Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home food

Kadapa Style Theepi Undalu : క‌డ‌ప స్టైల్‌లో తీపి ఉండ‌ల‌ను ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటాయి..!

D by D
March 21, 2024
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Kadapa Style Theepi Undalu : తీపి ఉండలు.. గోధుమ‌పిండితో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఇవి కూడా ఒక‌టి. ఈ తీపి ఉండ‌ల‌ను ఎక్కువ‌గా రాయ‌ల‌సీమ ప్రాంతంలో త‌యారు చేస్తారు. గోధుమ‌పిండి, బెల్లంతో చేసే ఈ తీపి ఉండ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి హాని క‌ల‌గ‌కుండా ఉంటుంది. తీపి తినాలనిపించిన‌ప్పుడు లేదా పండ‌గ‌ల‌కు వీటిని అప్ప‌టిక‌ప్పుడు త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఈ ఉండ‌ల‌ను త‌యారు చేసుకోవ‌డానికి ఎక్కువ‌గా స‌మ‌యం కూడా ప‌ట్ట‌దు. చాలా త‌క్కువ స‌మ‌యంలో చాలా సుల‌భంగా వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే క‌డ‌ప స్టైల్ తీపి ఉండ‌ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

తీపి ఉండ‌ల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

గోధుమ‌పిండి – ఒక క‌ప్పు, ఎండుకొబ్బ‌రిపొడి – పావు క‌ప్పు, యాల‌కుల పొడి – ఒక టీ స్పూన్, పంచ‌దార – 2 టీ స్పూన్స్, ఉప్పు – చిటికెడు, వంట‌సోడా – పావు టీ స్పూన్, బెల్లం తురుము – అర క‌ప్పు, కాచి చ‌ల్లార్చిన పాలు – పావు క‌ప్పు, ఉప్మా ర‌వ్వ – 2 టేబుల్ స్పూన్స్, నూనె – డీప్ ప్రైకు స‌రిప‌డా.

Kadapa Style Theepi Undalu recipe in telugu make them like this
Kadapa Style Theepi Undalu

తీపి ఉండ‌ల త‌యారీ విధానం..

ముందుగా గిన్నెలో గోధుమ‌పిండిని తీసుకోవాలి. త‌రువాత ఎండుకొబ్బ‌రి పొడి, యాల‌కుల పొడి, పంచ‌దార‌, ఉప్పు, వంట‌సోడా వేసి క‌ల‌పాలి. త‌రువాత బెల్లం తురుము వేసి క‌ల‌పాలి. తరువాత పాలు పోసి క‌ల‌పాలి. త‌రువాత కొద్ది కొద్దిగా నీటిని పోసుకుంటూ బోండా పిండి లాగా క‌లుపుకోవాలి. త‌రువాత ర‌వ్వ వేసి క‌ల‌పాలి. ఈ పిండిలో బెల్లం ఉండ‌లు లేకుండా అంతా క‌లిసేలా చ‌క్క‌గా క‌లుపుకున్న త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక పిండిని తీసుకుని కావ‌ల్సిన ప‌రిమాణంలో ఉండ‌లుగా వేసుకోవాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై అటూ ఇటూ తిప్పుతూ ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే తీపి ఉండ‌లు త‌యార‌వుతాయి. వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. అలాగే ఈ ఉండ‌లు నిల్వ కూడా ఉంటాయి.

Tags: Kadapa Style Theepi Undalu
Previous Post

Kamanchi Kayalu : రోడ్డు ప‌క్క‌న మ‌న‌కు క‌నిపించే ఈ మొక్క కాయ‌ల‌ను విడిచిపెట్ట‌కుండా ఇంటికి తెచ్చుకోండి.. ఇవి బంగారంతో స‌మానం..!

Next Post

Warm Water Drinking : రోజూ గోరు వెచ్చని నీళ్ల‌ను తాగుతున్నారా.. అయితే ముందు ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.