Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home sports

క్రికెట్ ఆటలో ప్రపంచంలోనే అత్యంత చిన్నదైన సిక్సర్ ఇదేనట..!

Admin by Admin
March 28, 2025
in sports, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో ఎన్నో రకాల ఆటలు చలామణీలో ఉన్నాయి. వాటిలో కొన్ని గుర్తింపుకు నోచుకోనివి కూడా ఉన్నాయి. ఇంకొన్ని ప్రముఖ ఆటలుగా పేరుగాంచాయి. అలాంటి వాటిలో క్రికెట్ కూడా ఒకటి. తక్కువ దేశాలు మాత్రమే ఈ ఆట ఆడుతున్నా చూసే ప్రేక్షకులు మాత్రం ఎక్కువే. ఈ క్రమంలో ఈ ఆటలో ఉన్న పూర్తి నియమ నిబంధనలు ఇప్పటికీ కొంత మందికి తెలియవు. అయినా బంతిని బ్యాట్‌తో బాదడం, వికెట్ తీయడం, క్యాచ్ పట్టడం వంటి అంశాలు ఉన్న నేపథ్యంలో క్రికెట్ ప్రియులు ఎక్కువగా వాటినే చూస్తుంటారు. నియమ నిబంధనల గురించి పట్టించుకోకుండా కేవలం ఆటను చూసే ఎంజాయ్ చేస్తుంటారు.

అయితే ఈ ఆటలో జరిగే కొన్ని మ్యాచ్‌లలో అప్పుడప్పుడు వింతైన సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అవి ఆటగాళ్ల పరంగా, ప్రేక్షకుల పరంగా, అంపైర్ల పరంగా… ఎవరి వల్లయినా కావచ్చు, అవి అలా జరిగిపోతూ ఉంటాయి. ఇవి కాకుండా మ్యాచ్‌లో చోటు చేసుకునే కొన్ని సంఘటనల వల్ల ఈ ఆటకు సంబంధించిన రూల్స్ కూడా అప్పుడప్పుడు మనకు తెలుస్తుంటాయి. చాలా ఏళ్ల కిందట పాకిస్థాన్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన ఓ వన్డే మ్యాచ్‌లో పైన చెప్పిన విధంగానే ఓ సంఘటన చోటు చేసుకుంది. అదేమిటంటే శ్రీలంక బౌలర్ వేసిన బంతిని ఓ పాకిస్థాన్ క్రికెటర్ స్వీప్ చేయబోయే క్రమంలో బంతి బ్యాట్ ఎడ్జ్‌ను తీసుకుని గాల్లోకి లేచి వెనుకనే ఉన్న వికెట్ కీపర్ హెల్మెట్‌లో పడింది.

this is the smallest sixer in cricket

అప్పుడు ఆ హెల్మెట్ కీపర్ వెనుక గ్రౌండ్ మీద ఉండడం గమనార్హం. ఈ క్రమంలో పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ ఒక పరుగు కూడా తీశారు. అయితే అంపైర్ మాత్రం వారికి మొత్తం 6 పరుగులు ఇచ్చాడు. ఆశ్చర్యంగా ఉందా? అయినా అది నిజమే. ఎందుకంటే బ్యాట్స్‌మెన్ ఆడిన బంతి గాల్లోకి లేచి వికెట్ కీపర్ హెల్మెట్‌లో పడడంతో క్రికెట్ నియమ నిబంధనల ప్రకారం బ్యాటింగ్ జట్టుకు 5 పరుగులు లభిస్తాయి. దీంతో అంపైర్ ఆ 5 పరుగులతోపాటు వారు తీసిన మరో పరుగును కలిపి మొత్తం 6 పరుగులను పాకిస్థాన్ జట్టుకు ఇస్తున్నట్టు తెలియజేశాడు. కాగా ఈ వీడియోను పలువురు క్రికెట్ ప్రేమికులు యూట్యూబ్‌లోకి అప్‌లోడ్ చేసి దానికి వరల్డ్ స్మాలెస్ట్ సిక్స్‌గా పేరు పెట్టడం కొసమెరుపు.

Tags: sixer
Previous Post

రంగ‌నాథ్ సినిమాల్లోకి ఎలా వ‌చ్చారో తెలుసా..? ఆయ‌న క‌థ చ‌దివితే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Next Post

ప్ర‌పంచంలో అత్యంత శ‌క్తి వంత‌మైన భాష‌లు ఇవే…9 వ స్థానంలో హిందీ.

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025

POPULAR POSTS

No Content Available
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.