Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home mythology

డార్విన్ సిద్ధాంతం దశావతారాల గురించే చెబుతుందా ?? ఈ రెండిటికి ఉన్న పోలికలు ఏంటి..?

Admin by Admin
June 2, 2025
in mythology, వార్త‌లు
Share on FacebookShare on Twitter

భారతీయ ఇతిహాసాలు కేవలం కల్పితం కాదు, వీటి మూలాలు తార్కికవాదం, సైన్స్‌పై ఆధారపడి ఉన్నాయి. డార్విన్ జీవపరిణామ‌ సిద్ధాంతం కూడా ఇదే అంశాన్ని వెల్లడిస్తుంది. చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు ఇలా జీవుల పరిణామ క్రమం మొదలైనట్లు డార్విన్ సిద్ధాంతం తెలుపుతుంది. జన్యుకోడ్ లోపల యాదృచ్ఛికంగా సంభవించే జన్యు ఉత్పరివర్తనాలు జీవుల మనుగడకు సహాయపడతాయి. దీన్నే సహజ ఎంపిక అంటారు. అయితే ఈ సిద్ధాంతం విష్ణుమూర్తి దశావతారాలను పోలి ఉండటం విశేషం. మానవ జీవితం తొలిసారి నీటి నుంచి ఉద్భవించిందని డార్విన్ సిద్ధాంతం పేర్కొంటోంది. తర్వాత ఉభయచరాలు భూమి, నీటిలో మనుగడ సాగించాయి. ఆ తర్వాత ఇవి సరీసృపాలుగా రూపాంతరం చెందాయి.

మెల్లగా కోతులు రెండు అడుగులు పైకిలేచి నాలుగు కాళ్లతో నడిచేవి. ఇలా క్రమంగా మానజాతి అభివృద్ధి చెందింది. మానవ పరిణామ క్రమంలో ముందు పొట్టిగా ఉండేవారు, క్రమంగా పొడుగ్గా మారారు. వీటిని శ్రీమహావిష్ణువు దశావతారాలతో పోల్చి చూస్తే అవగతమవుతుంది. దశావతారాల్లో మొదటి మత్స్యావతారం. సత్య యుగంలో శ్రీహరి చేపగా అవతరించి వేదాలను రక్షించాడు. అలాగే డార్విన్ ప్రకారం మానవ జీవితం కూడా మొదటి నీటిలో ప్రారంభమై తర్వాత భూమిపైకి వచ్చింది. రెండోదైన కూర్మావతారం కూడా సత్య యుగంలోదే. ఈ యుగంలో శ్రీమహా విష్ణువు తాబేలు అవతారం దాల్చి పాలసముద్ర మథనంలో సాయపడ్డాడు. అంటే తాబేలు ఉభయచరం. ఇది నీటితోపాటు భూమిపై కూడా జీవించగలదు. ఇది డార్విన్ సిద్ధాంతంలోని ఉభయచరాలు.

darwin theory of evolution and 10 avatars are compatible

మూడోది వరాహ అవతారం. పంది రూపంలో నాలుగు కాళ్లతో భూమిపై సంచరించి, హిరణ్యాక్షుడనే రాక్షసుని సంహరించాడు. భూమిపై నాలుగు కాళ్ల జంతువు సంచారానికి ఇది సంకేతం. నాలుగోది నరసింహ అవతారం. ఈ అవతారంలో విష్ణుమూర్తి సగం జంతువు, సగం మనిషి. జంతువు నుంచి మనిషిగా రూపాంతరం చెందడం. అయిదోది వామనావతారం. విష్ణుమూర్తి మానవ రూపంలో అవతరించడం ఇదే తొలిసారి. త్రేతాయుగంలో వామనుడిగా అవతరించి బలి చక్రవర్తిని అంతం చేశాడు. అంటే వామనుడు కూడా రూపంలో చాలా పొట్టిగా ఉండేవాడు. మానవుడు పొట్టిగా ఉన్నట్లు డార్విన్ కూడా పేర్కొన్నాడు. ఆరో అవతారం పరశురాముడు. పూర్తిగా మానవుడే గానీ, జంతు స్వభావం, అడవిలో ఉంటూ ఒంటరి జీవితాన్ని గడిపాడు. ఇది జీవ పరిణామ సిద్ధాంతంలోని జంతువు నుంచి రూపాంతరం చెందిన మానవ దశ. డార్విన్ ప్రకారం మానవుడు కూడా ఒంటరిగానే అడవుల్లో సంచరించాడు.

ఏడోది రామావతారం. ఈ అవతారంలో రాముడికి తల్లిదండ్రులు, భార్య, పిల్లలు అంటే ఓ కుటుంబం ఉంది. ఇతరులపై దయ చూపేవాడు. ఆయోధ్యకు రాజుగా సుపరిపాలన అందించాడు. న్యాయం విషయంలో త‌న ప‌ర భేదాలను పాటించలేదు. ఎనిమిదవది బలరామ అవతారం. బలరాముడు నాగలి పట్టుకొని ఉంటాడు. అంటే వ్యవసాయం అప్పటినుండి మొదలయిందండి దాని అర్ధం. తొమ్మిదవి కృష్ణావతారం. ద్వాపర యుగంలో కృష్ణుడు తెలివిగా వ్యవహరించాడు. యుద్ధ వ్యూహాల అమలు చేసేటప్పుడు ఎలాంటి సంకోచం లేకుండా ఆచరించాడు. దౌత్యవేత్తగానూ అదర్శంగా నిలిచాడు. అంటే ఇది మానవుల మానసిక పరిణామానికి నిదర్శనం. కలియుగంలో భగవానుడు కల్కిరూపం ధరిస్తాడని గీతలో పేర్కొన్నారు. ప్రపంచంలో ధర్మం నశించినప్పుడు కల్కి రూపంలో అవతరిస్తాడు. ఇది బిగ్ బ్యాంగ్ సిద్ధాంతానికి చాలా దగ్గరగా ఉంది.

Tags: darwin theory of evolution
Previous Post

కొత్త‌గా పెళ్ల‌యిన యువ‌తి బామ్మ‌ని అడిగిన ప్ర‌శ్న‌.. త‌ప్పుడ‌ర్థం లేదు.. నీతి ఉంది..

Next Post

ఫోటో చూసి త‌ప్పుగా అనుకోకండి…క‌ళ్ళు చెమ‌ర్చే వాస్త‌వ క‌థ ఉంది దీని వెనుక‌.!

Related Posts

వినోదం

సీనియర్ ఎన్టీఆర్ నుండి పవన్ కళ్యాణ్ వరకు రెండు పెళ్లిళ్లు చేసుకున్న నటులు ..!!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోడ్లపై పునుగులు, బోండాలు, మంచూరియా, తింటున్నారా..అయితే నష్టాలు తప్పవు..!

July 22, 2025
ఆధ్యాత్మికం

స్త్రీలు సాష్టాంగ న‌మ‌స్కారం ఎందుకు చేయ‌కూడ‌దు..? దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

July 22, 2025
హెల్త్ టిప్స్

పాప్‌కార్న్‌ను అధికంగా తింటున్నారా..? అయితే ముందు ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

July 22, 2025
inspiration

మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ వాడే ఫోన్ ఏంటో తెలుసా..? ఆపిల్ iPhone వాడకపోవటానికి కారణం ఇదే..!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోజూ భోజ‌నంలో పెరుగును త‌ప్ప‌నిస‌రిగా తినాల్సిందే.. ఎందుకంటే..?

July 22, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.