Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home food

Arikela Kichdi : ఎంతో ఆరోగ్య‌వంత‌మైన టిఫిన్ ఇది.. రోజూ ఉద‌యాన్నే 5 నిమిషాల్లో చేసి తిన‌వ‌చ్చు..!

Editor by Editor
May 17, 2024
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Arikela Kichdi : ప్ర‌స్తుతం చాలా మంది అనేక ర‌కాల వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్నారు. వాటిల్లో ఎక్కువ‌గా జీవ‌న‌శైలి సంబంధిత స‌మ‌స్య‌లే ఉంటున్నాయి. ఇవి స‌రైన ఆహారం తీసుకోక‌పోవ‌డం వ‌ల్లే వ‌స్తున్నాయి. అయితే స‌రైన పోష‌కాహారాన్ని తీసుకుంటే ఈ వ్యాధుల నుంచి బయ‌ట ప‌డ‌వ‌చ్చు. అందుకు గాను చిరు ధాన్యాలు మ‌న‌కు ఎంత‌గానో దోహ‌ద‌ప‌డ‌తాయి. వాటిల్లో అరికెలు కూడా ఒక‌టి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల అనేక లాభాలు పొంద‌వ‌చ్చు. ఇవి బ‌రువును త‌గ్గిస్తాయి. షుగ‌ర్‌, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతాయి. ఇక వీటితో ఆరోగ్య‌వంత‌మైన టిఫిన్‌ను ఎలా త‌యారు చేయాలో, అందుకు ఏమేం ప‌దార్థాలు కావాలో ఇప్పుడు తెలుసుకుందాం.

అరికెల‌తో కిచిడీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

అరికెలు – అర క‌ప్పు, పెస‌ర ప‌ప్పు – అర క‌ప్పు, ప‌చ్చి బ‌ఠానీ – అర క‌ప్పు, ఉల్లిపాయ – ఒక‌టి, ట‌మాటా – 1, అల్లం త‌రుగు – 1 టీస్పూన్‌, ప‌చ్చి మిర్చి – 2, క‌రివేపాకు రెబ్బ‌లు – 2, జీల‌క‌ర్ర – అర టీస్పూన్‌, ఇంగువ – చిటికెడు, కారం – 1 టీస్పూన్‌, ఉప్పు – త‌గినంత‌, నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు, ప‌సుపు – కొద్దిగా.

Arikela Kichdi recipe in telugu make in this method
Arikela Kichdi

అరికెల‌తో కిచిడీని త‌యారు చేసే విధానం..

అరికెలు, పెస‌ర‌ప‌ప్పును ఒక గిన్నెలో తీసుకుని గంట‌సేపు నాన‌బెట్టుకోవాలి. ఇప్పుడు స్ట‌వ్ మీద కుక్క‌ర్‌ని పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. ఇది వేడ‌య్యాక జీల‌క‌ర్ర‌, అల్లం, ప‌చ్చి మిర్చి, క‌రివేపాకు వేసి వేయించుకోవాలి. త‌రువాత ప‌సుపు, ఇంగువ‌, ఉల్లిపాయ ముక్క‌లు, ట‌మాటా త‌రుగు, ప‌చ్చి బ‌ఠానీ వేసి బాగా క‌లిపి కారం, త‌గినంత ఉప్పు, రెండు క‌ప్పుల నీళ్లు పోసి అరికెలు, పెస‌ర ప‌ప్పు వేసి మూత పెట్టి ఒక కూత వ‌చ్చాక దింపేయాలి. త‌రువాత కిచిడీని బాగా క‌లిపి వ‌డ్డించేముందు మిగిలిన నెయ్యి వేస్తే స‌రిపోతుంది.

Tags: Arikela Kichdi
Previous Post

Vitamin B12 Deficiency : విట‌మిన్ బి12 లోపం ఎవ‌రికి ఎక్కువ‌గా వ‌స్తుందంటే..?

Next Post

Mushroom Coffee : పుట్ట‌గొడుగుల కాఫీ గురించి విన్నారా..? దీంతో ఎన్నో లాభాలు.. ఎలా త‌యారు చేయాలంటే..?

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.