Viral Video : ఈ చాయ్ చాలా స్పెష‌ల్.. పండ్ల‌తో త‌యారు చేస్తున్నాడు.. వీడియో..!

Viral Video : చాయ్‌.. అంటే స‌హజంగానే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. అందుక‌నే మ‌న‌కు బ‌య‌ట ర‌క‌ర‌కాల చాయ్ లు అందుబాటులో ఉన్నాయి. ఇక ఇంట్లోనూ చాలా మంది భిన్న ర‌కాల టీ ల‌ను తాగుతుంటారు. కానీ అక్క‌డ మాత్రం ఆ వ్య‌క్తి ఏకంగా పండ్ల‌తో టీ త‌యారు చేసి విక్ర‌యిస్తున్నాడు. అవును.. నిజ‌మే.. అత‌ని ద‌గ్గ‌రకు వెళ్తే.. సాధార‌ణ టీ ల‌భించ‌దు. కానీ వివిధ ర‌కాల పండ్ల వెరైటీల‌తో త‌యారు చేసిన టీ ల‌భిస్తుంది. అది ఎంతో రుచిగా కూడా ఉంటుంది.

Viral Video Surat tea seller is making fruit chai
Viral Video

సూర‌త్‌లో ఓ వ్య‌క్తి త‌న బండిపై ఫ్రూట్ చాయ్‌ని విక్ర‌యిస్తున్నాడు. అందులో యాపిల్‌, స‌పోటా, అర‌టి పండ్ల ముక్క‌ల‌ను వేసి ఇస్తాడు. దీంతో స‌హ‌జంగానే టీ ఎంతో రుచిగా ఉంటుంది. ఈ క్ర‌మంలోనే ఓ ఫుడ్ బ్లాగ‌ర్ ఆ ఫ్రూట్ చాయ్ అమ్ముతున్న వ్య‌క్తిని వీడియో తీసి దాన్ని సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా.. అది వైర‌ల్‌గా మారింది. ఎంతో మంది ఆ ఫ్రూట్ చాయ్ తాగాల‌ని ఆస‌క్తి చూపిస్తుండ‌డం విశేషం.

 

View this post on Instagram

 

A post shared by Amar Sirohi (@foodie_incarnate)

సాధార‌ణంగా మ‌సాలా చాయ్ లేదా లెమ‌న్ టీ ఉంటుంది. కానీ అత‌ను ఏకంగా పండ్ల‌తోనే చాయ్ త‌యారు చేసి విక్ర‌యిస్తున్నాడు. దీంతో అత‌నికి గిరాకీ కూడా బాగానే పెరిగింది. ఈ క్ర‌మంలోనే అత‌నిలా ఫ్రూట్ చాయ్ త‌యారు చేసి తాగాల‌ని చాలా మంది ఆస‌క్తి చూపిస్తున్నారు. ఏది ఏమైనా.. అత‌ని ఫ్రూట్ చాయ్ మాత్రం అంద‌రికీ నోరూరింప‌జేస్తోంది.