Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home viral news

బట్టల ఖరీదు చూసి కస్టమర్ ను అవమానించిన షాప్ సిబ్బంది.. అద్భుతమైన రీతితో ప్రతీకారం తీర్చుకున్న యువతి..

Admin by Admin
April 5, 2025
in viral news, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఒక యువతి షాపింగ్ కోసం లూయిస్ విట్టన్ షోరూమ్‌కు వెళ్లింది. అక్కడ ఆమె హెర్మేస్ హ్యాండ్ బ్యాగ్ కొనాలనుకుంది. అయితే ఆ షాప్ లో ఉన్న సిబ్బంది ఆమెతో సరిగ్గా మాట్లాడలేదు. అంతేకాదు ఆమెకు వస్తువులను చూపించడంలో కూడా పెద్దగా ఆసక్తిని చూపించలేదు. ఆమె పిలిచినా షాప్ సిబ్బంది హాజరు కాలేదు. దీంతో ఆ యువతి తనకు షాప్ లో అవమానం జరిగింది అని భావించింది. ఈ ఘటన గురించి సదరు లగ్జరీ బ్రాండ్‌ కంపెనీ హెడ్‌క్వార్టర్‌కు ఫిర్యాదు చేసినా సరైన స్పందన రాలేదు. విసిగిపోయి ఓడిపోయిన ఆమె ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది.

నిజమైన వ్యాపారస్తుల నైజం ఏమిటంటే చిన్న పెద్ద అనే తేడా లేకుండా కస్టమర్స్ కు తమ సర్వీస్ ను అందించడం.. అయితే కొంతమంది దుకాణదారులు మాత్రం ఎల్లప్పుడూ తన పెద్ద కస్టమర్‌లకు మాత్రమే సమయాన్ని కేటాయిస్తారు. ఇక్కడ పెద్ద కస్టమర్‌లు అంటే ఎక్కువ బిల్లులు చేసే కస్టమర్‌లు. అయితే వాస్తవంగా కస్టమర్ వ్యాపారస్తులకు దేవుడు అనే సామెత ని పక్కన పెట్టమే అన్న మాట. దుకాణదారులు చిన్న కస్టమర్లతో మాట్లాడటానికి కూడా ఇష్టపడరు. లేదా సరిగ్గా వారిని ట్రీట్ చేయరు. ఇలాంటి అవమానాన్ని చాలా మంది మౌనంగా సహిస్తారు. మరికొందరు మాత్రం తమకు జరిగిన అవమానానికి తగిన విధంగా ప్రతీకారం తీర్చుకుంటారు. ఇలాంటి ఘటనే ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. దుకాణదారుడి మీద ఒక కస్టమర్ అద్భుతమైన రీతిలో ప్రతీకారం తీర్చుకుంది.

a girl took revenge on those who insulted her

మనుషులకు కోపం, అసూయ చాలా సాధారణం అని మనందరికీ తెలుసు. కోపాన్ని జీర్ణించుకునే వ్యక్తులు కొందరు ఉన్నప్పటికీ, చాలా మంది తీవ్రంగా ప్రతీకారం తీర్చుకుంటారు. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఈ వార్త కూడా అలాంటిదే.. ఒక యువతి షాపింగ్ కోసం లూయిస్ విట్టన్ షోరూమ్‌కు వెళ్లింది. అక్కడ ఆమె హెర్మేస్ హ్యాండ్ బ్యాగ్ కొనాలనుకుంది. అయితే ఆ షాప్ లో ఉన్న సిబ్బంది ఆమెతో సరిగ్గా మాట్లాడలేదు. అంతేకాదు ఆమెకు వస్తువులను చూపించడంలో కూడా పెద్దగా ఆసక్తిని చూపించలేదు. ఆమె పిలిచినా షాప్ సిబ్బంది హాజరు కాలేదు. దీంతో ఆ యువతి తనకు షాప్ లో అవమానం జరిగింది అని భావించింది.

