జీవన విధానాలు సరిగా ఆచరించకపోతే వచ్చే వ్యాధులలో షుగర్ వ్యాధి ఒకటి. ఈ వ్యాధి కారణంగా అనేక ఇతర వ్యాధులు కూడా వస్తూంటాయి. ఇంటివద్ద లభించే సహజ ఆహారాల ద్వారా షుగర్ వ్యాధిని తగ్గించుకోవాలంటే కొన్ని చిట్కాలు పరిశీలించండి. మెంతులు – షుగర్ వ్యాధి నివారణలో మెంతులు బాగా పని చేస్తాయి. మెంతులను ఒక రాత్రంతా నీటిలో నానబెట్టి ఆ మెంతి రసాన్ని ఉదయమే పరగడుపున తాగితే మంచి ఫలితాలనిస్తుంది.
కాకర కాయ – రక్తంలోని అధిక స్ధాయి గ్లూకోజ్ నిల్వలను తగ్గించాలంటే కాకరకాయ లేదా కరేలా రసం బాగా పని చేస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా వుంటాయి. చేదుగా వుండే కాకర రసం షుగర్ వ్యాధి రోగులకు ప్రాచీన కాలంనుండి ఒక ఔషధంగా సూచిస్తూనే వున్నారు. ద్రాక్షరసం – పుల్లటి నల్లద్రాక్ష రసం కూడా షుగర్ వ్యాధి రోగులకు మేలు చేస్తుంది.
గోధుమ చపాతి – షుగర్ వ్యాధి రోగులు తమ ఆహారంలో సహజ అధిక పీచు పదార్ధం వుండేలా చూడాలి. అందుకుగాను సాధారణంగా గోధుమ గింజలతో తయారైన పిండితో చపాతీలు ఆహారంగా తీసుకుంటారు. కార్బోహైడ్రేట్లు అధికంగా వుండే వరి లేదా బియ్యం కంటే కూడా గోధుమ, దానితో పాటు ఇతర వివిధ ధాన్యాలను కూడా కలిపి తయారు చేసిన పిండితోగల చపాతీలు అధికంగా తింటే, డయాబెటీస్ వ్యాధి నియంత్రణలో వుంటుంది.