మహిళలకు షుగర్ వ్యాధి వుందంటే, గుండె జబ్బులు తేలికగా వస్తాయని బ్రిటీష్ రీజినల్ హార్ట్ స్టడీ, బ్రిటీష్ వుమన్స్ హెల్త్ స్టడీ లు కలసి చేసిన అధ్యయనంలో తేలింది. 60 నుండి 79 సంవత్సరాల వయసుకల 7,500 మంది పురుషులను, స్త్రీలను ఈ అధ్యయనంలో స్టడీ చేశారు. రీసెర్చర్లు ఇన్సులిన్ తీసుకుంటున్నడయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ కల మహిళలను, వివిధ రకాల గుండె జబ్బుల వారిని పరిశీలించారు.
డయాబెటీస్ వ్యాధి కలిగిన మహిళలు బరువు సంతరించుకోవటం కూడా చాలా త్వరగా వుంటోందని, త్వరితంగా పెరిగిన బరువు డయాబెటీస్ వ్యాధిని తీవ్రతరం చేయటమే కాక, రక్తనాళాలలో త్వరితంగా అడ్డంకులేర్పరుస్తుందని, ఈ ప్రక్రియ పురుషులలో కంటే కూడా మహిళలలో వేగంగా జరుగుతుందని ఆ కారణంగా కూడా డయాబెటీస్ కల మహిళలు గుండె సంబంధిత రోగాలబారిన పడుతున్నారని రీసెర్చర్లు తెలుపుతున్నారు.
డయాబెటీస్ లేని మహిళలకంటే కూడా డయాబెటీస్ వున్న మహిళలకు గుండె జబ్బులు అధికంగా వస్తున్నాయని, డయాబెటీస్ వ్యాధి వున్న మహిళల నడుము కొలత లేని మహిళల నడుము చుట్టుకంటే షుమారుగా 8.2 సెం.మీ. అధికంగా వుందని వీరు చెపుతున్నారు. పురుషులకు డయాబెటీస్ వున్నప్పటికి గుండె జబ్బులు రావటమనేది డయాబెటీస్ వున్న స్త్రీలకంటే కూడా తక్కువేనని రీసెర్చి తెలిపింది. డయాబెటీస్ వున్న మహిళలు, తమ శారీరక బరువును తరచుగా నియంత్రించుకోవాలని కూడా వీరు సూచించారు.