ఈ ఘటన గురించి సదరు లగ్జరీ బ్రాండ్‌ కంపెనీ హెడ్‌క్వార్టర్‌కు ఫిర్యాదు చేసినా సరైన స్పందన రాలేదు. విసిగిపోయి ఓడిపోయిన ఆమె ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. అటువంటి పరిస్థితిలో ఆ యువతి తన ప్రతీకారం తీర్చుకోవడానికి రెండు నెలలు ఎదురు చూసింది. ఆమె 600,000 యువాన్లను (మనదేశ కరెన్సీలో సుమారు ₹ 70 లక్షలు) సేకరించింది. ఆ డబ్బులను తీసుకుని మళ్ళీ లూయిస్ విట్టన్ షోరూమ్‌కు వెళ్ళింది. తాను షాపింగ్ చేస్తానని ఇంతలో నోట్లను లెక్కించమని సిబ్బందిని కోరింది. ఈ సమయంలో ఆమె అక్కడ షాపింగ్ చేయడం మొదలు పెట్టింది. డబ్బులు చిల్లరగా ఇవ్వడం అది కూడా పెద్ద అమౌంట్ కావడంతో ఆ సిబ్బందికి లెక్కించేందుకు రెండు గంటల సమయం పట్టింది.

ఇలా డబ్బులు లెక్కిస్తున్న సమయంలో ఆ యువతి షాప్ లోపల ఉన్న వస్తువులను చూడడం మొదలు పెట్టింది. ప్రతి వస్తువును జాగ్రత్తగా చూసింది. రకరకాల వస్తువులను ఎంచుకోవడం ప్రారంభించింది. ఇంతలో డబ్బులు లెక్కపెట్టడం ముగిసిన విషయం గమనించిన.. వెంటనే.. ఆ యువతి ఇప్పుడు నాకు షాపింగ్ చేయడం ఇష్టం లేదు. నేను వెళ్తున్నా.. మళ్ళీ వస్తా అంటూ తాను ఇచ్చిన డబ్బులు తీసుకుని వెళ్లిపోయింది. ఈ మొత్తం ఘటనను సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం ఓ రేంజ్ లో జనాల్లో వైరల్‌గా మారింది. ఇది చూసిన తర్వాత అందరూ ఆశ్చర్యపోయారు. అంతేకాదు చాలా మంది దీనిని టిట్ ఫర్ టాట్ అంటారని కామెంట్ చేస్తున్నారు.

Tags: girlshop
Previous Post

దుందుడుకు స్వభావి అయిన డోనాల్డ్ ట్రంప్ ని అమెరికా ప్రజలు రెండవసారి అధ్యక్షుడిగా ఎలా ఎన్నుకున్నారు?

Next Post

ప్రియదర్శి నటించిన కోర్ట్ మూవీ ఎలా ఉంది?

Related Posts

Off Beat

ఏప్రిల్ 1వ తేదీన ఫూల్స్ డే అని ఎందుకు అంటారో తెలుసా..? వెనకున్న ఆసక్తికర విషయం ఇదే..!

July 21, 2025
vastu

బెడ్‌రూమ్‌లో ఈ వాస్తు చిట్కాల‌ను పాటిస్తే.. దంప‌తుల మ‌ధ్య అస‌లు గొడ‌వ‌లే ఉండ‌వు..

July 21, 2025
information

రైలు కడ్డీలు ఎందుకు అడ్డంగానే ఉంటాయి ? దానికి కారణం ఏంటి ? ?

July 21, 2025
ఆధ్యాత్మికం

న‌ర దిష్టి, న‌ర‌ఘోష త‌గ‌ల‌కుండా ఉండాలంటే.. ఈ చిన్న ప‌ని చేయండి చాలు..!

July 21, 2025
పోష‌ణ‌

రోజూ స్ట్రాబెర్రీల‌ను తింటే క‌లిగే అద్బుత‌మైన ప్ర‌యోజ‌నాలు ఇవే..!

July 21, 2025
హెల్త్ టిప్స్

ఇన్సులిన్ తీసుకుంటున్నారా..? అయితే ఈ పొర‌పాట్ల‌ను చేయకండి..!

July 21, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.