Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home food

Ragi Bobbatlu : రాగి పిండితో ఎంతో రుచిగా ఉండే బొబ్బ‌ట్ల‌ను త‌యారు చేయ‌వ‌చ్చు తెలుసా.. ఎలాగంటే..?

D by D
May 27, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Ragi Bobbatlu : బొబ్బ‌ట్లు.. ఇవి తెలియ‌ని వారు, వీటిని రుచి చూడ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. పండుగ‌ల‌కు వీటిని మ‌నం ఎక్కువ‌గా త‌యారు చేస్తూ ఉంటాము. బొబ్బ‌ట్లు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అయితే సాధార‌ణంగా వీటిని ఎక్కువ‌గా మ‌నం మైదాపిండితో త‌యారు చేస్తూ ఉంటాము. మైదాపిండిని ఉప‌యోగించ‌కుండా ప‌ప్పు ఉడికించే అవ‌స‌రం లేకుండా రాగి పిండితో కూడా మ‌నం ఎంతో రుచిగా ఉండే బొబ్బ‌ట్ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. రాగి పిండితో రుచిక‌ర‌మైన బొబ్బ‌ట్ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

రాగి బొబ్బ‌ట్ల త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు..

గోధుమ‌పిండి – ఒక క‌ప్పు, ఉప్పు – కొద్దిగా, ప‌సుపు – కొద్దిగా, రాగిపిండి – ఒక క‌ప్పు, ప‌చ్చి కొబ్బ‌రి తురుము – అర క‌ప్పు, నీళ్లు – రెండు క‌ప్పులు, యాల‌కుల పొడి – పావు టీ స్పూన్.

Ragi Bobbatlu recipe in telugu make in this method
Ragi Bobbatlu

రాగి బొబ్బ‌ట్ల త‌యారీ విధానం..

ముందుగా గోధుమ‌పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని చ‌పాతీ పిండి కంటే మెత్త‌గా క‌లుపుకోవాలి. త‌రువాత త‌రువాత నూనె వేసి పిండి చేతుల‌కు అంటుకోకుండా జారుడుగా క‌లుపుకోవాలి. త‌రువాత దీనిపైమూత‌ను ఉంచి ప‌క్క‌కు ఉంచాలి. ఇప్పుడు ఒక గిన్నెలో బెల్లం తురుము, నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం క‌రిగిన త‌రువాత దీనిని వ‌డ‌క‌ట్టి ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడ‌య్యాక రాగి పిండి, కొబ్బ‌రి తురుము వేసి క‌లుపుతూ వేయించాలి. పిండి చ‌క్క‌గా వేగి క‌మ్మ‌టి వాస‌న వ‌చ్చేట‌ప్పుడు యాల‌కుల పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత మంట‌ను చిన్న‌గా చేసి బెల్లం నీటిని పోసి క‌ల‌పాలి. దీనిని ఉండ‌లు ప‌ట్ట‌కుండా క‌లుపుతూ ఉడికించాలి. రాగిపిండి మిశ్ర‌మం ద‌గ్గ‌ర‌ప‌డిన త‌రువాత నెయ్యి వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రింత ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని చ‌ల్లారే వ‌ర‌కు అలాగే ఉంచాలి.

రాగి పిండి మిశ్ర‌మం చ‌ల్లారిన త‌రువాత ఉండలుగా చేసుకోవాలి. అలాగే గోధుమ‌పిండిని కూడా మ‌రోసారి క‌లుపుకుని ఉండ‌లుగా చేసుకోవాలి. ఇప్పుడు గోధ‌శుమ‌పిండిని ఉండ‌ను ప‌లుచ‌గా వ‌త్తుకుని అందులో రాగి పిండి ఉండ‌ను ఉంచి అంచుల‌ను మూసి వేయాలి. త‌రువాత దీనిని అర‌టి ఆకు లేదా ప్లాస్టిక్ క‌వ‌ర్ లేదా బ‌ట‌ర్ పేప‌ర్ మీద నూనె రాసుకుంటూ బొబ్బ‌ట్ల ఆకారంలో వ‌త్తుకోవాలి. పెనం వేడ‌య్యాక బొబ్బ‌ట్టును వేసి కాల్చుకోవాలి. దీనిని మ‌ధ్య‌స్థ మంట‌పై నూనె లేదా నెయ్యి వేసి కాల్చుకోవాలి. రెండు వైపులా చ‌క్క‌గా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే రాగి బొబ్బ‌ట్లు త‌యారవుతాయి. వీటిని తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది.

Tags: Ragi Bobbatlu
Previous Post

Bathani Curry : చపాతీ, పూరీ, పుల్కా.. లాంటి వాటిలోకి రుచిగా ఉండే బఠాణి కర్రీ.. త‌యారీ ఇలా..!

Next Post

Vitamin B12 Veg Foods : విట‌మిన్ బి12 దండిగా ల‌భిస్తుంది.. పూర్తిగా వెజిటేరియ‌న్ ఫుడ్‌.. ఇంత తీసుకుంటే చాలు..!

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.