గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగా వుండే ఆహారాలు తింటే కంటి చూపు మెరుగుగా వుండటానికి సహకరిస్తాయి. చాలామంది తమ బ్లడ్ షుగర్ నియంత్రించుకోవాలంటే, గ్లైసీమిక్ ఇండెక్స్ ఆహారాలనే తింటారు. కొత్తగా చేసిన ఒక పరిశోధన మేరకు ఈ ఆహారాలు వయసుపైబడితే వచ్చే చూపు సమస్యలకు పరిష్కారంగా కూడా వుంటాయని తేలింది.
గ్లైసీమిక్ ఇండెక్స్ లేదా జిఐ అనేది తిన్న ఆహారం ఎంత త్వరగా జీర్ణం అయి గ్లూకోజుగా మారి శరీరానికి అందించబడుతుందనేది చూపుతుంది. జిఐ తక్కువగా వుంటే శరీరానికి శక్తి పొందటం తేలిక. గ్లూకోజ్ మెల్లగా రక్తంలోకి కలుస్తుంది. జిఐ అధికంగా వుండే వైట్ బ్రెడ్, బంగాళ దుంప కాగా, తృణ ధాన్యాలు, పండ్లు, కూరగాయలు వంటివి తక్కువ జిఐ కలిగి వుంటాయి.
ఈ రకమైన ఆహారాలు తింటే, తిన్న ఆహారం ఎనర్జీగా మారేటపుడు వచ్చే గ్లూకోజ్ రక్తంలో అతి మెల్లగా కలిసిపోయి డయాబెటీస్ రోగులకు హాని కలిగించదు. ఈ రకమైన ఆహారం, డయాబెటీస్ ను నియంత్రించటమే కాక, వయసు మీరిన వారి కంటి చూపు కూడా మెరుగుపడే అవకాశాలనిస్తుందని తాజాగా పరిశోధనలు తెలిపాయి.