Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home ఆరోగ్యం

పాల‌లో నెయ్యి క‌లుపుకుని తాగ‌వ‌చ్చా ? తాగితే ఏం జ‌రుగుతుంది ?

Admin by Admin
August 29, 2021
in ఆరోగ్యం, ప్ర‌శ్న - స‌మాధానం
Share on FacebookShare on Twitter

ఎంతో పురాతన కాలం నుంచి మ‌నం రోజూ తినే ఆహారాల్లో నెయ్యి ఒక భాగంగా ఉంది. నెయ్యి ఎంతో రుచిగా ఉంటుంది. రోజూ అన్నంలో కూర వేసుకుని అందులో నెయ్యి క‌లిపి తింటారు. చిన్నారుల‌కు త‌ల్లులు నెయ్యిని తినిపిస్తుంటారు. దీంతో వారిలో ఎదుగుల స‌రిగ్గా ఉంటుంది. ఎముక‌లు దృఢంగా, ఆరోగ్యంగా పెరుగుతాయి. నెయ్యిని తీసుకోవ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

పాల‌లో నెయ్యి క‌లుపుకుని తాగ‌వ‌చ్చా ? తాగితే ఏం జ‌రుగుతుంది ?

భార‌తీయులు నెయ్యి, పాలు అంటే ఎంతో ఇష్ట ప‌డ‌తారు. భార‌తీయులంద‌రూ ఈ రెండు ఆహారాల‌ను తీసుకుంటుంటారు. అయితే ఈ రెండింటినీ క‌లిపి తీసుకోవ‌చ్చా ? అంటే.. అందుకు నిపుణులు అవున‌నే స‌మాధానం చెబుతున్నారు.

పాల‌లో ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు ఉంటాయి. పాల‌లో ఉండే ట్రిప్టోఫాన్ అనే స‌మ్మేళ‌నం మ‌న శ‌రీరంలో సెర‌టోనిన్ ఉత్ప‌త్తి అయ్యేలా చేస్తుంది. దీంతో నాడులు ప్ర‌శాంతంగా మారుతాయి. సెర‌టోనిన్ వ‌ల్ల శ‌రీరంలో మెల‌టోనిన్ కూడా పెరుగుతుంది. దీంతో నిద్ర చ‌క్క‌గా ప‌డుతుంది. అందుక‌నే పాల‌ను తాగాల‌ని చెబుతుంటారు.

రాత్రి నిద్ర‌కు ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌ను తాగ‌డం వ‌ల్ల నాడులు ప్ర‌శాంతంగా మారి మ‌న‌స్సు హాయిగా ఉంటుంది. మ‌న శ‌రీరంలో మెల‌టోనిన్ పెర‌గ‌డ‌మే ఇందుకు కార‌ణం. పాల వ‌ల్ల మెల‌టోనిన్ పెరుగుతుంది. ఇది ఒక హార్మోన్ అయిన‌ప్ప‌టికీ న్యూరో ట్రాన్స్‌మిట‌ర్ లా ప‌నిచేస్తుంది. దీంతో నిద్ర చ‌క్క‌గా ప‌డుతుంది. పాల‌లో ఉండే ప్రోటీన్లు మెద‌డులో ఉండే గాబా (GABA) రిసెప్ట‌ర్ల‌ను ఉత్తేజం చేస్తాయి. దీంతో ఆందోళ‌న‌, ఒత్తిడి త‌గ్గుతాయి. నిద్ర బాగా ప‌డుతుంది.

రాత్రి నిద్ర‌కు ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌ను తాగ‌డం వ‌ల్ల నిద్ర బాగా ప‌డుతుంది. మెట‌బాలిజం పెరుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గి బ‌రువు నియంత్ర‌ణ‌లో ఉంటుంది. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

అయితే పాల‌లో నెయ్యి క‌లిపి తాగితే ఇంకా ఎక్కువ ప్రయోజ‌నాలు క‌లుగుతాయి. నెయ్యిలో ఉండే ప్రోటీన్లు కీళ్ల దృఢ‌త్వాన్ని త‌గ్గిస్తాయి. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి క‌నుక ఫ్రీ ర్యాడిక‌ల్స్ వ‌ల్ల క‌లిగే న‌ష్టం త‌గ్గుతుంది. దీంతో క‌ణాలు సుర‌క్షితంగా ఉంటాయి.

రాత్రి నిద్ర‌కు ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌లో ఒక టీస్పూన్ నెయ్యిని క‌లిపి తాగితే జీర్ణ‌శ‌క్తి పెరుగుతుంది. మెట‌బాలిజం మెరుగు ప‌డుతుంది. మ‌నం తినే ఆహారాల్లో ఉండే పోష‌కాల‌ను శ‌రీరం స‌రిగ్గా శోషించుకుంటుంది. అందుకు గాను పాలు, నెయ్యిలో ఉండే ఎంజైమ్‌లు స‌హాయం చేస్తాయి. ఈ క్ర‌మంలో నాడులు ప్ర‌శాంతంగా మారి నిద్ర‌లేమి స‌మ‌స్య త‌గ్గుతుంది.

గ‌ర్భిణీలు కూడా ఈ విధంగా పాల‌లో నెయ్యి క‌లిపి తాగ‌వ‌చ్చు. దీని వ‌ల్ల బిడ్డ ఎదుగుద‌ల స‌రిగ్గా ఉంటుంది. అనేక పోష‌కాలు ల‌భిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు.

Tags: gheemilkనెయ్యిపాలు
Previous Post

స్విస్ బాల్‌తో ఈ విధంగా వ‌ర్క‌వుట్ చేయండి.. ఎలాగో వివ‌రిస్తున్న న‌టి భాగ్య‌శ్రీ‌.. వీడియో..

Next Post

వ్యాయామం ఎక్కువ‌గా చేశారా ? అయితే వీటిని తీసుకోండి.. ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది..!

Related Posts

ప్ర‌శ్న - స‌మాధానం

డ‌యాబెటిస్ ఉన్నవారు రోజుకు అస‌లు ఎన్ని నీళ్ల‌ను తాగాలి..?

July 7, 2025
ప్ర‌శ్న - స‌మాధానం

4 ఏళ్ల నుంచి షుగ‌ర్‌కు మందులు వాడుతున్నా.. ఆయుర్వేద మందులతో త‌గ్గుతుందా..?

July 5, 2025
ప్ర‌శ్న - స‌మాధానం

ప‌సుపు క‌లిపిన పాల‌ను గ‌ర్భిణీలు తాగ‌వ‌చ్చా..?

June 9, 2025
ప్ర‌శ్న - స‌మాధానం

భోజ‌నం చేసేట‌ప్పుడు మ‌ధ్య‌లో నీళ్ల‌ను తాగ‌కూడదా..? ఎందుకు..?

June 2, 2025
ప్ర‌శ్న - స‌మాధానం

డ‌యాబెటిస్ ఉన్న‌వారు మ‌ద్యం సేవించ‌వ‌చ్చా..? ట్యాబ్లెట్లు వేసుకుంటే ఏం జ‌రుగుతుంది..?

May 29, 2025
ప్ర‌శ్న - స‌మాధానం

కాళ్ల దుర‌ద అధికంగా ఉంది.. ఇది త‌గ్గాలంటే ఏం చేయాలి..?

May 25, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.