Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home food

Tomato Pappu : ట‌మాటా ప‌ప్పును త‌యారు చేసే విధానం ఇది.. అన్నం లేదా చపాతీలు.. ఏదైనా స‌రే లాగించేస్తారు..

D by D
November 28, 2022
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Tomato Pappu : మ‌నం వంటింట్లో విరివిరిగా ఉప‌యోగించే కూర‌గాయ‌ల్లో టమాటాలు కూడా ఒక‌టి. మ‌న ఆరోగ్యానికి, సౌంద‌ర్యానికి ట‌మాటలు ఎంతో మేలు చేస్తాయి. ట‌మాటాల‌తో వివిధ ర‌కాల కూర‌ల‌ను, ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ట‌మాటాల‌తో చేసుకోద‌గిన వంట‌కాల్లో ట‌మాట పప్పు ఒక‌టి. ఈ ట‌మాట ప‌ప్పు రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. చాలా మంది ట‌మాట ప‌ప్పును ఎంతో ఇష్టంగా తింటారు. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఈ ట‌మాట ప‌ప్పును ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ట‌మాట ప‌ప్పు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

త‌రిగిన ట‌మాటాలు – పావు కిలో, కందిప‌ప్పు – 150 గ్రా., నాన‌బెట్టుకున్న చింత‌పండు – 30 గ్రా., త‌రిగిన ఉల్లిపాయ – 1, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, కారం – ఒక టేబుల్ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Tomato Pappu recipe in telugu know how to make it
Tomato Pappu

తాళింపు ప‌దార్థాలు..

నూనె – రెండు టేబుల్ స్పూన్స్, తాళింపు గింజ‌లు – ఒక టేబుల్ స్పూన్, క‌చ్చాప‌చ్చ‌గా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 5, ఎండుమిర్చి – 2, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ఇంగువ – చిటికెడు.

ట‌మాట ప‌ప్పు తయారీ విధానం..

ముందుగా ఒక కుక్క‌ర్ లో కందిపప్పును వేసి శుభ్రంగా క‌డిగి త‌గినన్ని నీళ్లు పోసుకోవాలి. త‌రువాత ఇందులో త‌రిగిన ట‌మాట ముక్క‌లు, ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి వేసి మూత పెట్టి 3 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత మూత తీసి ప‌సుపు, ఉప్పు, కారం వేసి ప‌ప్పును మెత్త‌గా చేసుకోవాలి. త‌రువాత చింత‌పండు ర‌సం వేసి అంతా క‌లిసేలా క‌లపాలి. త‌రువాత రుచికి త‌గిన‌ట్టు త‌గిన‌న్ని నీటిని పోసి క‌లుపుకోవాలి. ఈ కుక్క‌ర్ ను మ‌ర‌లా స్ట‌వ్ మీద ఉంచి 5 నిమిషాల పాటు ఉడికించాలి. ప‌ప్పు ఉడుకుతుండ‌గానే మ‌రో స్ట‌వ్ మీద క‌ళాయిని ఉంచి అందులో నూనె పోసి వేడి చేయాలి.

నూనె వేడ‌య్యాక ఒక్కో తాళింపు ప‌దార్థాన్నీ వేసి తాళింపు చేసుకోవాలి. వేగిన తాళింపును ఉడుకుతున్న ప‌ప్పులో వేసి క‌ల‌పాలి. త‌రువాత కొత్తిమీర‌ను కూడా వేసి మ‌రో నిమిషం పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ట‌మాట ప‌ప్పు త‌యార‌వుతుంది. దీనిని వేడి వేడి అన్నంతో నెయ్యితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అన్న‌మే కాకుండా చ‌పాతీ, రోటి, పుల్కా వంటి వాటితో కూడా ఈ ప‌ప్పును తిన‌వ‌చ్చు. ఈ విధంగా చేసిన ట‌మాట ప‌ప్పును అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Tomato Pappu
Previous Post

Curry Leaves And Onion For Hair : ఈ రెండు క‌లిపి రాస్తే.. తెల్ల జుట్టు న‌ల్ల‌గా మార‌డ‌మే కాదు.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది కూడా..!

Next Post

Kovvu Gaddalu : శ‌రీరంలో కొవ్వు గ‌డ్డ‌లు ఎక్క‌డ ఉన్నా సరే.. ఇలా చేస్తే క‌రిగిపోతాయి..

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.