Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home food

Hyderabad Stye Puri Curry : హైద‌రాబాద్ స్టైల్‌లో పూరీ క‌ర్రీని ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

D by D
March 29, 2024
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Hyderabad Stye Puri Curry : మ‌నం అల్పాహారంగా తీసుకునే వాటిలో పూరీలు కూడా ఒక‌టి. పూరీలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఈ పూరీల‌ను తిన‌డానికి చట్నీ, సాంబార్ తో పాటు మ‌నం పూరీ కర్రీని కూడా త‌యారు చేస్తూ ఉంటాము. పూరీ క‌ర్రీతో తింటే పూరీలు మ‌రింత రుచిగా ఉంటాయి. ఈ పూరీ కర్రీని ఒక్కో విధంగా త‌యారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా త‌యారు చేసే పూరీ క‌ర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. హైద‌రాబాద్ స్టైల్ లో చేసే ఈ పూరీ క‌ర్రీని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. ఎవ‌రైనా చాలా త‌క్కువ స‌మ‌యంలో చాలా సుల‌భంగా దీనిని త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే హైద‌రాబాద్ స్టైల్ పూరీ క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

పూరీ క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 2 టీ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, శ‌న‌గ‌ప‌ప్పు – ఒక టీ స్పూన్, మిన‌ప‌ప్పు – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర – ముప్పావు టీ స్పూన్, ఎండుమిర్చి – 2, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, కారం ఉన్న ప‌చ్చిమిర్చి – 2, పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ‌లు – పావుకిలో, నీళ్లు – 500 ఎమ్ ఎల్, ఉప్పు – త‌గినంత‌, శ‌న‌గ‌పిండి – 2 టీ స్పూన్స్, అల్లం త‌రుగు – ఒక టీ స్పూన్, ఉడికించిన బంగాళాదుంప – పెద్ద నిమ్మ‌కాయంత ఉన్న‌ది, నిమ్మ‌ర‌సం – ఒక టీ స్పూన్.

Hyderabad Stye Puri Curry recipe make in this way for taste
Hyderabad Stye Puri Curry

పూరీ క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఆవాలు వేసి వేయించాలి. త‌రువాత శ‌న‌గ‌ప‌ప్పు, మిన‌ప‌ప్పు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన త‌రువాత జీల‌క‌ర్ర‌, ఎండుమిర్చి, క‌రివేపాకు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత ఉల్లిపాయ‌లు వేసి 3 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత ఉప్పు, నీళ్లు పోసి క‌ల‌పాలి. వీటిపై మూత పెట్టి ఉల్లిపాయ‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత ఒక గిన్నెలో శ‌న‌గ‌పిండి తీసుకుని అందులో నీళ్లు పోసి ఉండలు లేకుండా క‌లుపుకోవాలి. ఉల్లిపాయ‌లు ఉడికిన త‌రువాత శ‌న‌గ‌పిండి మిశ్ర‌మం వేసి క‌ల‌పాలి. దీనిని 2 నిమిషాల పాటు ఉడికించిన త‌రువాత ఉడికించిన బంగాళాదుంప‌ను మెత్త‌గా చేసి వేసి అంతా క‌లిసేలా క‌లుపుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత నిమ్మ‌ర‌సం వేసి క‌లిపి స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పూరీ క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని పూరీల‌తో తింటే చాలా రుచిగా ఉంటుంది.

Tags: Hyderabad Stye Puri Curry
Previous Post

Fennel Seeds Water : సోంపు గింజ‌ల నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల క‌లిగే 8 అద్భుత‌మైన ప్ర‌యోజనాలు ఇవే..!

Next Post

Protein Deficiency Symptoms : ప్రోటీన్లను స‌రిగ్గా తీసుకోవ‌డం లేదా.. అయితే ఈ 8 ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి..!

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.