Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home Off Beat

అక‌స్మాత్తుగా భూమి తిర‌గ‌డం ఆగిపోతే ఏమ‌వుతుందో తెలుసా..?

Admin by Admin
March 17, 2025
in Off Beat, వార్త‌లు
Share on FacebookShare on Twitter

సైన్స్ టీచర్ పిల్లలను ఒక ప్రశ్న అడిగాడు అదేంటంటే భూమి అకస్మాత్తుగా తిరగడం ఆగిపోయిందని అనుకుందాం అప్పుడు ఏమి జరుగుతుంది? విద్యార్థులందరూ ఒకరినొకరు చూసుకుంటున్నారు. అప్పుడు హరీష్ అనే విద్యార్థి లేచి నిలబడి సార్, బహుశా అందరూ పడిపోయి ఉండవచ్చు అన్నాడు. గురువు నవ్వుతూ అడిగాడు. పడిపోతుంది కానీ నేను ఏ దిశలో ?హరీష్ తరగతి గది చుట్టూ చూసి ఇలా అన్నాడు బహుశా దక్షిణ దిశలో సార్…….అప్పుడు పిల్లలందరూ గొల్లున నవ్వారు…. గురువు గారు సరే వేరే ఎవరైనా సమాధానం చెప్పగలరా అని ప్రశ్నించగా అరుణ లేచి నిలబడింది. తరగతిలో ఆమె ఎప్పుడూ తెలివైన సమాధానాలు ఇవ్వడంలో చురుకుగా ఉంటుంది. అరుణ ఇలా చెప్పింది సర్, భూమి ఆగిపోతే బహుశా సూర్యుడు కూడా అదే చోట ఆగిపోతాడు అని చెప్పగా అందరు పిల్లలతో పాటు గురువు గారు కూడా నవ్వాడు.

చైతన్య అనే ఇంకో విద్యార్ధి ఎప్పుడూ లోతైన ఆలోచనల్లో ఉండేవాడు…..అతడు గభాలున లేచి సర్ భూమి అంతా తలక్రిందులవుతుందని నేను అనుకుంటున్నాను అని బదులిచ్చాడు. అది ఎలా జరుగుతుందని గురువు గారు అడిగారు….. చైతన్య, సర్, ఉత్తరం వైపు నిలబడి ఉన్నవారు దక్షిణానికి మరియు దక్షిణాన ఉన్నవారు ఉత్తరం వైపు అని జవాబిచ్చాడు….గురువు గారు నిదానంగా లోతైన శ్వాస తీసుకున్నాకా సరే, చివరికి ఎవరో ఒకరు చెప్పాలి అని విద్యార్థులను అడిగాడు…. అప్పుడు విఘ్న అనే అమ్మాయి నిదానంగా లేచి నిలబడి, ప్రశాంతంగా సర్ భూమి ఆగిపోతే మొత్తం వేగం అకస్మాత్తుగా అదృశ్యమవుతుంది…..గతి అనే ప్రక్రియ ఆగిపోతే భూగ్రహంపై ప్రమాదాలు సంభవిస్తాయి అని బదులిచ్చింది.

what happens if earth suddenly stops rotating

అప్పుడు గురువుగారు నవ్వుతూ, ఇది నిజమే……కానీ ఇప్పటికి కూడా పూర్తిగా సరైన సమాధానం లభించలేదు అని గురువు గారు అనడంతో విద్యార్థుల ఏమి జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తితో గురువుగారిని తదేకంగా చూడసాగారు. నిజంగా ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి నాకు ఆసక్తిగా ఉంది అంటూ బోర్డు పై చిత్రాన్ని గీస్తూ గురువు ఇలా అన్నాడు భూమి అకస్మాత్తుగా ఆగిపోతే దాని వేగం ఎంత? దాని వేగం గంటకు 1670 కిలోమీటరు. ఆ వేగం ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తుంది, భూమి ఉపరితలంపై ఉన్న వారెవరైనా వేగంగా ముందుకు విసిరి వేయబడతారు అని చెప్పగా, అప్పుడు హరీష్ మనం అందరం ఆకాశంలో ఎగురుతామా? గురువు గారు నవ్వుతూ, లేదు హరీష్ నువ్వు-నేను ఎగరడానికి బదులుగా, మన చుట్టుప్రక్కన ఉన్న గోడలను లేదా ఏదైనా వస్తువును ఢీ కొంటాము…

