గుండె ఆరోగ్యం మెరుగవ్వాలంటే రక్తంలోని ట్రిగ్లీసెరైడ్ స్ధాయి తగ్గించాలి. శరీరంలో కొవ్వు పెరిగితే గుండెకు హాని కలుగుతుంది. వైద్య నిపుణులు ట్రిగ్లీసెరైడ్ స్ధాయి మందులపై కాకుండా సహజంగా పెరిగితే అది ప్రయోజనకారి అంటున్నారు. రక్తంలో ట్రిగ్లిసెరైడ్స్ స్ధాయి 150 ఎంజి పర్ డిఎల్ గా వుండాలని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెపుతోంది.
అయితే పెన్ స్టేట్ యూనివర్శిటీ లోని రీసెర్చర్లు సామాన్య మానవులకు 100 ఎంజి పర్ డిఎల్ స్ధాయి చాలంటున్నారు. కొత్తగా సిఫార్సు చేసిన ఈ స్ధాయి సహజంగా చేరాలంటే రీసెర్చర్లు కొద్దిపాటి కార్బోహైడ్రేట్లు, ఫ్రక్టోస్, అధిక పీచు వుండాలంటున్నారు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు కనుక అధికం చేస్తే కూడా ప్రయోజనం వుంటుంది.
ఈ ఫ్యాటీ యాసిడ్లు కొన్ని రకాల చేపలలోను, వెజిటబుల్ ఆయిల్స్ లోను దొరుకుతాయి. రీసెర్చర్లు బరువు తగ్గినాగానీ రక్తంలోని ట్రిగ్లీసెరైడ్స్ స్ధాయి 1.5 ఎంజి పర్ డిఎల్ కు తగ్గవచ్చని చెపుతున్నారు. ట్రిగ్లీసెరైడ్స్ స్ధాయి తగ్గడం అంటే కొలెస్టరాల్ తగ్గడమే, ఇది గుండె ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుస్తుంది అంటున్నారు రీసెర్చర్లు.