Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home food

Spicy Gongura Paneer : గోంగూర ప‌నీర్‌ని క‌లిపి ఇలా కార‌కారంగా వండండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

D by D
January 23, 2024
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Spicy Gongura Paneer : మ‌నంగోంగూర‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. గోంగూర‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. అయితే త‌రుచూ చేసే వంట‌కాల‌తో పాటు గోంగూర‌తో మ‌నం స్పైసీ గోంగూర ప‌నీర్ క‌ర్రీని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. గోంగూర‌, ప‌నీర్ క‌లిపి చేసే ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. వెరైటీ రుచుల‌ను కోరుకునే వారు ఇలా గోంగూర‌తో ప‌నీర్ క‌లిపి త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఒక్కసారి ఈ క‌ర్రీని రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాలంటారు. ఎంతో రుచిగా, స్పైసీగా ఉండే ఈ గోంగూర ప‌నీర్ క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

స్పైసీ గోంగూర ప‌నీర్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – పావు క‌ప్పు, ఆవాలు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 2, చిన్న‌గా త‌రిగిన పెద్ద ఉల్లిపాయ‌లు – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, కారం – 2 టీ స్పూన్స్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, వేయించిన జీల‌క‌ర్ర పొడి – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, గోంగూర – పెద్ద క‌ట్ట‌, ట‌మాటాలు – పెద్ద‌వి రెండు, నీళ్లు – 150 ఎమ్ ఎల్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, ప‌నీర్ క్యూబ్స్ – 250 గ్రా.

Spicy Gongura Paneer recipe make in this way
Spicy Gongura Paneer

స్పైసీ గోంగూర ప‌నీర్ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత ఆవాలు, జీల‌క‌ర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి గోల్డెన్ బ్రౌన్ క‌ల‌ర్ వ‌చ్చే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. త‌రువాత ప‌సుపు, ఉప్పు, కారం, ధ‌నియాల పొడి, జీల‌క‌ర్ర పొడి, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. త‌రువాత గోంగూర వేసి క‌ల‌పాలి. గోంగూర మ‌గ్గిన త‌రువాత ట‌మాటాల‌ను ఫ్యూరీలాగా చేసి వేసుకోవాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు బాగా వేయించిన త‌రువాత నీళ్లు, ప‌చ్చిమిర్చి వేసి క‌ల‌పాలి. కూర ఉడుకుప‌ట్టిన త‌రువాత ప‌నీర్ క్యూబ్స్ వేసి క‌ల‌పాలి. దీనిని మ‌ధ్య‌స్థ మంట‌పై కూర ద‌గ్గర ప‌డి నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గోంగూర ప‌నీర్ త‌యార‌వుతుంది. దీనిని రోటీ, చ‌పాతీ, పూరీ, దోశ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా త‌యారు చేసిన గోంగూర ప‌నీర్ ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Spicy Gongura Paneer
Previous Post

Drinking Water and Kidneys : నీళ్ల‌ను ఎక్కువ‌గా తాగుతున్నారా.. అయితే కిడ్నీల‌పై ఎలాంటి ప్ర‌భావం చూపిస్తుందో తెలుసా..?

Next Post

Foods For Women : మ‌హిళ‌లు ఈ 10 పోష‌కాలు ఉండే ఆహారాల‌ను రోజూ తీసుకోవాలి..!

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025

POPULAR POSTS

చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
food

Paneer Mushroom Dum Biryani : ప‌నీర్‌, మ‌ష్రూమ్ ద‌మ్ బిర్యానీ.. ఇలా చేసి చూడండి.. ఎంతో బాగుంటుంది..!

by D
March 12, 2023

...

Read more
హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
September 26, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Shiva Darshan : నందికొమ్ముల నుంచి శివ‌లింగాన్ని ద‌ర్శిస్తారు.. ఎందుకంటే..?

by Admin
November 26, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

by Admin
September 23, 2025

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.