Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home viral news

సముద్రంలో కూలనున్న ఇంటిని రూ.3 కోట్లకు కొన్న వ్యక్తి! ఎందుకంటే..

Admin by Admin
April 12, 2025
in viral news, వార్త‌లు
Share on FacebookShare on Twitter

త్వరలో కూలిపోయే అవకాశం మెండుగా ఉన్న ఇంటిని ఓ అమెరికా వ్యక్తి దాదాపు మూడు కోట్లకు కొన్న ఉదంతం ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశం అవుతోంది. కస్టమర్ల ధోరణిలో మార్పులకు ఈ ఉదంతం అద్దం పడుతోందని అక్కడి రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు. మాసాచుసెట్స్ రాష్ట్రంలోని ఈస్థమ్ సముద్ర తీరంలో ఈ మూడు పడకగదుల ఇల్లు. తీరంలో 25 అడుగుల ఎత్తున ఇసుక తిన్నెలపై ఈ ఇంటిని నిర్మించారు. 2022లో ఈ ఇంటిని అమ్మకానికి పెట్టారు. అప్పట్లో దీని ధర 1.195 మిలియన్ డాలర్లు పలికింది. అయితే, తీరం కోతకు గురవుతుండటంతో ఇది మరో పదేళ్లకు మించి నిలిచుండదని తేలడంతో డిమాండ్ పడిపోయింది.

చివరకు డేవిడ్ మూట్ (59) అనే ఇంటీరియర్ డిజైనర్ దీన్ని 67 శాతం తక్కువ ధరకు కొనుగోలు చేశాడు. జీవితం చాలా చిన్నది. ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. చూద్దాం.. మున్ముందు ఏం జరగనుందో. ఇది ఏదో రోజు సముద్రంలో కూలిపోతుంది. అయితే, నా జీవితకాలంలో అది జరగకపోవచ్చు అంటూ డేవిడ్ ధీమా వ్యక్తం చేశారు. అయితే, ఇటీవల కాలంలో అనేక మంది ఇలాగే ఆలోచిస్తున్నారని అక్కడి రియల్ ఎస్టేట్ ఏజెంట్లు చెబుతున్నారు. వాతావరణ మార్పుల కారణంగా కనుమరుగయ్యే రియల్ ఎస్టేట్ ఆస్తులను తక్కువ ధరల్లో సొంతం చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలిపారు.

man bough this house for huge money

కాగా, అగ్రిమెంట్ కుదుర్చుకునే ముందు డేవిడ్ నిపుణులను సంప్రదించారు. ప్రమాదావకాశాలను తగ్గించుకునేందుకు పలు చర్యలు చేపట్టేందుకు సిద్ధమై ఇంటిని కొనుగోలు చేశారు. ముఖ్యంగా ఇంటి కింద మట్టి కొట్టుకుపోకుండా ఉండేందుకు అక్కడ మొక్కలను పెంచడం, ఇంటిలో కొంత భాగాన్ని సముద్రానికి మరింత దూరంగా జరపడం వంటి చర్యలు చేపడుతున్నారు. నిపుణుల ప్రకారం, అక్కడ తీరం కోతకు గురవడంతో పాటు సముద్రం మట్టం కూడా పెరిగి తీర ప్రాంతం ముంపునకు గురవుతుంద‌ట‌.

అయితే, ఇలాంటి ఆస్తుల కొనుగోళ్లు చేయొద్దని ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ స్టీఫెన్ లెదర్‌మన్ అన్నారు. తీరంలో ఉన్న ఆస్తులతో పలు ప్రమాదాలు ఉన్నాయని, ముఖ్యంగా తుఫాన్ల సందర్భంగా ప్రమాదాలకు ఛాన్స్ పెరుగుతుందని హెచ్చరించారు. అయితే, తన లాగా జీవిత చరమాంకంలో ఉన్న వారికి ఈ ఇంట్లో ఉండి ప్రకృతి అందాలను తిలకించే అవకాశం కల్పించాలన్నదే తన ఉద్దేశమని డేవిడ్ మూట్ తెలిపారు.

Tags: House
Previous Post

సంతాపానికి సూచ‌కంగా 2 నిమిషాలు మౌనం ఎందుకు పాటిస్తారు..? ఈ కాన్సెప్ట్ కి కారణం ఏమిటి?

Next Post

తెనాలి పానీపూరి వ్యాపారికి రాష్ట్రపతి నుంచి ఆహ్వానం.. ఎందుకో తెలుసా..?

Related Posts

ఆధ్యాత్మికం

చిన్నారుల‌కు చెవులు కుట్టించే ఆచారం వెనుక దాగి ఉన్న సైన్స్ ఇదే.. ఎలాంటి లాభాలు ఉంటాయంటే..?

July 22, 2025
హెల్త్ టిప్స్

వెల్లుల్లి జ్యూస్ తాగ‌డం వ‌ల్ల ఇన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..?

July 22, 2025
Off Beat

ఏప్రిల్ 1వ తేదీన ఫూల్స్ డే అని ఎందుకు అంటారో తెలుసా..? వెనకున్న ఆసక్తికర విషయం ఇదే..!

July 21, 2025
vastu

బెడ్‌రూమ్‌లో ఈ వాస్తు చిట్కాల‌ను పాటిస్తే.. దంప‌తుల మ‌ధ్య అస‌లు గొడ‌వ‌లే ఉండ‌వు..

July 21, 2025
information

రైలు కడ్డీలు ఎందుకు అడ్డంగానే ఉంటాయి ? దానికి కారణం ఏంటి ? ?

July 21, 2025
ఆధ్యాత్మికం

న‌ర దిష్టి, న‌ర‌ఘోష త‌గ‌ల‌కుండా ఉండాలంటే.. ఈ చిన్న ప‌ని చేయండి చాలు..!

July 21, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.