Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home food

Egg Bonda : రోడ్డు ప‌క్క‌న బండ్ల మీద అమ్మే ఎగ్ బొండా.. ఇలా చేస్తే రుచిగా ఉంటుంది..!

D by D
November 21, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Egg Bonda : మ‌న‌కు సాయంత్రం స‌మ‌యంలో రోడ్ల ప‌క్క‌న బండ్ల మీద‌, హోట‌ల్స్ లో ల‌భించే చిరుతిళ్ల‌ల్లో ఎగ్ బోండా కూడా ఒక‌టి. ఎగ్ బోండా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. పైన క్రిస్పీ కోటింగ్ తో లోప‌ల ఎగ్ తో ఈ బోండాలు చాలా చాలా రుచిగాఉంటాయి. స్ట్రీట్ స్టైల్ లో ఈ బోండాల‌ను మనం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. స్నాక్స్ తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా ఇంట్లోనే అప్ప‌టిక‌ప్పుడు ఎగ్ బోండాల‌ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. స్ట్రీట్ స్టైల్ ఎగ్ బోండాల‌ను ఇంట్లోనే ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఎగ్ బోండా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

రాత్రంతా నాన‌బెట్టిన బ‌ఠాణీ – అర కప్పు, త‌రిగిన పెద్ద ట‌మాట – 1, ప‌సుపు – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, కారం – ఒక టీస్పూన్, చాట్ మ‌సాలా – అర టీ స్పూన్, ప‌ల్లీలు – అర కప్పు, కార్న్ ఫ్లేక్స్ – అర క‌ప్పు, శ‌న‌గ‌పిండి – ముప్పావు క‌ప్పు, వంట‌సోడా – చిటికెడు, వాము – అర టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, క‌సూరి మెంతి – కొద్దిగా, ఉడికించిన కోడిగుడ్లు – 6.

Egg Bonda recipe in telugu make in this way
Egg Bonda

ఎగ్ బోండా త‌యారీ విధానం..

ముందుగా కుక్క‌ర్ లో బ‌ఠాణీ, నీళ్లు, ఉప్పు, కారం, ట‌మాట ముక్క‌లు, ప‌సుపు వేసి మూత పెట్టాలి. ఈ బ‌ఠాణీల‌ను పూర్తిగా మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత మూత తీసి వీటిని కొద్దిగా మెత్త‌గా చేసుకోవాలి. త‌రువాత అవ‌స‌ర‌మైతే మ‌రికొద్దిగా నీళ్లు పోసి మ‌ర‌లా స్ట‌వ్ మీద ఉంచి వేడి చేయాలి. ఇందులోనే చాట్ మ‌సాలా వేసి క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మం కొద్దిగా ద‌గ్గ‌ర ప‌డగానే స్ట‌వ్ ఆఫ్ చేసి గిన్నెలోకి తీసుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత గిన్నెలో శ‌న‌గ‌పిండిని తీసుకోవాలి. త‌రువాత ఉప్పు, ప‌సుపు, వంట‌సోడా, వాము, ధ‌నియాల పొడి, కొత్తిమీర‌, క‌సూరిమెంతి వేసి క‌ల‌పాలి. త‌రువాత నీళ్లు పోసి బ‌జ్జీ పిండిలా క‌లుపుకోవాలి. దీనిని 3 ఉండి 4 నిమిషాల పాటు బాగా క‌లుపుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి.

నూనె వేడ‌య్యాక ప‌ల్లీల‌ను వేసి ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే నూనెలో కార్న్ ఫ్లేక్స్ వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత ఉడికించిన కోడిగుడ్లు వేసి కొద్దిగా రంగు మారే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత ఈ గుడ్ల‌ను పిండిలో ముంచి నూనెలో వేసుకోవాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత ఈ బోండాలను రెండు ముక్క‌లుగా చేసుకోవాలి. త‌రువాత వీటిపై ముందుగా త‌యారు చేసుకున్న బ‌ఠానీ చాట్ ను వేసుకోవాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, కొత్తిమీర‌, ట‌మాట ముక్క‌లు, వేయించిన ప‌ల్లీలు,కార్న్ ఫ్లేక్స్ వేసుకోవాలి. త‌రువాత కొద్దిగా, ఉప్పు, కారం, చాట్ మ‌సాలా చ‌ల్లి స‌ర్వ్ చేసుకోవాలి. అవ‌స‌ర‌మైతే దీనిపై నిమ్మ‌ర‌సాన్ని కూడా వేసుకోవ‌చ్చు. ఇలా త‌యారు చేసిన ఎగ్ బోండాల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా ఇంట్లోనే చాలా సుల‌భంగా ఎగ్ బోండాల‌ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు.

Tags: Egg Bonda
Previous Post

Bendakaya Masala Gravy : బెండ‌కాయ మ‌సాలా గ్రేవీని ఇలా చేయండి.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..!

Next Post

Anti Ageing Foods : 60ల‌లోనూ 30ల‌లా క‌నిపించాలా.. అయితే రోజూ వీటిని తీసుకోండి..!

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.