Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home food

Vellulli Charu : వెల్లుల్లి చారు ఇలా చేయండి.. అన్నంలో వేడి వేడిగా తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

D by D
January 4, 2024
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Vellulli Charu : వెల్లుల్లి చారు.. వెల్లుల్లిపాయ‌ల‌తో చేసే ఈ చారు చాలా రుచిగా ఉంటుంది. ఈ చారును తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్య ప్ర‌యోజనాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వ‌రం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు ఈ చారును తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. వెల్లుల్లి చారును తీసుకోవ‌డం వ‌ల్ల వాతావ‌ర‌ణ మార్పుల కార‌ణంగా త‌లెత్తే అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. ఈ వెల్లుల్లి చారును త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం. 15 నుండి 20 నిమిషాల్లో ఈ చారును త‌యారు చేసుకోవ‌చ్చు. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే వెల్లుల్లి చారును ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

వెల్లుల్లి చారు త‌యారీకి కావ‌ల్సిన పదార్థాలు..

నాన‌బెట్టిన చింత‌పండు -నిమ్మ‌కాయంత‌, ట‌మాట – 1, మిరియాలు – అర టీ స్పూన్, ధ‌నియాలు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, కందిప‌ప్పు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, వెల్లుల్లి రెబ్బ‌లు – 5, నూనె – ఒక టేబుల్ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టీ స్పూన్, దంచిన వెల్లుల్లి రెమ్మ‌లు – 5, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, ప‌సుపు – పావు టీ స్పూన్, క‌రివేపాకు – 2 రెమ్మ‌లు, ఇంగువ – పావు టీ స్పూన్, నీళ్లు -ఒక‌టిన్న‌ర గ్లాస్, ఉప్పు – త‌గినంత‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Vellulli Charu recipe very tasty to eat with rice
Vellulli Charu

వెల్లుల్లి చారు త‌యారీ విధానం..

ముందుగా నాన‌బెట్టిన చింత‌పండులో ట‌మాట వేసి చేత్తో బాగా న‌లిపి ర‌సాన్ని తీసుకోవాలి. త‌రువాత జార్ లో మిరియాలు, ధ‌నియాలు, జీల‌క‌ర్ర‌, కందిప‌ప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత తాళింపు దినుసులు వేసి వేయించాలి. త‌రువాత వెల్లుల్లి రెమ్మ‌లు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. త‌రువాత ప‌సుపు, క‌రివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న పొడి వేసి వేయించాలి. ఇవ‌న్నీ వేగిన త‌రువాత చింత‌పండు ర‌సం, నీళ్లు, ఉప్పు వేసి క‌ల‌పాలి. దీనిని ఒక పొంగు వ‌చ్చే వ‌ర‌కు బాగా మ‌రిగించాలి. చారు మ‌రిగిన త‌రువాత కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే వెల్లుల్లి చారు త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా వెల్లుల్లి చారును త‌యారుచేసి తీసుకోవ‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

Tags: Vellulli Charu
Previous Post

Ragi Dosa Recipe : రాగి దోశ‌ల‌ను ఇన్‌స్టంట్‌గా అప్ప‌టిక‌ప్పుడు ఇలా వేసుకోండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Next Post

Ayurvedic Herbs : ఈ ఆయుర్వేద మూలిక‌ల‌ను రోజూ తీసుకుంటే చాలు.. 100 ఏళ్లు జీవిస్తారు..!

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.