Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home మొక్క‌లు

Palleru : పురుషుల్లో ఆ శ‌క్తిని పెంచే ప‌ల్లేరు మొక్క‌.. త‌ప్పక వాడాల్సిందే..!

D by D
June 9, 2022
in మొక్క‌లు, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Palleru : ఎన్నో ఔష‌ధ గుణాలు క‌లిగిన మొక్క‌ల‌లో ప‌ల్లేరు మొక్క కూడా ఒక‌టి. ప‌ల్లేరు మొక్క బ‌హు వార్షిక మొక్క‌. ఈ మొక్క‌లోని ఔష‌ధ గుణాలు, ఈ మొక్క వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాలు తెలిస్తే అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోవాల్సిందేన‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్క సంవ‌త్స‌రం పొడ‌వునా నేల‌పై పాకుతూ పెరుగుతుంది. ప‌ల్లేరు మొక్క మ‌నకు విరివిరిగా క‌నిపిస్తూ ఉంటుంది. వీటి పువ్వులు ప‌సుపు రంగులో ఉంటాయి. ప‌ల్లేరు మొక్క కాయ‌లు ముళ్ల‌ను క‌లిగి ఉంటాయి. ఈ మొక్క‌ను చాలా మంది చూసే ఉంటారు. కానీ దీనిలో ఉండే ఔష‌ధ గుణాల గురించి మాత్రం చాలా మందికి తెలియ‌దు. మ‌న‌కు వ‌చ్చే అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో ఈ మొక్క ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ప‌ల్లేరు మొక్క వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మూత్ర‌పిండాల‌లో రాళ్ల స‌మ‌స్య‌ను నివారించ‌డంలో ఈ మొక్క ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. పల్లేరు కాయ‌ల‌ను దంచి ర‌సాన్ని తీసుకోవాలి. దీనిని అర క‌ప్పు మోతాదులో రోజుకు రెండు పూట‌లా తీసుకుంటూ ఉండ‌డం వ‌ల్ల మూత్రపిండాల‌లో రాళ్లు క‌రుగుతాయి. అదే విధంగా ప‌ల్లేరు కాయ‌ల‌ను లేదా ప‌ల్లేరు మొక్క మొత్తాన్ని నీటిలో వేసి మ‌రిగించి చ‌ల్లారిన త‌రువాత ఆ నీటిని తాగుతూ ఉండ‌డం వ‌ల్ల కూడా మూత్ర‌పిండాల‌లో రాళ్లు క‌రిగిపోయి మూత్రం ద్వారా బ‌య‌ట‌కు వ‌స్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు. ఒక టేబుల్ స్పూన్ ప‌ల్లేరు కాయ‌ల‌ను, ఒక టేబుల్ స్పూన్ ధనియాల‌ను నీటిలో వేసి మ‌రిగించి వ‌డక‌ట్టుకుని ఆ నీటిని తాగుతూ ఉండ‌డం వ‌ల్ల మూత్రంలో మంట త‌గ్గుతుంది. మూత్రంలో ర‌క్తం వ‌స్తున్న‌ప్పుడు ఈ మొక్క‌ మొత్తాన్ని సేక‌రించి దంచి పావు క‌ప్పు ర‌సాన్ని తీసుకుని ఒక గ్లాస్ మ‌జ్జిగ‌లో క‌లుపుకుని తాగాలి. ఇలా రోజూ చేయ‌డం వ‌ల్ల మూత్రంలో ర‌క్తం రావ‌డం త‌గ్గుతుంది.

Palleru gives us many benefits know how to use it
Palleru

ఒక గ్లాస్ పాల‌లో ప‌ల్లేరు కాయ‌ల‌ను వేసి మ‌రిగించి వ‌డ‌క‌ట్టుకుని తాగ‌డం వల్ల నిత్యం య‌వ్వ‌నంగా క‌నిపిస్తూ ఉంటార‌ని ఆయుర్వేద నిపుణులు తెలియ‌జేస్తున్నారు. 2 టీ స్పూన్ల ప‌ల్లేరు కాయ‌ల పొడిని ఒక గ్లాస్ నీళ్ల‌లో వేసి పావు కప్పు అయ్యే వ‌ర‌కు మరిగించి తాగ‌డం వ‌ల్ల ఆయాసంతోపాటు గుండె సంబంధిత స‌మ‌స్య‌లు త‌గ్గి గుండె బ‌లంగా త‌యార‌వుతుంది. కామెర్ల వ్యాధిని త‌గ్గించే గుణం కూడా ప‌ల్లేరు మొక్క‌కు ఉంటుంది. ఈ మొక్క మొత్తాన్ని తీసుకుని ఎండ‌బెట్టి పొడిగా చేసుకోవాలి. దీనికి ఒక టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని, 6 మిరియాల గింజ‌ల పొడిని, ఒక టీ స్పూన్ ప‌టిక బెల్లం పొడిని క‌లిపి నిల్వ చేసుకోవాలి. దీనిని అర టీ స్పూన్ మోతాదులో రెండు పూట‌లా తీసుకుంటూ ఉండ‌డం వ‌ల్ల కామెర్ల వ్యాధి త‌గ్గుతుంది.

