Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home politics

దుందుడుకు స్వభావి అయిన డోనాల్డ్ ట్రంప్ ని అమెరికా ప్రజలు రెండవసారి అధ్యక్షుడిగా ఎలా ఎన్నుకున్నారు?

Admin by Admin
April 5, 2025
in politics, వార్త‌లు
Share on FacebookShare on Twitter

1950 తర్వాత ప్రపంచ వ్యాప్తంగా జాతీయ భావనలు మొదలయ్యాయి. క్రికెట్ లో గెలిస్తేనే జబ్బలు చరుచుకునే మనం అందరూ సుపర్ పవర్ అని భావించే అమెరికా ట్రంప్ ను రెండోసారి గెలిపించుకుంటే స్వార్ధపరులెలా అవుతారో మేధావులే చెప్పాలి. ట్రంప్ రెండోసారి గెలవడానికి, అమెరికా ప్రజానీకం ఎందుకు అవకాశం ఇచ్చిందో ఓ సారి చూద్దాం. బైడెన్ పవర్ లోకి వచ్చేసరికి అయన వయసు 79. అపార రాజకీయ అనుభవం, ఎదుర్కొన్న ఎన్నో ఒడిదుడుకులు. జీవితం లో ఆయన సాధించిన చివరి అత్యున్నత పదవి అమెరికన్ అధ్యక్ష పదవి. ట్రంప్ నుండి వారసత్వం గా బైడెన్ కరోనా సమస్య ను స్వీకరించాడు. బైడెన్ వచ్చిన 17 నెలల వరకు అమెరికా లో కరోనా తో చనిపోయిన వారి సంఖ్య పది లక్షలు. ట్రంప్ హయాంలో లో 4లక్షలు ఈయన అకౌంట్ నుండి తీసేస్తే 6 లక్షలు.

వారి వార్త సంస్థ రాయిటర్ చెప్పినట్టు గా ఒక సాన్ఫ్రాన్సిస్కో లేదా సియాటల్ నగర జనాభాకు సమానం. 2023 మే నాటికి 11 లక్షల 61 వేలు. ముఖ్యంగా అవుట్ బ్రేక్ (వ్యాప్తి లేదా విస్పోటనం) కంట్రోల్ చేయడం లో పూర్తిగా విఫలం అయ్యాడు. ఒక సార్వత్రిక సమస్యపై పరిష్కారం దిశగా వాక్సినేషన్ కోసం ప్రయత్నిస్తే ఫార్మా కంపెనీల ప్రయోజనాలు కాపాడటానికి, సంపన్న దేశాలు సిండికేట్ అయ్యాయి. అమెరికా మూల సిద్ధాంతం అయిన కంట్రీ ఫస్ట్ వదిలేసి ప్రాఫిట్ ఫస్ట్ దారి లో వెళ్ళింది. ఉక్రెయిన్ కు బ్రహ్మాండమైన మద్దతు. 2022 లో రష్యా ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించిన క్షణం నుండి బైడెన్ దిగిపోయే వరకు 119.7 బిలియన్ డాలర్లు అమెరికా ఖర్చు పెట్టింది. (ఒక బిలియన్ డాలర్లు 7500 కోట్ల రూపాయల కు సమానం). అమెరికా ఫారిన్ పాలసీ ప్రకారం చూసినా నాటో సభ్య దేశాల వరకు మాత్రమే సహాయం చేయాలి. అది కూడా పర్యటనలు, చర్చలు, ఆంక్షలు ముందు చేసి ఆ తరువాత ఆర్థిక సాయం చేయాలి.

why americans elected donald trump second time

ఉక్రెయిన్ నాటో సభ్య దేశం కూడా కాదే? సభ్యత్వానికి అప్లై చేసింది అంతే! సభ్యత్వం రావాలంటే కనీసం అప్లై చేసుకున్న రెండు సంవత్సరాల తర్వాత మాత్రమే వస్తుంది. అది కూడా అన్నీ సభ్య దేశాలు అమోదిస్తేనే! నాటో మద్దతు లేకపోయినా, బైడెన్ రష్యా తో చర్చలు ఇనిషియేట్ చేసినా కనీసం ప్రపంచ దృష్టిలో శాంతి కోసం ప్రయత్నం చేసిన ఒక అధ్యక్షుడు గా చరిత్రలో మిగిలేవాడు. తర్వాత వచ్చిన ట్రంప్ దాన్ని కొనసాగించేవారు. నాటో లో సభ్యత్వం వచ్చినట్లయితే నాటో నిబంధనల ప్రకారం ఏ సభ్యత్వ దేశం కోసమైనా అన్నీ సభ్యత్వ దేశాలు ఆ ఒక్క సభ్యత్వ దేశం శత్రువు తో పోరాడాలి. అంటే ఉక్రెయిన్ దేశం లోకి నాటో సైన్యం వచ్చి రష్యా పై యుద్ధం ప్రకటించడమే తర్వాతి దశ. పక్కింటి వాడికి మనకు కొంత వరకు పడదు. అయినంత మాత్రాన పక్కింటి వాడు పాములాడించేవాడిని తన ఇంట్లో పెట్టుకుంటాను అంటే మనం ఊరుకుంటామా? నా ఇల్లు నా ఇష్టం అంటే వదిలేస్తామా? జెలెన్ స్కీ పంతం అదే. దానికి బదులుగా మీరు మీరు మాట్లాడుకోండి అని బైడెన్ అంటే సరిపోయేదానికి మూడేళ్ల పాటు యుద్ధం మంటలు ఎగదోశారు. సొంతంగా నిర్ణయం తీసుకోలేని నాటో సభ్య దేశాలు, ఇజ్రాయెల్ విషయం లో అతి ఉత్సాహం ప్రదర్శించాయి.