అప్పుడు చైతన్య సీరియస్‌గా అడిగాడు, అంటే దీని అర్థం మీరు, నేను మనం ఎవరం తప్పించుకోలేమా? అప్పుడు గురువు గారు తల అడ్డంగా ఊపుతూ ఇలాంటిదేదైనా జరిగితే భూమిపై ఉన్న మనుషులు బతికే అవకాశాలు చాలా తక్కువ… అప్పుడు అరుణ సర్ ఈ దుర్ఘటన కేవలం మానవులను మాత్రమే ప్రభావితం చేస్తుందా అని అడిగింది…..అప్పుడు గురువు గారు ఈ దుర్ఘటన గనక సంభవిస్తే వాతావరణంలో పెను మార్పులు సంభవించి నదులు ఉప్పొంగి తుఫాన్, మహాసముద్రాలు ఉప్పొంగి సునామి ఇంకా భూమిపై భూకంపం వంటి భయంకరమైన ప్రకృతి ప్రళయం సంభవిస్తాయి.

ఆ జవాబు విన్నాక క్లాసు మొత్తం నిశ్శబ్దం ఆవహించిందా అని అనిపించింది, పిల్లలందరిని ఆలోచించేలా చేసింది….అప్పుడు విఘ్న మెల్లగా అడిగింది….గురువు గారు ఇలా జరుగుతుందా? గురువు గారు కొద్ది సేపు మౌనం వహించి సీరియస్‌గా జవాబిచ్చాడు…..శాస్త్రజ్ఞుల దృష్టి కోణంలో ఇది అసాధ్యం కాదు, కానీ చాలా అరుదు….. భూమి గతిని ఆపడానికి చాలా పెద్ద బాహ్యశక్తి అవసరం పడుతుంది అని చెప్పాడు…… అప్పుడు చైతన్య గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ ఇలా అన్నాడు మనం భయపడే అవసరం లేదు అని అర్థమన్నమాట…… గురువు గారు నవ్వుతూ అన్నాడు మనం భయపడటానికి ఏమీ లేదు కానీ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది…సైన్స్ అంటే కేవలం ప్రశ్నలు అడగడం కాదు..ప్రశ్నలకు సమాధానాలు, వాటి వెనుక ఉన్న కారణాలను కూడా అధ్యయనం చేయాలి అని పిల్లలకు హితబోధ చేసాడు…. అప్పడు విద్యార్థులందరూ నిశ్శబ్దంగా తల ఊపుతు, వారి వారి సమాధానాలకు నవ్వుకున్నారు.

Tags: earth
Previous Post

మహేష్ బాబు అతడు సినిమా ఆ చిత్రానికి కాపీయా.. త్రివిక్రమ్ అక్కడ నుంచి లేపేశాడా..?

Next Post

డెన్మార్క్ ను సందర్శించాలనుకునేవారు తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి?

Related Posts

lifestyle

పెళ్ళిలో వధూవరులు తెల్లని వస్త్రాలే ఎందుకు ధరిస్తారో తెలుసా..? అసలు కారణం ఇదే..!

July 23, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

ఈ కాఫీని తాగితే ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉంటాయ‌ట‌..!

July 23, 2025
vastu

మీ ఇంట్లో తాబేలు విగ్ర‌హాన్ని ఇలా పెట్టండి.. ల‌క్ క‌ల‌సి వ‌స్తుంది..!

July 23, 2025
వినోదం

కెరీర్ పిక్స్ లో ఉండగా మరణించిన ప్రముఖ సినీ సెలెబ్రిటీలు వీళ్లే?

July 23, 2025
ఆధ్యాత్మికం

ఒకే గోత్రం ఉన్న‌వారు పెళ్లి చేసుకోకూడ‌దా..? వివాహం అయితే పిల్ల‌లు పుట్టరా..?

July 23, 2025
వైద్య విజ్ఞానం

దంతాలు, చిగుళ్లు, నోరు ఆరోగ్యంగా లేక‌పోతే గుండె జ‌బ్బులు వ‌స్తాయా..?

July 23, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
మొక్క‌లు

Gadida Gadapaku : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో.. చేల‌లో ల‌భించే మొక్క ఇది.. అస‌లు విడిచిపెట్ట‌వ‌ద్దు..!

by D
June 10, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.