హైదరాబాదులో మా ఫ్రెండు గత 20 సంవత్సరాల నుండి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు,2023 తెలంగాణ ఎలక్షన్లలలో KCR /BRS ఓడిపోతే రియల్ ఎస్టేట్ పడీపోతుందన్నాడు, 2023లో అనూహ్యంగా BRS ఓడిపోయింది. రియల్ ఎస్టేట్ బిజినెస్ పడిపోయింది. కాంగ్రెస్ గెలిస్తే రియల్ ఎస్టేట్ కుదేలు అయిపోతుంది అని రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, వ్యాపారులు చెప్తూ ఉండేవారు. ఇక ఎలక్షన్ రావడం, కాంగ్రెస్ గెలవడం BRS ఓడిపోవడం జరిగింది, అప్పటిదాకా ఒక వెలుగు వెలిగిన కెసిఆర్ ఇమేజి మసకబారిపోయింది. ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రావడంతోనే హైడ్రా తీసుకురావడం, నాగార్జున లాంటి పెద్ద సెలబ్రిటీ N కన్వెన్షన్ కూలగొట్టడంతో ఎలక్షన్ కు ముందు రియల్ ఎస్టేట్ వాళ్లు ఏవైతే భయపడ్డారో అది సాక్షాత్తు నిజమై కూర్చుంది. నిజానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వాని కంటే ముందు కెసిఆర్ హయాంలో హైదరాబాదు ఒక్క వానకే చిగురుటాకులా వణికిపోవడం మెయిన్ రోడ్లు, దిగువ ప్రాంతాలు, 50% కాలనీలు నీటిలో మునిగిపోయాయి.
అది గమనించి KCR వచ్చి రావడంతోనే అనుమతులు లేని నిర్మాణాలను చెరువులు, నాలాలను పూడ్చి కట్టారని అయ్యప్ప సొసైటీ, హీరో నాగార్జున N convention లాంటి పెద్ద బిల్డింగులను కూల కొట్టడానికిKCR బుల్డోజర్ పంపారు. దాంతో BRS పార్టీలీడర్లు, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు మొత్తుకుంటూ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందని కేసీఆర్ కు నచ్చజెప్పడంతో, KCR అక్రమ కట్టడాలను కూలగొట్టడం నిలిపివేసారు. చెరువులు, చెరువు శిఖాలు, నాలాలు ఆక్రమణలకు గురవుతున్నప్పటికీ, అసలు ఏ అనుమతులు లేనప్పటికీ అక్రమ కట్టడాలవారీని BRS ప్రభుత్వం ఏమీ అనలేదు. దాంతో KCR హాయంలో real estate పతాక స్థాయికి చేరింది. ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రావడంతోే వర్షానికి కాలనీలు మునిగడం, రోడ్డుపై నీళ్లు నిలవడం, కాలనీలో రోజుల తరబడి నీళ్లలో ఉండడం గమనించి.. దానికి కారణం నాలాలు ఆక్రమణ గురవడం, 3000 చెరువులు నామరూపాలు లేకుండా పోవడం కారణంగా తెలుసుకొని అందులో కనీసం 2 వేల చెరువులను, నాలాలను పునరుద్ధరించాలని HYDRA తీసుకువచ్చారు.
