Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home food

Vegetables Curry : అన్ని కూర‌గాయ‌లు క‌లిపి ఇలా మిక్స్‌డ్ వెజిట‌బుల్ క‌ర్రీని చేయండి.. టేస్ట్ చూస్తే వ‌ద‌ల‌రు..

Editor by Editor
January 25, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Vegetables Curry : సాధార‌ణంగా మ‌నం రోజూ వివిధ ర‌కాల కూర‌గాయ‌ల‌ను, ఆకుకూర‌ల‌ను వండుకుని తింటుంటాం. అయితే కొన్ని సార్లు కూర‌కు స‌రిప‌డా కూర‌గాయ‌లు ఉండ‌వు. దీంతో ఏం కూర చేయాలో తోచ‌దు. కానీ అన్ని కూర‌గాయ‌ల‌ను క‌లిపి కూడా కూర చేసుకోవ‌చ్చు. దీన్నే మిక్స్‌డ్ వెజిట‌బుల్ క‌ర్రీ అని అంటారు. ఏం కూర‌గాయ‌లు ఉన్నా స‌రే వాటిని క‌లిపి కూర‌లా వండితే ఎంతో టేస్టీగా ఉంటుంది. దీన్ని చేయ‌డం కూడా సుల‌భ‌మే. ఈ క్ర‌మంలోనే మిక్స్‌డ్ వెజిట‌బుల్ క‌ర్రీని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మిక్స్‌డ్ వెజిట‌బుల్ క‌ర్రీ త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు..

బీన్స్‌, క్యారెట్‌, వంకాయ‌, సొర‌కాయ‌, ప‌చ్చి మిర్చి, క్యాప్సిక‌మ్‌, ట‌మాటా ముక్క‌లు – 1 క‌ప్పు చొప్పున‌, కొబ్బ‌రికాయ – 1, కొత్తిమీర తురుము – 2 టేబుల్ స్పూన్లు, నూనె – 1 టేబుల్ స్పూన్‌, ఆవాలు – అర టీస్పూన్‌, జీల‌క‌ర్ర – అర టీస్పూన్‌, ఎండు మిర్చి – 2, మెంతులు – పావు టీస్పూన్‌, ధ‌నియాల పొడి – అర టీస్పూన్‌, ఉప్పు – త‌గినంత‌, కారం – 1 టీస్పూన్‌, ప‌చ్చి మిర్చి – 4.

Vegetables Curry recipe in telugu very easy to cook
Vegetables Curry

మిక్స్‌డ్ వెజిట‌బుల్ కర్రీని త‌యారు చేసే విధానం..

కొబ్బ‌రికాయ‌ను తురిమి మెత్త‌గా రుబ్బి పాలు తీయాలి. ఇలా రెండు మూడు సార్లు తీసి పిప్పి పారేయాలి. కూర‌గాయ‌ల‌న్నీ ఇంచు సైజు చొప్పున ముక్క‌లుగా క‌ట్ చేయాలి. బాణ‌లిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీల‌క‌ర్ర‌, మెంతులు, ఎండు మిర్చి వేసి వేయించాలి. త‌రువాత ట‌మాటా త‌ప్ప మిగిలిన కూర‌గాయ ముక్క‌ల‌న్నీ వేసి 2 నిమిషాల పాటు వేయించి మూత పెట్టాలి. అవి కాస్త మ‌గ్గిన త‌రువాత టమాటా ముక్క‌లు వేసి ఒక నిమిషం వేగాక కాసిన్ని నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించాలి. ముక్క‌లు పూర్తిగా ఉడికాయ అనుకున్నాక ఉప్పు, కారం, ధ‌నియాల పొడి వేసి క‌ల‌పాలి. ఇప్పుడు కొబ్బ‌రిపాలు పోసి సిమ్‌లో ఉడికించి దించే ముందు కొత్తిమీర తురుము వేసి దించాలి. దీంతో ఎంతో రుచిక‌ర‌మైన మిక్స్‌డ్ వెజిట‌బుల్ క‌ర్రీ రెడీ అవుతుంది. దీన్ని అన్నం లేదా చ‌పాతీలు.. వేటితో తిన్నా స‌రే ఎంతో రుచిగా ఉంటుంది. అంద‌రికీ న‌చ్చుతుంది.

Tags: Vegetables Curry
Previous Post

Coriander Leaves : ఇది మ‌న‌కు తెలిసిందే.. కానీ రోజూ తీసుకుంటే ఎన్నో లాభాలు..!

Next Post

Carrot : రోజూ ఒక క్యారెట్ ను తింటే.. ఇన్ని లాభాలా.. అస‌లు న‌మ్మ‌లేరు..!

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.