Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home food

Perugu Dosa : ఎంతో రుచిక‌ర‌మైన పెరుగు దోశ‌ల‌ను ఎప్పుడైనా తిన్నారా.. ఇలా చేసుకోవ‌చ్చు..!

D by D
January 27, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Perugu Dosa : మ‌నం మ‌న రుచికి త‌గిన‌ట్టు ర‌క‌ర‌కాల దోశ‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. దోశ‌లు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. దోశ‌ల‌ను త‌యారు చేసుకోవ‌డానికి ప‌ప్పు నాన‌బెట్టి పిండిని త‌యారు చేసుకోవాల్సి ఉంటుంది. పిండి రుబ్బ‌కుండా అలాగే ఎక్కువ శ్ర‌మ లేకుండా అప్ప‌టిక‌ప్పుడు ఎంతో రుచిగా దోశ‌ల‌ను మ‌నం త‌యారు చేసుకోవ‌చ్చు. పెరుగు వేసి చేసే ఈ దోశ‌ల‌ను కేవ‌లం ప‌ది నిమిషాల్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ పెరుగు దోశ‌లు చాలా రుచిగా కూడా ఉంటాయి. నిమిషాల వ్య‌వ‌ధిలోనే త‌యారయ్యే ఈ పెరుగు దోశ‌ల‌ను ఎలా చేయాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

పెరుగు దోశ‌ల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బియ్యం పిండి – ఒక క‌ప్పు, పుల్ల‌టి పెరుగు – ముప్పావు క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌, నీళ్లు – త‌గిన‌న్ని.

Perugu Dosa recipe in telugu very tasty how to make them
Perugu Dosa

పెరుగు దోశ‌ల త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో బియ్యంపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో పెరుగు, ఉప్పు వేసి క‌ల‌పాలి. త‌రువాత త‌గినన్ని నీళ్లు పోసుకుంటూ దోశ‌పిండిలా క‌లుపుకోవాలి. త‌రువాత స్ట‌వ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి. పెసం వేడ‌య్యాక త‌గినంత పిండిని తీసుకుని దోశ‌లా వేసుకోవాలి. ఈ దోశ‌ను మ‌రీ ప‌లుచ‌గా కాకుండా మందంగా , ఊత‌ప్పంలా వేసుకోవాలి. త‌రువాత దీనిపై నూనె వేసుకుని మూత పెట్టిఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకోవాలి. త‌రువాత దోశ‌ను మ‌రో వైపుకు తిప్పి కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పెరుగు దోశలు త‌యార‌వుతాయి. పుల్ల‌టి పెరుగు అందుబాటులో లేని వారు పిండిని క‌లిపి ఒక గంట పాటు నాన‌బెట్టుకుని కూడా దోశ‌లు వేసుకోవ‌చ్చు. వీటిని ఏ చ‌ట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి. ఉద‌యం అల్పాహారంగా ఏం చేయాలో తోచ‌న‌ప్పుడు, అలాగే స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు ఇలా పెరుగు దోశ‌ల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Perugu Dosa
Previous Post

Gas Trouble Home Remedies : రోజూ ప‌ర‌గ‌డుపున ఒక‌టి తింటే.. గ్యాస్ ట్ర‌బుల్ మాయం..

Next Post

Flaxseeds Powder For High BP : దీన్ని తింటే హైబీపీ ఎంత ఉన్నా స‌రే.. వెంట‌నే నార్మ‌ల్ అవుతుంది..!

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.