ప‌ల్లేరు కాయ‌ల‌ను దంచి ర‌సాన్ని తీసి ఆ ర‌సాన్ని అరికాళ్లలోకి ఇంకేలా రాసుకోవ‌డం వ‌ల్ల అరికాళ్ల మంట‌లు త‌గ్గుతాయి. ఈ మొక్క కాయ‌ల క‌షాయాన్ని నోట్లో పోసుకుని పుక్కిలించ‌డం వ‌ల్ల నోటి దుర్వాస‌న త‌గ్గుతుంది. అంతేకాకుండా చిగుళ్ల స‌మ‌స్య‌లు, దంతాల స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. ఈ క‌షాయాన్ని తాగ‌డం వ‌ల్ల స్త్రీల‌లో వ‌చ్చే నెల‌స‌రి స‌మ‌స్య‌లు త‌గ్గి నెల‌స‌రి క్ర‌మం త‌ప్ప‌కుండా వ‌స్తుంది. ప‌ల్లేరు మొక్క ఆకులను వ‌స్త్రంలో వేసి మూట‌గా క‌ట్టి ఆ మూట‌ను క‌ళ్లు మూసుకుని క‌ళ్ల‌ పై ఉంచుకోవ‌డం వ‌ల్ల క‌ళ్ల‌ క‌ల‌క‌ స‌మ‌స్య త‌గ్గుతుంది. ఈ మొక్క బెర‌డుతో చేసిన క‌షాయాన్ని, ప‌టిక బెల్లం పొడిని క‌లిపి అర టీ స్పూన్ మోతాదులో రెండు పూట‌లా తాగుతూ ఉండ‌డం వ‌ల్ల త‌ల‌నొప్పి త‌గ్గుతుంది. ప‌ల్లేరు మొక్క పువ్వులను ఎండ‌బెట్టి పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని రోజూ 2 గ్రా. ల మోతాదులో రెండు ఎండుద్రాక్ష‌ల‌తో క‌లిపి మూడు పూట‌లా తీసుకుంటూ ఉండ‌డం వ‌ల్ల ఆయాసం, ఉబ్బ‌సం వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

5 గ్రా. ప‌ల్లేరు కాయల పొడిని, 2 గ్రా. ప‌టిక బెల్లాన్ని రెండు గ్లాసుల నీటిలో వేసి ఒక గ్లాస్ అయ్యే వ‌ర‌కు మ‌రిగించి చ‌ల్లారిన త‌రువాత తాగుతూ ఉండ‌డం వ‌ల్ల న‌డుము నొప్పి, కీళ్ల నొప్పులు, వాపులు త‌గ్గుతాయి. ఒక టీ స్పూన్ ప‌ల్లేరు కాయ‌ల పొడిని, ఒక టీ స్పూన్ అశ్వ‌గంధ‌ పొడిని ఒక క‌ప్పు పాల‌ల్లో వేసి మ‌రిగించి వ‌డ‌క‌ట్టుకుని రోజూ రాత్రి ప‌డుకునే ముందు తాగ‌డం వ‌ల్ల పురుషుల‌ల్లో శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది. ఈ విధంగా ప‌ల్లేరు మొక్క‌లో ప్ర‌తి భాగం మ‌న‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని, దీనిని ఉప‌యోగించి మ‌న‌కు వచ్చే అనేక ర‌కాల స‌మ‌స్య‌లను న‌యం చేసుకోవ‌చ్చ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Tags: Palleru
Previous Post

Cardamom : పురుషులు యాల‌కుల‌ను తీసుకోవ‌డం మ‌రిచిపోవ‌ద్దు.. రోజూ ఈ స‌మ‌యంలో తినాలి..!

Next Post

Trees : మీ ఇంట్లో ఈ మొక్క‌ల‌ను పెంచుతున్నారా ? అయితే కోరి స‌మ‌స్య‌ల‌ను తెచ్చుకోకండి..!

Related Posts

వినోదం

సీనియర్ ఎన్టీఆర్ నుండి పవన్ కళ్యాణ్ వరకు రెండు పెళ్లిళ్లు చేసుకున్న నటులు ..!!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోడ్లపై పునుగులు, బోండాలు, మంచూరియా, తింటున్నారా..అయితే నష్టాలు తప్పవు..!

July 22, 2025
ఆధ్యాత్మికం

స్త్రీలు సాష్టాంగ న‌మ‌స్కారం ఎందుకు చేయ‌కూడ‌దు..? దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

July 22, 2025
హెల్త్ టిప్స్

పాప్‌కార్న్‌ను అధికంగా తింటున్నారా..? అయితే ముందు ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

July 22, 2025
inspiration

మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ వాడే ఫోన్ ఏంటో తెలుసా..? ఆపిల్ iPhone వాడకపోవటానికి కారణం ఇదే..!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోజూ భోజ‌నంలో పెరుగును త‌ప్ప‌నిస‌రిగా తినాల్సిందే.. ఎందుకంటే..?

July 22, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.