నిజానికి ఫలితం కనిపించింది కానీ, తెలంగాణ రియల్ ఎస్టేట్ బిజినెస్ పై హైడ్రా అనే పిడుగు పడింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి HYDRA ప్రాణాంతకంగా పెద్ద గండమై కూర్చుంది. చెప్పాలంటే హైడ్రా ఏర్పాటు సదుద్దేశమైనప్పటికీ హైదరాబాదులో 100కి 80% అనుమతులు, డాక్యుమెంట్లు ఏవి సక్రమంగా ఉండవు, రేవంత్ రెడ్డి కంటే ముందు వచ్చిన ప్రభుత్వాలు హైదరాబాద్ స్వభావాన్ని ఎరిగి భూముల, రియల్ ఎస్టేట్ విషయంలో చూసి చూడనట్టు ఉండేవారు. కేసీఆర్ లాంటి గట్టి ప్రభుత్వం ఏర్పడటం, వైఎస్ఆర్ తర్వాత అంతటి అజమాయిషి ఉన్న కేసీఆర్‌ను చూసుకొని రియల్ ఎస్టేట్ ఊపు అందుకుంది, ఆ ఊపు 10 సంలు అలాగే కొనసాగింది. కెసిఆర్ ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ హైదరాబాదుతోపాటు మిగతా తెలంగాణ జిల్లాల్లో విలసిల్లింది. కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతోనే రియల్ ఎస్టేట్ డీలాపడిపోయింది,దీనికి కారణాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ సిటీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు లేకపోవడం, రేవంత్ రెడ్డి తెచ్చిన హైడ్రా, దానీ మీద వ్యతిరేకత, హైడ్రా పిడుగుతోపాటు, పులి మీద పుట్ర లాగా మూసి పక్షాళన అంటూ 50 సంల నుంచి ఉన్న బీదా సాదల్ని ఎటువంటి నోటీసు లేకుండా బుల్డోజర్లు పంపి ఖాళీ చేయించడం, అన్ని రకాల అనుమతులు ఉన్నప్పటికీ చెరువు శిఖంలో ఉందంటూ అప్పుడే కట్టిన అపార్ట్ మెంట్లను, బిల్డింగులను, గృహప్రవేశం రోజే కొత్త ఇండ్లను బుల్లోజర్లతో కూల్చివేయడం, అన్నిరకాల అనుమతులు ఉన్నాయన్నా కూడా లెక్కచేయకుండా బుల్డోజర్లతో కూల్చి వేయటం జరిగింది. దాంతో రియల్ ఎస్టేట్ అంటే సాధారణ ప్రజలకు భయం ఎక్కువైపోయింది. హైదరాబాదులో ఎక్కడ స్థలం కొంటే ఏ చెరువు కింద, ఏ నాలాలో ఉంటుందో అనే భయం సామాన్యుడినే కాదు, కోటీశ్వరుని కూడా పట్టిపీడిస్తోంది, దాంతో రియల్ ఎస్టేట్ రంగం మొత్తం కుదేలు అయిపోయింది. రియల్ ఎస్టేట్ కు ఊరట కలిగించే మాటలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పకపోవడం కూడా ఒక కారణమే.
ఇంకా అన్నిటికంటే పెద్ద కారణం సిటీలో ఐటీ పరిశ్రమ తర్వాత అంతటి అభివృద్ధితో ముడిపడి ఉన్న ఫార్మాసిటీ. కెసిఆర్ ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పినప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఉవ్వెత్తున ఎగిసింది. అటువంటిది ఫార్మసిటీ లేదు ఉండదు అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పత్రిక ముఖంగా చెప్పడంతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది. ఎక్కడ స్థలం కొంటే అది చెరువు కింద గాని నాలా కింద గాని ఉంటుందోనని జనం భయం. నాలా, చెరువు, మూసీ అని చెప్పి హైడ్రాతో కూల్చివేస్తారని భయం. కాంగ్రెస్ ప్రభుత్వం మారినతరువాత కొనవచ్చులేనని అనుకోవడం. కేసీఆర్ లాంటి నాయకుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో లేకపోవడం, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ని ప్రమోట్ చేసే వాళ్ళు ఎవరు లేకపోవడం, తెలంగాణ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి ఉండడం, రియల్ ఎస్టేట్ పుంజుకోవడానికి ఏం చేయాలో కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియకపోవడం, మొదటి నుంచి రియల్టర్లు అనుమాన పడ్డట్టుగానే జరగడం ఇవన్నీ కారణాలే. హైడ్రా, మూసీ పక్షాళన వలన, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోలుకోవడం లేదు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పోయి బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ అధికారంలోకి వచ్చేదాకా రియల్ ఎస్టేట్ పుంజుకోదు అని రియల్టర్లు చెప్పడం, ఎంతో కొంత నిజం కావచ్చు. KCR వచ్చేవరకు వేచి చూద్దాం అని జనం కూడా అనుకుంటున్నారు కాబోలు.