Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home చిట్కాలు

Ginger For Cough : ద‌గ్గుని వెంట‌నే త‌గ్గించుకోవాలా.. అయితే అల్లంతో ఇలా చేయండి..!

D by D
November 20, 2022
in చిట్కాలు, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Ginger For Cough : వాతావ‌ర‌ణం మారిన‌ప్పుడ‌ల్లా మ‌న‌లో చాలా మంది ద‌గ్గుతో ఇబ్బంది ప‌డుతుంటారు. వైర‌స్, బ్యాక్టీరియాల వ‌ల్ల క‌లిగే ఇన్ఫెక్ష‌న్ ల వ‌ల్ల ఈ ద‌గ్గు వ‌స్తుంది. ద‌గ్గు శ‌రీరంలో ఉండే అల‌ర్జీల‌ను సూచిస్తుంది. ముక్కు, నోటి ద్వారా ఊపిరితిత్తుల‌కు ఈ ఇన్ఫెక్ష‌న్ సోకుతుంది. ద‌గ్గు అంటు వ్యాధి కూడా. ద‌గ్గు కార‌ణంగా ఎన్నో ఇబ్బందుల‌కు గురి అవుతూ ఉంటాం. మ‌న‌తో పాటు ఇత‌రుల‌కు కూడా ఈ ద‌గ్గు ఇబ్బందిని క‌లిగిస్తుంది. ఈ ద‌గ్గు నుండి ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌డానికి చాలా మంది ద‌గ్గు సిర‌ప్ ల‌ను తాగుతూ ఉంటారు. వీటి వ‌ల్ల లాభం కంటే దుష్ప్ర‌భావాలు ఎక్కువ‌గా ఉంటాయి. ఎందుకంటే ప్ర‌స్తుత కాలంలో మ‌న‌కు వివిధ ర‌కాల ద‌గ్గు మందులు మార్కెట్ లో ల‌భిస్తున్నాయి.

వీటిలో ఏది న‌కిలిదో, ఏది అస‌లైందో గుర్తించ‌డం క‌ష్టంగా మారింది. మ‌న‌ల్ని ఎంతో వేధించే ఈ దగ్గును ఇంటి చిట్కా ద్వారా మ‌నం త‌గ్గించుకోవ‌చ్చు. ఈ చిట్కా త‌యారీలో మ‌నం ఉప‌యోగించే ప‌దార్థాల‌న్నీ స‌హ‌జ సిద్ద‌మైన‌వే. క‌నుక ఎటువంటి దుష్ప్ర‌భావాలు ఉండ‌వు. అలాగే ద‌గ్గు నుండి ఉప‌శ‌మనాన్ని కూడా పొంద‌వ‌చ్చు. ద‌గ్గును త‌గ్గించే ఇంటి చిట్కా గురించి అలాగే దీనిలో వాడే ప‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను త‌యారు చేయ‌డానికి మ‌నం అల్లం, తేనె, నిమ్మ‌ర‌సాన్ని ఉప‌యోగించాల్సి ఉంటుంది. అల్లంలో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. జీర్ణ‌క్రియ‌ను మెరుగుప‌రిచే ఎన్నో ఔష‌ధాల్లో అల్లాన్ని విరివిర‌గా ఉప‌యోగిస్తారు.

Ginger For Cough use in this way to reduce the problem
Ginger For Cough

అల్లాన్ని వాడ‌డం వల్ల ద‌గ్గు, జులుబు, విరోచ‌నాలు, వాంతులు, అజీర్తి వంటి అనేక స‌మ‌స్య‌ల నుండి ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌వ‌చ్చు. ద‌గ్గును తగ్గించ‌డంలో నిమ్మ‌కాయ మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. దీనిలో శ‌రీరాన్ని, చ‌ర్మాన్ని ఉత్తేజ‌ప‌రిచే గుణాలు చాలానే ఉన్నాయి. అలాగే స్వ‌చ్ఛ‌మైన తేనెలో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. తేనెను ఉప‌యోగించ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరిగి ఇన్ఫెక్ష‌న్ ల బారిన ప‌డ‌కుండా ఉంటాం. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి ముందుగా అల్లాన్ని తీసుకుని శుభ్ర‌ప‌ర‌చాలి. త‌రువాత వాటిని ముక్క‌లుగా చేసి ప‌క్క‌కు పెట్టుకోవాలి. త‌రువాత ఒక నిమ్మ‌కాయ‌ను తీసుకుని శుభ్రంగా క‌డిగి నిమ్మకాయను పొట్టుతో స‌హా తుర‌మాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నీటిని తీసుకుని వేడి చేయాలి. నీళ్లు వేడ‌య్యాక అల్లం ముక్క‌ల‌ను, నిమ్మ‌కాయ తురుమును వేసి మ‌రిగించాలి.

త‌రువాత ఈ నీటిని వ‌డ‌క‌ట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇందులో తేనెను వేసి క‌ల‌పాలి. మ‌ర‌లా దీనిలో కొద్దిగా నిమ్మ‌రసాన్ని వేసి బాగా క‌లపాలి. ఇలా త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని ప్ర‌తిరోజూ రెండు గంట‌లకొక‌సారి ఈ మిశ్ర‌మాన్ని ఒక‌ టీ స్పూన్ మోతాదులో 5 సంవ‌త్స‌రాల లోపు పిల్ల‌ల‌కు తాగించాలి. అలాగే ఒక‌టిన్న‌ర టీ స్పూన్ మోతాదులో 12 సంవ‌త్స‌రాల లోపు పిల్ల‌ల‌కు తాగించాలి. అదేవిధంగా 12 సంవ‌త్స‌రాల పై బ‌డిన వారు రెండు టీ స్పూన్ల మోతాదులో రెండు గంట‌ల‌కొక‌సారి తాగుతూ ఉండాలి. ఈ విధంగా ఈ చిట్కాను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల మనం ద‌గ్గు నుండి స‌త్వ‌ర ఉప‌శ‌మ‌నాన్ని పొందవ‌చ్చు.

Tags: coughGinger For Cough
Previous Post

Doodh Peda Recipe : నోట్లో వేసుకోగానే క‌రిగిపోయే.. దూద్ పేడా.. ఇలా సుల‌భంగా చేయ‌వ‌చ్చు..

Next Post

Pala Purilu : సంప్ర‌దాయ వంట‌కం.. పాల పూరీలు.. రుచి చూస్తే అస‌లు విడిచిపెట్ట‌రు..

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025

POPULAR POSTS

food

Paneer Mushroom Dum Biryani : ప‌నీర్‌, మ‌ష్రూమ్ ద‌మ్ బిర్యానీ.. ఇలా చేసి చూడండి.. ఎంతో బాగుంటుంది..!

by D
March 12, 2023

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
September 26, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Shiva Darshan : నందికొమ్ముల నుంచి శివ‌లింగాన్ని ద‌ర్శిస్తారు.. ఎందుకంటే..?

by Admin
November 26, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

by Admin
September 23, 2025

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.