని లోకో పైల‌ట్స్ అంటార‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. లోకో పైల‌ట్‌గా రాణించ‌డం అంటే అంత ఆషామాషీ కాదు. అనుక్ష‌ణం అప్ర‌మ‌త్తంగా ఉండాలి. లేదంటే కొన్ని వంద‌ల మంది ప్రాణాలు గాల్లో క‌లిసిపోతాయి. అయితే పొర‌పాటున అత‌ను నిద్ర లోకి జారుకుంటే ఎలా.. అప్పుడు ట్రెయిన్‌కు ఏమ‌వుతుంది. ఆ స‌మ‌యంలో అత‌న్ని ఎలా అల‌ర్ట్ చేస్తారు..? వ‌ంటి సందేహాలు చాలా మందికి వ‌స్తుంటాయి. అయితే ఇందుకు ఒక లోకో పైల‌ట్ ఏమ‌ని స‌మాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

నేను రైలు లోకో పైలట్ . రైలులో ఇద్దరు లోకో పైలట్లు ఉంటారు . వారిలో ఒకరు సీనియర్ లోకో పైలట్ మరియు మరొకరు అసిస్టెంట్ లోకో పైలట్. లోకో పైలట్ నిద్రలోకి జారుకున్నట్లయితే, అసిస్టెంట్ లోకో పైలట్ లోకో పైలట్‌ను అప్రమత్తం చేస్తాడు. ఒకవేళ ఇద్దరూ నిద్రలోకి జారుకుంటే, లోకోపైలట్‌ అలర్ట్ కోసం విజిలెన్స్ కంట్రోల్ డివైస్ (VCD) అనేది మైక్రోకంట్రోలర్ ఆధారిత భద్రతా పరికరం ఉంటుంది. ఇది డ్రైవర్ అసమర్థమైన సందర్భంలో స్వయంచాలకంగా ట్రైన్ యొక్క బ్రేక్స్ ని అప్లై చేస్తుంది.

what happens if loco pilot in indian train suddenly falls asleep

ఇది ఎలా పనిచేస్తుంది అంటే ప్రతి 60 సెకండ్స్ లోపు లోకో పైలట్ ఎదో ఒక ఆపరేషన్ చెయ్యాలి. Means సౌండింగ్ horns or ఇంక్రిజ్ ట్రైన్ స్పీడ్ or decrease ట్రైన్ స్పీడ్ like that. ఒక వేళ డ్రైవర్ అలా చెయ్యనిచో ఆఫ్టర్ 60 సెకండ్స్ one లైట్ will బ్లింక్ upto 8 సెకండ్స్, ఆఫ్టర్ that one buzzer సౌండ్ ఇంకో 8 సెకండ్స్ వస్తుంది, అయినా కూడా డ్రైవర్ అలెర్ట్ కాకపోతే ట్రైన్ యొక్క బ్రేక్స్ ఆటోమాటిక్ గా అప్లై అయిపోయి ట్రైన్ ఆగిపోతుంది. ఇలా లోకో పైల‌ట్స్ నిద్ర‌లోకి జారుకుంటే ట్రెయిన్ దానంత‌ట ఆగిపోతుంది. దీంతో ప్ర‌మాదం జ‌ర‌గ‌కుండా నివారించ‌వ‌చ్చు.