Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home food

Jeedipappu Paneer Curry : ధాబా స్టైల్‌లో జీడిప‌ప్పు ప‌నీర్ కూర‌.. చ‌పాతీల్లోకి అద్భుతంగా ఉంటుంది..

D by D
November 18, 2022
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Jeedipappu Paneer Curry : పాల‌తో చేసే ప‌దార్థాల్లో ప‌న్నీర్ ఒక‌టి. దీనిని కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ప‌న్నీర్ లో కూడా దాదాపుగా పాలలో ఉన్న పోష‌కాలన్నీ ఉంటాయి. ప‌న్నీర్ ను చాలా మంది ఇష్ట‌ప‌డ‌తారు. మ‌నం ప‌న్నీర్ తో ర‌క‌ర‌కాల వంట‌లను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. ప‌న్నీర్ తో చేసే వంట‌లు చాలా రుచిగా ఉంటాయి. అందులో భాగంగా దాబా స్టైల్ లో ఎంత‌గ రుచిగా ఉండే కాజు ప‌న్నీర్ క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి… త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి… అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

దాబా స్టైల్ కాజు ప‌న్నీర్ క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ప‌న్నీర్ – 200 గ్రా., చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, జీడిప‌ప్పు – 2 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, నూనె – 3 టేబుల్ స్పూన్స్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Jeedipappu Paneer Curry recipe in telugu tastes better with chapati
Jeedipappu Paneer Curry

మ‌సాలా పేస్ట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

జీడిప‌ప్పు – 2 టేబుల్ స్పూన్స్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, ల‌వంగాలు – 3, యాలకులు – 3, త‌రిగిన ట‌మాటాలు – 3.

దాబా స్టైల్ కాజు ప‌న్నీర్ క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక మ‌సాలా పేస్ట్ కు కావ‌ల్సిన ప‌దార్థాల‌న్నీ వేసి వేయించుకోవాలి. ట‌మాట ముక్క‌లు ఉడికిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్ల‌గా అయ్యే వ‌ర‌కు ఉంచాలి. త‌రువాత వీటిని ఒక జార్ లోకి తీసుకుని మెత్త‌గా పేస్ట్ లా చేసుకుని ప‌క్క‌కు పెట్టుకోవాలి. ఇప్పుడు మ‌రో క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక జీడిప‌ప్పు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత ప్లేట్ లోకి తీసుకుని ప‌క్క‌కు పెట్టుకోవాలి. అదే క‌ళాయిలో ప‌న్నీర్ ముక్క‌ల‌ను వేసి వేయించుకోవాలి. వీటిని 5 నిమిషాల పాటు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకుని ప‌క్క‌కు పెట్టుకోవాలి. అదే క‌ళాయిలో ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చివాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి.

త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న మ‌సాలా పేస్ట్, ప‌సుపు, ఉప్పు, కారం, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత వేయించిన ప‌న్నీర్ ముక్క‌లు, ఒక గ్లాస్ నీటిని పోసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి. ప‌ది నిమిషాల త‌రువాత త‌రిగిన కొత్తిమీర‌, క‌సూరి మెంతి, వేయించిన జీడిప‌ప్పు వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో 2 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల దాబా స్టైల్ కాజు ప‌న్నీర్ క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని రోటి, నాన్, చ‌పాతీ, పుల్కా, పులావ్ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ప‌న్నీర్ తో ఇలా క‌ర్రీని చేసుకుని తిన‌డం వ‌ల్ల రుచితో పాటు శ‌రీరానికి కావల్సిన పోష‌కాల‌ను కూడా పొంద‌వ‌చ్చు.

Tags: curriesJeedipappu Paneer Curryvegetarian foods
Previous Post

Hair Growth Foods : ఈ గింజ‌ల‌ను రోజూ తినండి.. ఊడిన జుట్టు మ‌ళ్లీ వ‌స్తుంది..

Next Post

Dushtapu Theega Mokka : దివ్య సంజీవ‌ని లాంటి మొక్క ఇది.. ఎక్క‌డ క‌నిపించినా ఇంటికి తెచ్చుకోండి..

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.