Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home మొక్క‌లు

Palleru : పొలాల గ‌ట్ల‌పై దొరికే మొక్క ఇది.. కనిపిస్తే వ‌ద‌ల‌కుండా ఇంటికి తెచ్చుకోండి..!

D by D
May 28, 2022
in మొక్క‌లు, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Palleru : పొలాల గ‌ట్లపై న‌డిచేట‌ప్పుడు కాళ్ల‌కు గుచ్చుకుపోతుంటాయ‌ని మ‌నం కొన్ని మొక్క‌ల‌ను తొల‌గిస్తూ ఉంటాం. ఇలా తొల‌గించే మొక్క‌ల‌లో ప‌ల్లేరు మొక్క కూడా ఒక‌టి. కానీ ఈ మొక్క ప‌రిపూర్ణ‌మైన ఆరోగ్యాన్ని ఇవ్వ‌గ‌ల‌ద‌ని చాలా మందికి తెలియ‌దు. ప‌ల్లేరు మొక్క‌లు చాలా చిన్న‌గా ఉండి భూమిపై పాకుతూ ఉంటాయి. వీటిలో చిన్న ప‌ల్లేరు, పెద్ద ప‌ల్లేరు అని రెండు ర‌కాలు ఉంటాయి. వీటి పువ్వులు ప‌సుపు రంగులో ఉంటాయి. ఈ మొక్కను ఉప‌యోగించి మ‌న‌కు వ‌చ్చే దీర్ఘ కాలిక వ్యాధుల‌న్నింటినీ న‌యం చేసుకోవ‌చ్చు. ఈ మొక్కను ఉప‌యోగించి మనం ఏయే ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

ప‌ల్లేరు కాయ‌ల‌ను 20 గ్రా. ల చొప్పున తీసుకుని దంచి అర లీట‌ర్ నీటిలో వేసి 2 క‌ప్పుల క‌షాయం మిగిలే వ‌ర‌కు మ‌రిగించి రెండు పూట‌లా తాగుతూ ఉండాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల త‌ల‌లో చేరిన చెడు నీరు, జ‌లుబు, మూర్ఛ‌, త‌ల‌తిర‌గ‌డం వంటివి త‌గ్గి శ‌రీరం బ‌లంగా త‌యార‌వుతుంది. క‌ళ్ల క‌ల‌క‌ స‌మ‌స్య‌ను న‌యం చేయడంలో కూడా ఈ మొక్క ఉప‌యోగ‌ప‌డుతుంది. ప‌ల్లేరు మొక్క లేత ఆకుల‌ను తీసుకుని దంచి వ‌స్త్రంలో ఉంచి మూట క‌ట్టాలి. ఇప్పుడు క‌ళ్ల‌ను మూసి ప‌ల్లేరు ఆకుల మూట‌ను క‌ళ్ల‌పై కట్టుగా క‌ట్టాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల క‌ళ్ల క‌ల‌క‌ త‌గ్గుతుంది.

Palleru plant amazing health benefits
Palleru

గుండె సంబంధిత స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలోనూ ప‌ల్లేరు మొక్క దోహ‌ద‌ప‌డుతుంది. గుండె సంబంధిత స‌మ‌స్య‌లు ఉన్న వారు అర లీట‌ర్ నీటిలో రెండు టీస్పూన్ల ప‌ల్లేరు స‌మూల చూర్ణాన్ని వేసి 2 క‌ప్పుల క‌షాయం మిగిలే వ‌ర‌కు మరిగించాలి. ఇలా మ‌రిగించ‌గా వ‌చ్చిన క‌షాయంలో కండ చ‌క్కెర‌ను క‌లిపి రెండు పూట‌లా తాగుతూ ఉండాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల గుండె సంబంధిత స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. నోటి దుర్వాస‌న‌, చిగుళ్ల‌ నుండి ర‌క్తం కార‌డం, నోటి పూత, నోట్లో పుండ్లను త‌గ్గించ‌డంలోనూ ఈ మొక్క తోడ్ప‌డుతుంది. ప‌ల్లేరు సంపూర్ణ చూర్ణాన్ని 20 గ్రా. ల చొప్పున తీసుకుని పావు లీటర్ నీటిలో వేసి స‌గం అయ్యే వ‌ర‌కు మ‌రిగించాలి. ఇలా మ‌రిగించిన నీరు గోరు వెచ్చ‌గా ఉన్న‌ప్పుడే నోట్లో పోసుకుని పుక్కిలించ‌డం వ‌ల్ల నోటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఇలా మ‌రిగించిన నీటిని తాగ‌డం వ‌ల్ల గొంతు నొప్పి, ఆయాసం, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