ఇగో కి పోయి వెనక్కి రాలేక , ఉన్న పరువు నిలబెట్టుకోలేక, ఖర్చులు తట్టుకోలేక మీ బాధ ప్రపంచం బాధ కావాలంటే ఎలా? అదే లెఫ్ట్ ఏకోసిస్టం, లెఫ్ట్ మీడియా, సోరోస్ ట్రంప్ పవర్ లో ఉంటే నీకు దేశం కన్నా బిజినెస్ ఎక్కువైంది అని విమర్శించేవాళ్ళు. యుద్ధాలు చేసే యుగం కాదిది అని అప్పటికి మోడీ చెప్పినా అది రష్యా ని ఉద్దేశించింది అని అమెరికా అండ్ కో పండగ చేసుకున్నాయి. హమాస్ బందీలలో అమెరికా వాళ్ళున్నా, అంత రియాక్షన్ చూపించ లేక పోయింది. అదుపులో లేని ద్రవ్యోల్బణం. బైడెన్ విఫలమైన మరో ఏరియా ద్రవ్యోల్బణం. అధికారం లో ఉన్నన్నాళ్ళు ఏటా 5.4% నికరం గా ఉండేది. ఇదే ట్రంప్ కు బాగా కలిసి వచ్చిన అంశం. 2024 మే లో ప్రైమరీ లను ఎన్నుకున్న అమెరికన్స్ లో 41% మంది ఈ ద్రవ్యోల్బణం శత్రువు బారిన పడ్డవారే.

ఆప్గనిస్తాన్ నుండి అమెరికా వైదోలగడం. నిజానికి ట్రంప్ మొదటి ధపా లోనే అమెరిక‌న్ సైన్యం వైదొలగాలని నిర్ణయం తీసుకున్నారు. హఠాత్తుగా 2021 ఆగష్టు లో అమెరికా సైన్యం వచ్చేసింది. అమెరికన్ ప్రజలు 53% మద్దతు పలికినప్పటికీ అంత సడెన్ గా రావడం వల్ల 7బిలియన్ డాలర్ల విలువైన ఆయుధ సంపత్తి అక్కడే వదిలేసి వచ్చింది. ఇది అక్కడ తాలిబాన్ కు ఎదురు తిరిగిన వారిని అణిచేందుకు పనికి వచ్చింది. దైవం అనుకూలించలేదు కాబట్టి గాని లేకపోతే పాకిస్తాన్ తో సత్సంబంధాలు ఉన్నట్టయితే అవి అక్కడ నుండి pok ద్వారా కాశ్మిర్ లోకి వచ్చేవి. అన్నీ ఆయుధాలు అక్కడే వదిలేయాల్సి రావడం లో కనిపించిన నిస్సహాయత సగటు అమెరికన్ దృష్టిలో బైడెన్ కు విఫల వీరుడి గా దక్కిన మరో గౌరవం.

వలసలను అరికట్టలేకపోవడం బైడెన్ కు మరో మైనస్ మార్క్ కట్టబెట్టింది. అమెరికన్ సిటిజన్ షిప్ యాక్ట్ 2021 బిల్లు (రిపబ్లికన్లు కొన్ని కారణాలతో తిరస్కరించారు) వంటివి ఎన్ని తెచ్చినా అక్రమ వలసలను ఏమాత్రం బైడెన్ యంత్రాంగం కంట్రోల్ చేయలేకపోయింది. వలసలపై డిబేటింగ్ లో బైడెన్ కు వచ్చిన ప్రజామోదం 31% అదే రిపబ్లికన్లకు (ట్రంప్) 41%. ఇదే బైడెన్ ను గణనీయంగా కిందికి దింపింది. అమెరికన్ జాతికి వలసల విషయం ఎలా ఎదుర్కోవాలో బైడెన్ చెప్పడం లో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. చివరివరకు బైడెన్ మళ్ళీ పోటీ చేస్తాననడం తో అమెరికన్లు డిస్పరేట్ అయ్యారు.చాలా ప్రముఖమైన ఎలక్షన్ విరాళాలు ఇచ్చే దాతలు, సొంత డెమోక్రాటిక్ పార్టీ పెద్దలు బైడెన్ పట్ల విముఖత చూపించినా అధ్యక్ష పదవికి మళ్ళీ రేస్ లో ఉంటాననడం అయన పాత్ర నిడివి తగ్గించింది. చివరికి అధ్యక్ష అభ్యర్థుల ముఖా ముఖి డిబేట్స్ లో ట్రంప్ ముందు తేలిపోవడం తో అయిష్టంగానే తప్పుకున్నారు. హుందాగా తలవంచి, పక్కకు తప్పుకుపోకపోవడంతో అయన లెగసీ ముగిసింది.

