కొన్ని ఫోటోలను కళ్ళతో కాదు, మనస్సుతో చూడాలి. అలాంటి ఫోటోలలో ఇదొకటి…చూడగానే కాస్త జుగుప్సగా, అశ్లీలంగా కనిపించే ఈ ఫోటో వెనుక కళ్ళను చెమర్చే వాస్తవ కథ ఉంది. ఆ కథ గురించి వింటుంటే …గుండె ద్రవిస్తుంది. ఓ కూతురు తన తండ్రి పట్ల ఇంత ప్రేమను చూపిందా..? అనే ఆశ్చర్యానికి లోనవుతాం.! చివరకు కథ సుఖాంతమవడంతో….గుండె మీద నుండి ఏదో భారం దిగినంత ఆనందానికి లోనవుతాం….రియల్లీ హ్యాట్సాఫ్ టు దట్ డాటర్.!!
ఆ వాస్తవ కథేంటో చదవండి.
ఓక వ్యక్తికి యూరప్ లో తిండి లేకుండా మరణించే శిక్ష విధించారు …ఆ వ్యక్తిని కలిసేందుకు ఎవ్వరికీ అనుమతి లేదు..కానీ ఆ వ్యక్తి కూతురు మాత్రం కోర్టు నుండి ప్రత్యేక అనుమతి తీసుకొని ఆ వ్యక్తి ( తన తండ్రి)ని రోజూ కలిసేది. ప్రతి రోజూ అతన్ని చూడడానికి వచ్చే ముందు సెక్యురిటీ గార్డ్స్ ఆమెను పూర్తిగా చెక్ చేసి ఖాళీ చేతులతోనే వెళ్ళనిచ్చేవారు.! కోర్టు తీర్పు మేరకు అతనికి ఎవ్వరూ ఎటువంటి ఆహార పదార్థాలు ఇవ్వకూడదు.! ఇలా ప్రతి రోజూ వస్తూ, మరణానికి దగ్గరవుతున్న తండ్రిని ఆ స్థితిలో చూడలేక తల్లడిల్లిపోయేది ఆ కూతురు…
ఇక ఒక రోజు తన స్తన్యాన్ని నాన్న నోటికి అందించింది…ఆకలితో ఉన్న ఆ తండ్రి కూతురిలో కన్నతల్లిని చూసుకొని ఆ పాలు తాగేవాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి…రెండు రోజుల్లో చచ్చిపోతాడనుకున్న ఆ వ్యక్తి ఇంకా బతికే ఉండడం ఆ జైలు అధికారులకు ఆశ్యర్యాన్ని కల్గించింది..దీంతో అసలేం జరుగుతుందని…రహస్యంగా గమనించి దీనికి గల కారణాన్ని కనిపెట్టారు. ఇద్దర్నీ కోర్టులో అప్పగించారు…ఆ పోలీస్ అధికారులు.! కోర్ట్ దాన్ని నేరంతో చూడకుండా మనసుతో తీర్పు చెప్పింది ….ఆ ఇద్దరినీ విడుదల చేయాలని తీర్పిచ్చింది.! ( ఈ చిత్రాన్ని గీసింది..ఓ యూరప్ పెయింటర్.)