మ‌గ వారిలో వ‌చ్చే సంతాన స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో ఈ మొక్క ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. 5 గ్రా. ప‌ల్లేరు కాయ‌ల పొడిని, 5 గ్రా. ల కండ చ‌క్కెర పొడిని తీసుకుని క‌లిపి రెండు పూట‌లా చ‌ప్ప‌రించి ఒక గ్లాస్ పాల‌ను తాగ‌డం వ‌ల్ల శీఘ్ర‌స్క‌ల‌నం, స్వ‌ప్న స్క‌ల‌నం, మూత్రంలో వీర్యం పోవ‌డం వంటి స‌మ‌స్య‌లు త‌గ్గి వీర్య క‌ణాల సంఖ్య అమితంగా పెరుగుతుంది. ఈ మొక్క మొత్తాన్ని తీసుకుని శుభ్రంగా క‌డిగి దంచి ర‌సాన్ని తీయాలి. ఈ ర‌సానికి రెట్టింపు కండ చ‌క్కెర‌ను క‌లిపి తీగ పాకం వ‌చ్చే వ‌ర‌కు మ‌రిగించి నిల్వ చేసుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని 2 టీ స్పూన్ల చొప్పున తీసుకుని 2 క‌ప్పుల నీటిలో క‌లిపి రెండు పూట‌లా తాగ‌డం వ‌ల్ల కామెర్లు, కాలేయ సంబంధిత స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. కాలేయం బ‌లంగా త‌యార‌వుతుంది.

ప‌ల్లేరు మొక్క ఆకుల ర‌సాన్ని అర క‌ప్పు చొప్పున రెండు పూట‌లా తాగ‌డం వ‌ల్ల మూత్రాశ‌య సంబంధిత స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. మూత్ర పిండాల‌లో రాళ్ల స‌మ‌స్య కూడా త‌గ్గుతుంది. స్త్రీల‌ల్లో బ‌హిష్టు ఆగ‌కుండా అవుతూనే ఉంటే ప‌ల్లేరు కాయ‌ల పొడిని ఒక స్పూన్ చొప్పున తీసుకుని ఒక గ్లాస్ నీటిలో వేసి క‌లిపి ఒక క‌ప్పు అయ్యే వ‌ర‌కు మ‌రగించి రెండు పూట‌లా తీసుకోవ‌డం వ‌ల్ల స్త్రీల‌లో బ‌హిష్టు ఆగుతుంది.

సంతానం లేని స్త్రీలు పెద్ద ప‌ల్లేరు కాయ‌ల పొడి 5 గ్రా., వావిలాకు ర‌సం 20 గ్రా. చొప్పున తీసుకుని క‌లిపి బ‌హిష్టు స్నానం చేసిన రోజు రాత్రి నుండి 7 రోజుల పాటు తీసుకుంటూ ఉండ‌డం వల్ల గ‌ర్భాశ‌య స‌మ‌స్య‌లు త‌గ్గి సంతానం క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో కూడా ఈ మొక్క ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. జుట్టు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న వారు ఈ మొక్క మొత్తాన్ని తీసుకుని దంచి ర‌సం తీయాలి. ఈ ర‌సానికి స‌మ‌పాళ్ల‌ల్లో నువ్వుల నూనెను క‌లిపి కేవ‌లం నూనె మిగిలే వ‌ర‌కు మ‌రిగించి, వ‌డ‌క‌ట్టి నిల్వ చేసుకోవాలి. ఇలా త‌యారుచేసిన నూనెను జుట్టు కుదుళ్ల‌కు ప‌ట్టేలా బాగా రాయాలి. ఈ విధంగా ప్ర‌తి రోజూ చేయ‌డం వ‌ల్ల జుట్టు స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. చాలా కాలం వ‌ర‌కు జుట్టు తెల్ల‌గా మార‌కుండా ఉంటుంది.

ప‌ల్లేరు చెట్టు కాడ‌ల ర‌సాన్ని అరి కాళ్ల‌కు రాసుకోవ‌డం వ‌ల్ల అరికాళ్ల మంట‌లు త‌గ్గుతాయి. ఈ విధంగా ప‌ల్లేరు మొక్క‌ను ఉప‌యోగించి మ‌న‌కు వ‌చ్చే అనేక ర‌కాల స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

Tags: Palleru
Previous Post

Locker Box : మీ ఇంట్లో డబ్బు పెట్టె (లాకర్‌ బాక్స్‌)ను ఇలా పెట్టండి.. కనకవర్షమే ఇక..!

Next Post

Tomato Dosa : ఎంతో రుచికరమైన టమాటా దోశ.. తయారీ ఇలా.. పోషకాలు కూడా లభిస్తాయి..!

Related Posts

హెల్త్ టిప్స్

పాప్‌కార్న్‌ను అధికంగా తింటున్నారా..? అయితే ముందు ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

July 22, 2025
inspiration

మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ వాడే ఫోన్ ఏంటో తెలుసా..? ఆపిల్ iPhone వాడకపోవటానికి కారణం ఇదే..!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోజూ భోజ‌నంలో పెరుగును త‌ప్ప‌నిస‌రిగా తినాల్సిందే.. ఎందుకంటే..?

July 22, 2025
mythology

ఈ ప‌నులు చేస్తున్నారా..? అయితే ఆయుష్షు త‌గ్గుతుంద‌ట‌.. గ‌రుడ పురాణంలో చెప్పారు..!

July 22, 2025
వినోదం

1980లో టాలీవుడ్ హీరోలు ఎంత రెమ్యూనరేషన్ తీసుకునే వారో తెలుసా?

July 22, 2025
ఆధ్యాత్మికం

చిన్నారుల‌కు చెవులు కుట్టించే ఆచారం వెనుక దాగి ఉన్న సైన్స్ ఇదే.. ఎలాంటి లాభాలు ఉంటాయంటే..?

July 22, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.