Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home food

Pulka : గోధుమ‌పిండితో పుల్కాల‌ను ఇలా చేయండి.. ఎంతో మెత్త‌గా, మృదువుగా వ‌స్తాయి..!

D by D
March 31, 2024
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Pulka : గోధుమ‌పిండితో మ‌నం చ‌పాతీ, రోటీ వంటి వాటితో పాటు పుల్కాల‌ను కూడా తయారు చేస్తూ ఉంటాము. ఈ మ‌ధ్య కాలంలో పుల్కాలను చాలా మంది తింటున్నారు. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు, షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. అలాగే వెజ్, నాన్ వెజ్ వంట‌కాల‌తో తిన‌డానికి ఈ పుల్కాలు చాలా చ‌క్క‌గా ఉంటాయి. చాలా మంది పుల్కాల‌ను త‌యారు చేసిన‌ప్ప‌టికి ఇవి చ‌ల్లారిన త‌రువాత గట్టిగా అయిపోతూ ఉంటాయి. అలాగే కొంత‌మందికి పొంగేలా పుల్కాల‌ను త‌యారు చేసుకోవ‌డం రాదు. అలాంటి వారు కింద చెప్పిన విధంగా చేయ‌డం వ‌ల్ల చాలా సుల‌భంగా మెత్త‌టి పుల్కాల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. చ‌ల్లారిన త‌రువాత కూడా మెత్త‌గా ఉండేలా పుల్కాల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.

పుల్కా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

గోధుమ‌పిండి – ఒక క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌, వేడి నీళ్లు – త‌గిన‌న్ని.

Pulka recipe make in this method
Pulka

పుల్కా త‌యారీ విధానం..

ముందుగా గిన్నెలో గోధుమ‌పిండిని తీసుకోవాలి. త‌రువాత ఉప్పు వేసి క‌ల‌పాలి. త‌రువాత త‌గిన‌న్ని వేడి నీళ్లు పోసుకుంటూ పిండిని మెత్త‌గా క‌లుపుకోవాలి. పిండిని చ‌క్క‌గా క‌లుపుకున్న త‌రువాత చిన్న ఉండలుగా చేసుకోవాలి. త‌రువాత ఒక్కో ఉండ‌ను తీసుకుంటూ పొడి పిండి చ‌ల్లుకుంటూ వ‌త్తుకోవాలి. పుల్కా మ‌రీ మందంగా, మ‌రీ ప‌లుచ‌గా ఉండ‌కుండా చూసుకోవాలి. ఇలా పుల్కాను వ‌త్తుకున్న త‌రువాత దీనిని ముందుగా వేడి వేడి పెనం మీద వేసి కాల్చుకోవాలి. ఈ పుల్కాను ఒక వైపు పూర్తిగా అలాగే మ‌రో వైపు కొద్దిగా త‌క్కువ‌గా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న త‌రువాత ఈ పుల్కాను త‌క్కువ కాల్చుకున్న వైపు మంట మీద ఉంచి కాల్చుకోవాలి. పుల్కా చ‌క్క‌గా పొంగి కాలిన త‌రువాత ప్లేట్ లోకి తీసుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల పుల్కాలు చ‌క్క‌గా పొంగ‌డంతో పాటు చ‌ల్లారిన త‌రువాత కూడా మెత్త‌గా ఉంటాయి. ఈ విధంగా పుల్కాల‌ను త‌యారు చేసి తీసుకోవడం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

Tags: Pulka
Previous Post

4 Powders : ఈ 4 ర‌కాల పొడుల‌ను మీరు రోజూ చేసే కూర‌ల్లో వేయండి.. మీకు ఒక్క వ్యాధి కూడా రాదు..!

Next Post

Hair Fall Health Tips : కేవ‌లం ఈ 2 చాలు.. జుట్టు అస‌లు ప‌ట్టుకుని లాగినా కూడా ఊడిరాదు..!

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.