Blood Sugar Levels : షుగ‌ర్ ఉన్న‌వారికి శుభవార్త‌.. ఈ పొడిని రోజుకు రెండు సార్లు తీసుకుంటే చాలు..!

Blood Sugar Levels : షుగ‌ర్ స‌మ‌స్య‌తో ప్ర‌స్తుతం చాలా మంది ఇబ్బందులు ప‌డుతున్నారు. శ‌రీరంలో షుగ‌ర్ లెవ‌ల్స్ అధికంగా ఉండ‌డం వ‌ల్ల ఇత‌ర అనారోగ్యాల బారిన ప‌డుతున్నారు. ముఖ్యంగా టైప్ 2 డ‌యాబెటిస్ చాలా మందికి వ‌స్తోంది. ఇది స‌మ‌స్య‌ల‌ను సృష్టిస్తోంది. అయితే షుగ‌ర్ స‌మ‌స్య ఉన్న‌వారు క‌రివేపాకుల పొడిని రోజూ తీసుకుంటే దాంతో షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. 43 మందిపై నిర్వ‌హించిన ప‌రిశోధ‌న‌ల్లో సైంటిస్టుల‌కు ఈ విష‌యం తెలిసింది.

take curry leaves powder daily to reduce Blood Sugar Levels
Blood Sugar Levels

క‌రివేపాకుల్లో ఉండే స‌మ్మేళ‌నాలు షుగ‌ర్ లెవ‌ల్స్‌ను నియంత్రించ‌గ‌ల‌వ‌ని నిర్దారించారు. క‌రివేపాకు పొడిని రోజూ ఉద‌యం, సాయంత్రం భోజ‌నానికి 30 నిమిషాల ముందు తీసుకోవాలి. ఒక టీస్పూన్ పొడిని తీసుకుని నీళ్లు తాగాలి. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల 30 రోజుల్లో షుగ‌ర్ లెవ‌ల్స్ గ‌ణ‌నీయంగా తగ్గిన‌ట్లు నిర్దారించారు. కాబ‌ట్టి షుగ‌ర్ స‌మ‌స్య‌కు క‌రివేపాకు బాగా ప‌నిచేస్తుంద‌ని సైంటిస్టులు చెబుతున్నారు.

క‌రివేపాకుల‌తో ఇంకా ఇత‌ర అనేక ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి. వీటి పొడిని రోజూ తీసుకుంటే ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూడ‌వ‌చ్చు. అలాగే జీర్ణ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.