Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home మొక్క‌లు

Joint Pain : శ్వాస స‌మ‌స్య‌లు, కీళ్ల నొప్పుల‌కు అద్భుత‌మైన ఔష‌ధం ఈ మొక్క‌.. ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కండి..

D by D
December 6, 2022
in మొక్క‌లు, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Joint Pain : బీడు భూముల్లో, రోడ్ల‌కు ఇరు వైపులా, పొలాల ద‌గ్గ‌ర విరివిరిగా పెరిగే మొక్క‌ల్లో త‌లంబ్రాల మొక్క ఒక‌టి. దీనిని అత్తా కోడ‌ళ్ల చెట్టు అని కూడా అంటారు. ఈ మొక్క మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. ఈ మొక్క ఒక పొద‌లా పెరుగుతుంది. పంట పొలాలకు పురుగు ప‌ట్ట‌కుండా ఈ చెట్టును పొలాల చుట్టూ పెంచుతూ ఉంటారు. ఈ మొక్క లాంటానా అనే జాతికి చెందిన మొక్క‌. వీటిలో 150 కు పైగా జాతులు ఉంటాయి. త‌లంబ్రాల మొక్క పూలు వివిధ రంగుల్లో చిన్న‌గా చాలా అందంగా ఉంటాయి. ఈ మొక్క‌ను ఉప‌యోగించి ఫ‌ర్నీచ‌ర్, కంచెల‌ను త‌యారు చేస్తూ ఉంటారు. అలాగే బుట్ట‌లు, గంప‌లు అల్ల‌డానికి కూడా ఈ మొక్క‌ను ఉప‌యోగిస్తూ ఉంటారు. ఈ త‌లంబ్రాల మొక్క‌ను చాలా మంది కలుపు మొక్క‌గా, పిచ్చి మొక్క‌గా భావిస్తూ ఉంటారు.

కానీ ఈ మొక్క‌లో కూడా ఔష‌ధ గుణాలు ఉంటాయ‌ని దీనిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల ప‌లు ర‌కాల నఅనారోగ్య స‌మ‌స్య‌లను దూరం చేసుకోవ‌చ్చ‌ని మ‌న‌లో చాలా మందికి తెలియ‌దు. ఈ మొక్క కాయ‌ల‌ను కొన్ని ప్రాంతాల్లో తింటూ ఉంటారు. కానీ ఈ కాయ‌ల్లో ఒక‌ర‌క‌మైన విషం ఉంటుంద‌ని అనేక ర‌కాల ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. క‌నుక ఈ కాయ‌ల‌ను తిన‌క‌పోవ‌డ‌మే మంచిది. చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌లను, ఉబ్బ‌సం, నోటి పూత, కుష్టు వ్యాధి, చికెన్ పాక్స్, క్యాన్స‌ర్ వంటి స‌మ‌స్య‌ల‌కు ఉప‌యోగించే ఔష‌ధాల త‌యారీలో ఈ మొక్క‌ను ఉప‌యోగిస్తారు. త‌లంబ్రాల మొక్క ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియ‌ల్ ల‌క్ష‌ణాలు అధికంగా ఉంటాయి. ఈ మొక్క ఆకుల‌ను ఉప‌యోగించి మ‌నం గాయాల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. త‌లంబ్రాల మొక్క ఆకుల‌ను మెత్త‌గా నూరి ఆ పేస్ట్ ను గాయాల‌పై రాయ‌డం వ‌ల్ల గాయాలు త్వ‌ర‌గా మానుతాయ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

thalambrala mokka is very much useful in Joint Pain
Joint Pain

ఆస్థ‌మాను న‌యం చేయ‌డంలో కూడా ఈ మొక్క మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. నీటిలో త‌లంబ్రాల మొక్క ఆకుల‌ను వేసి బాగా మ‌రిగించాలి. త‌రువాత ఈ నీటితో ఆవిరి ప‌ట్టుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల శ్వాస సంబంధిత స‌మ‌స్య‌లు త‌గ్గు ముఖం ప‌డతాయి. ఈ మొక్క‌కు విష ప్ర‌భావాన్ని త‌గ్గించే శ‌క్తి కూడా ఉంది. పాము కాటుకు గురి అయిన‌ప్పుడు ఈ మొక్క ఆకుల నుండి ర‌సాన్ని తీసి పాము కాటుకు గురి అయిన చోట రాయ‌డం వ‌ల్ల విష ప్ర‌భావం కొంత మేర త‌గ్గుతుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. కీళ్ల నొప్పుల‌ను త‌గ్గించ‌డంలో కూడా ఆయుర్వేదంలో ఈ మొక్క‌ను ఔష‌ధంగా ఉప‌యోగిస్తారు. ఈ మొక్క ఆకుల‌ను వేడి చేసి కీళ్ల నొప్పుల‌పై ఉంచి క‌ట్టుక‌ట్టాలి. ఇలా రోజూ చేస్తూ ఉండ‌డం వ‌ల్ల క్ర‌మంగా నొప్పులు త‌గ్గుతాయి. అలాగే త‌లంబ్రాల మొక్క‌ల‌ను ఆముదంతో క‌లిపి మెత్త‌గా నూరాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని కీళ్ల నొప్పుల‌పై ఉంచి క‌ట్టుక‌ట్టాలి.

రాత్రి ప‌డుకునే ముందు ఈ క‌ట్టుక‌ట్టి ఉద‌యాన్నే తీసి వేయాలి. ఇలా నెల రోజుల పాటు చేయ‌డం వల్ల కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు త‌గ్గుతాయి. దోమ‌ల‌ను నివారించ‌డంలో కూడా తలంబ్రాల మొక్క ఆకులు మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఈ మొక్క‌ల‌ను కాల్చి ఇంట్లో ధూపంలా వేయ‌డం వ‌ల్ల దోమ‌లు న‌శిస్తాయి. ఈ మొక్క పూల‌ను కూడా క్ష‌య వ్యాధికి త‌యారు చేసే సాంప్ర‌దాయ ఔష‌ధాల్లో విరివిరిగా ఉప‌యోగిస్తారు. ఈ విధంగా త‌లంబ్రాల మొక్క మ‌న‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని దీనిని వాడ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

Tags: Joint Painthalambrala mokka
Previous Post

Chitti Pesarattu : చిట్టి పెస‌రట్ల‌ను ఇలా చేసి తింటే.. వాహ్వా అనాల్సిందే..!

Next Post

Boondi Mixture : స్వీట్ షాపుల్లో ఇచ్చే విధంగా బూందీ మిక్చ‌ర్.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు..

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025

POPULAR POSTS

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
September 26, 2025

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.