డిబేట్స్ లో అయన తడుముకున్న తీరు తో ఓటర్లు రిపబ్లికన్ పార్టీ కి పట్టం కట్టారు. కమల హరీస్ ఓటమి అమెరికన్ సగటు వ్యక్తిత్వం తెలియచేస్తుంది. ట్రంప్ డిసైడ్ అయ్యాక, ఉపాధ్యక్షుడు గా కూడా రిపబ్లికన్ వైపే చూస్తారు. ఎందుకంటే రెండు వేర్వేరు పార్టీలకుచెందిన అధ్యక్ష, ఉపాధ్యక్షులు కలిసి పని చేయడం కష్టం అని భావిస్తారు కాబట్టి. మీడియా కమల ను బాగా హైప్ చేసింది. లాస్ట్ మినిట్ లో బైడెన్ తప్పుకున్నాక ఆమె ఎంట్రీ కంఫర్మ్ అయింది. సగటు అమెరికన్ అంతవరకూ వెయిట్ చేయలేడు. కాశ్మీరీ ప్రజలారా మీరు ఒంటరి వారు కాదని మీకు గుర్తు చేస్తున్నాము. పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నాం. ఏదన్నా తేడా వస్తే జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది : కాశ్మీర్ లో 370 రద్దు చేసిన రెన్నేళ్ళ తర్వాత టెక్సస్ లో ఓ ఈవెంట్ లో కమలా హరీస్ చెప్పిన మాటలివి.

మన భారత కోణంలో చుస్తే బాంగ్లాదేశ్ లో అల్లర్లకి పరోక్షంగా కారణం ఎవరు? బైడెన్ కు తెలియకుండానే బాంగ్లాదేశ్ లో ఆలా జరిగిందా? కొంత మంది మదిలో ట్రంప్ దుందుడుకు స్వభావి అవ్వొచ్చు గాక ఒక బిజినెస్ మాన్ గా, ఒక అమెరికన్ పౌరుడిగా తన దేశం తనకు ముద్దు అనుకోవడం లో తప్పులేదు. దేశాలు పట్టి తిరుగుతూ తన ప్రజల్ని యుద్ధం లో ముంచేసి, వాళ్ల భవిష్యత్తును చీకటి చేసిన జెలెంస్కీ మాత్రం గొప్ప దేశ భక్తుడు. అదే తన దేశం తనకు ముఖ్యం అంటున్న ట్రంప్ మాత్రం దుందుడుకు వ్యక్తి…ఏంటీ లాజిక్..?

Tags: donald trump
Previous Post

బాగా డిప్రెష‌న్‌లో ఉంటే ఓదార్పు కోసం ఇలా చేయాల‌ట‌..!

Next Post

బట్టల ఖరీదు చూసి కస్టమర్ ను అవమానించిన షాప్ సిబ్బంది.. అద్భుతమైన రీతితో ప్రతీకారం తీర్చుకున్న యువతి..

Related Posts

Off Beat

ఏప్రిల్ 1వ తేదీన ఫూల్స్ డే అని ఎందుకు అంటారో తెలుసా..? వెనకున్న ఆసక్తికర విషయం ఇదే..!

July 21, 2025
vastu

బెడ్‌రూమ్‌లో ఈ వాస్తు చిట్కాల‌ను పాటిస్తే.. దంప‌తుల మ‌ధ్య అస‌లు గొడ‌వ‌లే ఉండ‌వు..

July 21, 2025
information

రైలు కడ్డీలు ఎందుకు అడ్డంగానే ఉంటాయి ? దానికి కారణం ఏంటి ? ?

July 21, 2025
ఆధ్యాత్మికం

న‌ర దిష్టి, న‌ర‌ఘోష త‌గ‌ల‌కుండా ఉండాలంటే.. ఈ చిన్న ప‌ని చేయండి చాలు..!

July 21, 2025
పోష‌ణ‌

రోజూ స్ట్రాబెర్రీల‌ను తింటే క‌లిగే అద్బుత‌మైన ప్ర‌యోజ‌నాలు ఇవే..!

July 21, 2025
హెల్త్ టిప్స్

ఇన్సులిన్ తీసుకుంటున్నారా..? అయితే ఈ పొర‌పాట్ల‌ను చేయకండి..!

July 21, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.