తేనె శరీరానికి ఆరోగ్యకరమైన ఆహారం. చర్మ సహజ సౌందర్యం కొరకు దీనిని సౌందర్య సాధనంగా కూడా వాడతారు. శరీరంలోని కొవ్వును కరిగించేస్తుంది కనుక బరువు తగ్గటానికి కూడా దీనిని ఉపయోగిస్తారు. తేనెను ఏ రకంగా తీసుకుంటే తేలికగా బరువు తగ్గుతారనేది పరిశీలిద్దాం. డైటింగ్ చేసేవారు తగినంత పోషక విలువలు కలిగి వుండటానికి తేనె తాగుతారు. శరీరంలోని కొవ్వును కరిగించి సన్నపడేలా చేస్తుంది.
తేనెను సాధారణంగా నీటితో తీసుకుంటారు. వేడి నీటితో తీసుకుంటే సత్వర ఫలితాలనిస్తుంది. తేనెను నిమ్మరసం, నీటితో కలిపి మిశ్రమంగా చేసి తాగితే చురుకుగా వుండటమే కాక బరువు తగ్గిస్తుంది. తేనె ఆకలిని నియంత్రిస్తుంది కనుక ఒక గ్లాసెడు పాలలో ఒక చెంచా తేనె వేసుకుని తాగి శక్తి పొందవచ్చు. మీ ఆహారంలో తేనె చేర్చాలంటే షుగర్ కు బదులుగా వాడుకోవచ్చు.
కొవ్వు తక్కువగా వున్న పెరుగులో తేనె కలిపి తింటే చాలా రుచిగా వుండి మంచి శక్తినిస్తుంది. డైటింగ్ చేసేవారు చాలామంది పండ్ల ముక్కలపైనా, లేదా ఇతర ఆహారాలలోను ఒకటి లేదా రెండు చెంచాలు వేసుకొని తిని ఆనందిస్తారు. ప్రతి భోజనం తర్వాత వేడినీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగితే, తిన్న ఆహారం తేలికగా జీర్ణం అయిపోతుంది. తేనెను ఆహారంగా ఎక్కువ శ్రమ లేకుండా ఉపయోగించవచ్చు. తేనెతో పాటు నూనె పదార్ధాలు తీసుకోకుండా, తగినంత నీరు తీసుకుంటే మంచి ఫలితాలనిస్తుంది.