Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home food

Aloo Kurma Recipe : చ‌పాతీలు తింటున్నారా.. అయితే ఆలు కుర్మాను ఇలా చేసి తినండి.. రుచి అదిరిపోతుంది..

D by D
November 22, 2022
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Aloo Kurma Recipe : మ‌నం చ‌పాతీ, రోటి వంటి వాటిని కూడా విరివిరిగా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. కొంద‌రూ ప్ర‌తిరోజూ వీటిని తింటుంటారు. వీటిని తిన‌డానికి మ‌నం ఎక్కువ‌గా బంగాళాదుంప కూర‌ను త‌యారు చేస్తూ ఉంటాం. మ‌నం చేసే బంగాళాదుంప కూర రుచిగా ఉంటేనే చ‌పాతీల‌ను మ‌నం ఎక్కువ‌గా తిన‌గలం. ఈ చ‌పాతీల్లోకి రుచిగా అలాగే చాలా సుల‌భంగా అయ్యేలా బంగాళాదుంప కుర్మాను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలూ కుర్మా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఉడికించిన బంగాళాదుంప‌లు – పావు కిలో, నూనె – 2 టేబుల్ స్పూన్స్, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1 ( పెద్ద‌ది), త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – పావు టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ధ‌నియాల పొడి – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్ లేదా త‌గినంత‌, పెరుగు – అర క‌ప్పు, నీళ్లు – ఒక గ్లాస్, క‌సూరి మెంతి – ఒక టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్.

Aloo Kurma Recipe in telugu best for chapati
Aloo Kurma Recipe

ఆలూ కుర్మా త‌యారీ విధానం..

ముందుగా బంగాళాదుంప‌లపై ఉండే పొట్టును తీసి ముక్క‌లుగా చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. దీనిలోనే ఉప్పు, ప‌సుపు వేసి క‌ల‌పాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత అల్లం పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత కారం, ధ‌నియాల పొడి, జీల‌క‌ర్ర పొడి వేసి కలుపుతూ ఒక నిమిషం పాటు వేయించాలి. త‌రువాత పెరుగు వేసి క‌ల‌పాలి. దీనిని ఒక నిమిషం పాటు వేయించిన త‌రువాత బంగాళాదుంప ముక్క‌ల‌ను వేసి క‌లపాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు వేయించాలి.

త‌రువాత నీళ్లు పోసి క‌లిపి మూత పెట్టి ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత క‌సూరి మెంతి, కొత్తిమీర వేసి ఒక నిమిషం పాటు ఉడికించాలి. చివ‌ర‌గా గ‌రం మ‌సాలా వేసి మ‌రో నిమిషం పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ కుర్మా త‌యార‌వుతుంది. దీనిని చ‌పాతీ, పుల్కా, రోటి వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. త‌ర‌చూ చేసే బంగాళాదుంప కూర కంటే ఇలా చేసిన ఆలూ కుర్మా మ‌రింత రుచిగా ఉంటుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Aloo Kurma Recipecurriesvegetarian foods
Previous Post

Bathroom Vastu : మీ బాత్‌రూమ్ వాస్తు ఎలా ఉంది.. ఇలా గ‌న‌క ఉంటే అన్నీ స‌మ‌స్య‌లే వ‌స్తాయి..

Next Post

Fenugreek Seeds : షుగర్ ఉన్న ప్ర‌తి ఒక్క‌రు మెంతుల‌ను తీసుకోకూడ‌దు.. అస‌లు వీటిని ఎవ‌రు తీసుకోవాలి.. ఎవ‌రు తిన‌కూడ‌దు..?

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.